భక్తి కథలు

శ్రీ సాయ లీలామృతం-36

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెనువెంటనే దూరంగా కూర్చుని వింటున్న బాటే వెంటనే నిల్చున్నాడు.
అతడు ఇలా చెప్పాడు.
అదిగో ఆ పరబ్రహ్మమే ఈ శిరిడీ సాయి. నేను ఏదో అనుకొన్నాను. నా అజ్ఞానంతో ఎన్నో మాట్లాడాను. కాని ఈ శిరీడీలో కాలు మోపాను. నాలో ఏదో తెలియని శాంత భావం మొలకెత్తింది. ఈ మసీదుకు వచ్చాను. ఈ బాబాను చూచాను. అంతే అప్పటివరకు ఇతడు ఎవరు? ఎక్కడ నుంచి వచ్చాడు? ఇతనికి నమస్కారం చేయవచ్చునా లేదా అన్న సంశయాత్మక మనస్సుతో కొట్టుమిట్టాడేవాడిని. కాని ఎప్పుడైతే ఈ బాబాను చూచానో ఇక అప్పటినుంచి నాకు ఈ గదిని వదలి వెళ్లాలని అనిపించడంలేదు. ఈ బాబానే నేను పూజించే రాముడు, కృష్ణుడు, శివుడు, అమ్మవారు అని నాకు అనిపిస్తోంది’’ అని కనుల నీరు కారుతుండగా చెప్పాడు.
వెంటనే బాబా ‘‘ఓ బాటే ఇదిగో ఇలారా! నీవు ఏమనుకొంటున్నావు. నీవు పూజించే రాముడు కృష్ణుడు వేరు వేరు అనుకొంటున్నావా? అసలీ లోకంలో ఉన్నది అంతా భగవంతుడే కదా. అన్యమేమున్నది? ఎవరైతే ననే్న ధ్యానిస్తుంటారో వారిని నేను కాక మరెవ్వరు కాపాడుతారు’’ అన్నాడు.
‘‘బాబా అది అది.. అంటే నేను ఇప్పటివరకు..’’ ఏదో చెప్పబోయాడు బాటే.
‘‘దానినే చెప్పతున్నాను నేను. యే ప్యన్య దేవతా భక్తా యజనే్త శ్రద్ధ యాన్వితాః.. అంటే ఎవరికిష్టమైన దేవతలను శ్రద్ధాపూర్వకంగా పూజిస్తారో వారి పూజలన్నీ కూడా నాకే చెందుతాయి. వివిధ పేర్లతో ఉన్న నదులన్నీ ఎలాగైతే సముద్రంలోకి చేరుతాయో అట్లాగే ఎవరెవరు ఏయే దేవతలను పూజించినా అవి అన్నీ కూడా నాలోకే వస్తాయి’ అన్నాడు బాబా.
అక్కడున్నవారికి ఏమీ అర్థం కాలేదు.
బాబా వెంటనే ‘ఓ బాటే! ఇలారా’ అని పిలిచారు.
బాటే దగ్గరగా వచ్చారు.
వచ్చిన బాటేను ఆలింగనం చేసుకొన్నారు బాబా. వెంటనే తన దగ్గర ఉన్న శాలువాను బాటేమీద కప్పారు. అంతే అప్పటివరకు కన్నీరు కారుస్తున్న బాటే చిరునవ్వు నవ్వాడు.
ఇక ఆ తరువాత ఎప్పుడూ బాటే ఎక్కడికీ వెళ్లలేదు. మసీదులోనే ఉండేవాడు. ఎప్పుడూ బాబాను చూస్తూకూర్చునేవాడు. మారు మాట్లాడేవాడు కాడు. నిరంతరం తదేక ధ్యానావస్థలో ఉన్నాడా అని అందరికీ అనిపించేది.
అపుడే శ్యామా వచ్చాడు. అతడు వచ్చేటప్పటికి బాబా బాటేతో మాట్లాడుతూ ఉన్నారు. అందుకే శ్యామా వౌనంగా నమస్కారం చేసి అక్కడే కూర్చున్నారు. అక్కడ జరిగేవన్నీ చూస్తూ కూర్చున్నాడు.
బాటే వౌనంగా కూర్చోవడం చూచి శ్యామ అంతకుముందు తన జీవితంలో జరిగిన విషయాలను నెమరువేసుకొన్నాడు.
బాబా శ్యామాను చూచి జరిగిన విషయాలను తలచుకుంటున్నావా శ్యామా అన్నారు.
శ్యామా అపుడు ‘అవును బాబా!’ అన్నాడు. అక్కడున్నవారంతా ఆ జరిగిపోయిన విషయాలేమిటోమాకు చెప్పవచ్చు కదా అని అడిగారు.
అపుడు శ్యామ చెబుతాను వినండి.
చాలాకాలంక్రితం మాట.
నా చిన్నతనంలో నాకు బాగా జబ్బు చేసింది. ఆ జబ్బు దూరం చేయమని మా తల్లిగారు సప్తశృంగీ దేవతకు మొక్కుకున్నారు. నేను నా కుమారుడిని తీసుకోని నీ దర్శనానికి వస్తానని అనుకొన్నారట. ఆ తరువాత నాకు జబ్బు తగ్గిపోయింది. చాలాకాలం కూడా జరిగిపోయింది.
కాని మా అమ్మ మొక్కు చెల్లించలేదు. కొన్నాళ్ల క్రితం మా అమ్మ తను మర్చిపోయిన విషయం జ్ఞప్తికి తెచ్చుకుంది.
‘శ్యామా! నేను చిన్నప్పుడు నీకోసం సప్తశృంగి అమ్మవారికి మొక్కుకున్నాను. ఆ మొక్కును తీర్చాలి సుమా’ అంది శ్యామా తల్లి. -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743