భక్తి కథలు

శ్రీ సాయ లీలామృతం-37

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అమ్మా! బాబా పేర్లు వేరైనా భగవంతుడు ఒక్కడే అని చెబుతుంటారు. కనుక నీవు నేను బాబా దగ్గరకు వెళ్లి వద్దాం’ అని అన్నాడు శ్యామ.
తల్లీ కొడుకులు ఆ విధంగా మాట్లాడుకుని బాబా దగ్గరకు వచ్చారు. బాబా విషయమేమిటని అడిగి మరీ తెలుసుకున్నారు. అప్పుడు బాబా-
‘‘నీవు చెప్పేదంతా నిజమే! కాని ఎప్పుడు ఎవరు ఏమి చేయాలో కూడా భగవంతుడే నిర్ణయించి ఉంటాడు. నీవు సప్తశృంగి దేవాలయానికి వెళ్లి రావాల్సిందే. నీ తల్లిని కూడా తీసుకొని వెళ్లు’ అని అన్నారు.
బాబా ఆజ్ఞ ఇచ్చారు కనుక నేను మా అమ్మ ఇద్దరం సప్తశృంగీ దేవాలయానికి వెళ్లాం.
అక్కడే అసలైన వింత ఒకటి జరిగింది.
అక్కడ సప్తశృంగీ దేవాలయంలో కాకాజీ అనునతుడు పూజారిగా ఉండేవాడు.
అతడికి ఒకసారి అనుకోకుండా కష్టాలు వచ్చాయి. వాటిని దూరం చేయమని తాను నిత్యం కొలిచే దేవతైన సప్తశృంగీ దేవితో చెప్పుకున్నాడు. అతని కలలో సప్తశృంగీ దేవత కనిపించి ‘నీవు సాయినాథుడిని ఒకసారి దర్శనం చేసుకో’ అని ఆదేశించింది.
కాకాజీకి ఈ సాయినాథుని గురించి ఏమీ తెలియదు. తెలిసినవారిని అడిగాడు. వారుకూడా సాయినాథుడు ఎవరో మాకు తెలియదని చెప్పారు. అప్పటికింకా శిరిడీ సాధారణ గ్రామంగానే ఉండేది. కాకాజీ త్య్రయంబకం వెళ్లి వారం రోజులపాటు అక్కడే బస చేసి శివుని ఆరాధించి వచ్చాడు.
కాని మరల స్వప్నంలో దేవి కనిపించి ‘నీకు నేను చెప్పింది త్య్రయంబకేశ్వరుడిని సేవించమని కాదు శిరిడీ వాసుడైన సాయినాథుని గురించి చెప్పాను’ అంది.
కలలోనే కాకాజీ ‘అమ్మా! దానికి నీవే మార్గం చూపాలి నాకు. ఆ సాయినాథుని గురించి తెలియడంలేదు’ అని వేడుకున్నాడు.
ఆ దేవి ‘సరే నేనే నీకు మార్గం చూపిస్తానులే’ అందట.
ఆ తరువాత నేను మా అమ్మ అక్కడికి వెళ్లాము. ఆ పూజారినే మాకు బస ఏర్పాట్లు చేశాడు. ఆ తరువాత మాటల సందర్భంలో మేము శిరిడీ నుంచి వచ్చామని తెలుసుకొని ఈ సంగతి అంతా మాతో వివరంగా చెప్పాడు.
నేను చాలా ఆశ్చర్యంతో విన్నాను. ఇపుడు మీకు ఇదంతా చెప్పాను.
ఎక్కడ సాయినాథుడు! ఎక్కడ సప్తశృంగీదేవత! వీరిద్దరూ ఎప్పుడు ఎలా మాట్లాడుకున్నారు. మేము అక్కడికి వెళ్లడం, మావల్ల కాకాజీ సాయినాథుని గురిచి తెలుసుకోవడం.. ఆ తరువాత మాతోపాటు కాకాజీ ఈ శిరిడీ వచ్చి సాయినాథుని దర్శించుకోవడం జరిగాయి. ఇప్పటికి కూడా కాకాజీ అప్పుడప్పుడు శిరిడీ వచ్చి స్వామిని దర్శించుకుని వెళుతూ ఉంటాడు అని శ్యామా చెప్పాడు.
వారంతా ఆశ్చర్యంగా చూస్తూ బాబా సర్వాంతర్యామి. ఎపుడు తాను ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉంటాడు. ఎవరికి ఏమి ఇవ్వాలనుకొంటాడో వారికి అది ఇస్తాడు అని ఎవరికివారు అనుకోసాగారు.
***
ఒకసారి సపత్నేకర్ అతని భార్య శిరిడీ వచ్చి బాబాను దర్శించుకున్నారు. బాబాకి వారిద్దరూ నమస్కరించగానే ఆమెను ఆశీర్వదించాడు. కాని సపత్నేకర్‌ను ‘ఏయ్ ఏం పని నీకు ఇక్కడ, వెళ్లు ఇక్కడనుంచి వెళ్లిపో!’ అని గట్టిగా కసిరారు.
దానికి సపత్నేకర్ దూరంగా జరిగి నన్ను మాత్రం ఇలా ఎందుకు అంటున్నారు అని ఆలోచిస్తూ అక్కడే కూర్చుండిపోయారు.
బాబా మసీదు వెలుపలకి వెళ్లారు.
అక్కడే కూర్చున్న కాకాజీ సపత్నేకర్ విచారంగా ఉండడం చూసి ఆయన దగ్గరగా వచ్చి ‘మీరు ఏం బాధపడకండి. బాబా మరలా మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారు. మాబా చేతలను, మాటలను అర్థం చేసుకోవడం కాస్త కష్టం’ అని అన్నాడు.
-ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743