భక్తి కథలు

శ్రీ సాయ లీలామృతం-35

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకసారి శిరిడీలోని దాసగణు అనునతుడు బొంబాయి వెళ్లాడు. అక్కడ సాయి భజనలు చేస్తూ కాలం గడిపాడు. దాసుగణు భజనలు వినడానికి ముల్గీ అనే అతను వచ్చాడు. భజన అనంతరం ముల్గీ దాసుగణు దగ్గరకు వచ్చాడు.
‘మీరు ఎవరు ఎక్కడనుంచి వచ్చారు. నేను కలల ఒక ఫకీరును చూశాను. అతడు శిరీడీబాబా అని మా వదిన చెప్తోంది. మీకేమన్నా అతడి గురించి తెలుసా’ అని అడిగాడు.
దాసుగణు ‘అయ్యా, నేను శిరిడీవాసినే. అక్కడే ఉంటాను. కాని అప్పుడప్పుడు ఇలా ఊరూరూ తిరిగి భజనలు చేస్తూ కాలం గడుపుతాను. మీరు చూసిన ఫకీరు ఎవరో నాకు ఎలా తెలుస్తుంది. ఇదిగో ఈ బాబా మా శిరిడీలో ఉంటారు. ఈ బాబా భజనలే నేను చేస్తుంటాను అని చెప్పి బాబా ఫొటో ఒకటి ముల్గీకి చూపించారు.
ముల్గీ వెంటనే అవును నిజమే, ఇతనిని నేను కలలో చూశాను. మా వదిన కూడా ఇతని ఫొటోనే చూపించింది. అయితే మీరు ఇతడిని సజీవంగా చూశారా? మీరు ఎప్పుడైనా మాట్లాడారా అని ఆశ్చర్యం అడిగాడు.
దాసుగణు బాబా గురించిన వివరాలు చెప్పాడు. ముల్గీ ఆనందంతో నేను కూడా మీతో వస్తాను. బాబా దర్శనం చేసుకొంటాను అని చెప్పి దాసుగణుతో పాటు శిరీడీ వచ్చాడు. బాబా దర్శనం చేసుకొన్నాడు.
చాలా రోజుల క్రితం సంగతి
కోపర్గావ్‌లో బాబాబాటే అనేవారు మమల్తదారుగా ఉండేవాడు. అతడు ఎపుడూ రాముడిని, కృష్ణుని పూజించేవాడు. కాని ఎవరైనా శిరిడీలోని బాబా గురించి చెప్తే మామూలు మనుషులను పూజించడమేమిటి? కేవలం భగవంతుడిని పూజించాలి కాని నేను మాత్రం ఇట్లాంటి పనులు చేయను అనేవాడు. అతని మిత్రులందరికీ బాబా అంటే అభిమానం ఉండేది. అందుకే వారు ఎప్పుడూ బాబాబాటేతో నీవు ఒకసారి మాతో శిరిడీ రా. అక్కడికి వచ్చాక ఆ బాబాను చూశాక నీకేమి అనిపిస్తే అది చేయి. బాబా మహాత్ముడు అని చెప్పేవారు.
ఒకసారి అనుకోకుండా బాబాబాటే శిరీడీ వచ్చాడు. మసీదులో ఉన్న బాబాను చూద్దామని మసీదుకు వచ్చాడు. అతడు మసీదులోపల ప్రవేశించగానే ఎంతో ప్రశాంతంగా అనిపించింది. తరువాత బాబాను చూచాడు. కాని నమస్కారమేమీ చేయలేదు. కాని బాబాబాటేలో ఎంతో మార్పు వచ్చినట్లు ఆయనకు ఆయనే అనుకొనేవాడు. దూరంగా కూర్చుని కేవలం బాబాను చూస్తుండేవాడు. ఇలా వారం రోజులు గడిచాయి. బాబాబాటే మిత్రులు కూడా శిరిడీ వచ్చారు. వారు కూడా బాటేతోపాటు బాబా దర్శనం చేసుకొనేవారు. కాని అటు బాబా కాని, ఇటు బాటే కాని మాట్లాడుకునేవారు కాదు. కాని ఒకరినొకరు చూస్తూండేవారు.
ఇట్లా కొంతకాలం గడిచింది.
ఒకనాడు మహిల్సాపతి తనకు భగవద్గీత చదవాలని అనిపిస్తోందని బాబాతో చెప్పాడు. దానిదేముంది. అందరూ వచ్చాక నీవు చదువు. అందరూ కూడా వింటారు అని బాబా అన్నారు.
మహిల్సాపతి భగవద్గీతను చదవడం మొదలుపెట్టాడు.
చదువుతున్నాడు. అందరూ శ్రద్ధగా వింటున్నారు.
‘‘బాబా ఈ పంచమ అధ్యాయంలో ‘‘లభస్తే బ్రహ్మ నిర్వాణ మృషయః..’ అన్న శ్లోకం వుంది కదా, దాని అర్థం మీరు చెప్పండి గురుదేవా’’ అన్నాడు మహిల్సాపతి.
బాబా ‘అందులో ఏముంది మహీ! ఎవరైన సరే పరమాత్ముణ్ణి దర్శనం చేసుకొంటారో దర్శనం అయిన వెంటనే వారిలో అప్పటివరకు వున్న సంశయాలన్నీ నివృత్తి అయిపోతాయి. ‘యతాత్మానః’ అంటే జితేంద్రియులైన బ్రహ్మజ్ఞానులు అయిన పురుషులు, శాంత పరబ్రహ్మను పొందుతారు. మనం ఏ మహాత్ముడిని పరమాత్మ రూపుగా భావించి దర్శనం చేసుకొంటామో వారే బ్రహ్మజ్ఞానులైతే వెనువెంటనే వీరికి సంపూర్ణ ప్రశాంతత దొరుకుతుంది’’ అని అన్నారు.
-ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743