బిజినెస్

25 నెలల కనిష్టానికి టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి : టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా మూడో నెలలోనూ తగ్గుముఖం పట్టింది. తాజాగా గడచిన జూలైలో ఈ ద్రవ్యోల్బణ స్థాయి 25 నెలల కనిష్టం 1.08 శాతానికి చేరడం విశేషం. ప్రధానంగా ఆహార వస్తువులు, ఇంధనం, తయారీ వస్తువుల ధరలు దగ్గడం ద్వారా ఈ ద్రవ్యోల్బణ సరళీకరణ జరిగిందని బుధవారం నాడిక్కడ విడుదలైన ప్రభుత్వ గణాంకాలనుబట్టి తేటతెల్లం అవుతోంది. టోకు ధరల సూచీ (డబ్ల్యుపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గడచిన జూన్ మాసంలో 2.02 శాతంగా ఉండేది. అలాగే 2018 జూలైలో ఈ ద్రవ్యోల్బణం 5.27గా ఉండేది. కాగా గతంలో అత్యల్ప స్థాయి టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 2017 జూన్‌లో 0.9 శాతంగా ఉంది. ఇక వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రీటైల్ (చిల్లర వర్తక) ద్రవ్యోల్బణాన్ని ప్రధానంగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తన ద్రవ్య వినిమయ విధాన నిర్ణయానికి పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ సూచీ జూలైలో 3.15 శాతానికి తగ్గడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇందువల్ల అక్టోబర్‌లో తదుపరి జరిగే ఆర్బీఐ ద్రవ్య వినిమయ పరపతి విధాన నిర్ణాయక కమిటీ సమావేశం (సీఎంపీ)లో మళ్లీ రెపోరేట్ల కోతకు అవకాశం ఏర్పడిందని వాణిజ్య విశే్లషకులు అంచనా వేస్తున్నారు. ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం 15 శాతంకన్నా అధిక వెయిటేజీతో టోకుధరల ద్రవ్యోల్బణం (డబ్ల్యుపీఐ) బాస్కెట్ జూలైలో 6.15 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే మాసంలో ఈ శాతం 6.98గా ఉండేదని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలిపాయి. ఆహార వస్తువుల్లో ఆలుగడ్డ ధరలు జూలైలో వరుసగా 24.27 శాతం నుంచి 23.63 శాతానికి తగ్గుముఖం పట్టాయి. అలాగే కూరగాయల ధరలు ద్రవ్యోల్బణం సైతం 24.76 శాతం నుంచి 10.67 శాతానికి సరళతరమైంది. ఐతే పండ్ల ధరల ద్రవ్యోల్బణం మాత్రం గడచిన జూలై లో 15.38 శాతం పెరిగింది. గత ఏడాది జూన్‌లో ఈద్రవ్యోల్బణం 1.87 శాతంగా ఉండేది. కాగా ఇంధనం, విద్యుత్ రంగాల్లో టోకు ధరల ద్రవ్యోల్బణం 13.15 శాతం నుంచి 3.15 శాతానికి తర్వాత (-) 2.2 శాతానికి తగ్గడం విశేషం. ఆహారేతర వస్తువుల టోకు ధరల ద్రవ్యోల్బణం నెల వ్యవధిలో 5.06 శాతం నుంచి 4.29 శాతానికి తగ్గింది. అలాగే తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం 64.23 శాతం వెయిటేజీతో స్వల్పంగా 0.34 శాతానికి తగ్గింది. ఇలావుండగా సమీప భవిష్యత్తులో టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం స్తబ్థుగా ఉండే అవకాశం ఉం దని విశే్లషకులు భావిస్తున్నారు. ఇందుకు కారణం కనీస వస్తువుల ధరలు సరళతరం కావడం, ద్రవ్యలోటు వంటి అంశాలని, ఇందువల్ల దిగుమతులపై ధరల దిద్దుబాటుకు ఆటంకం కలుగుతుందని ఇక్రా ప్రిన్సిపల్ ఎకానమిస్ట్ అదితి నాయర్ అభిప్రాయపడ్డారు. కీలక డబ్ల్యుపీఐ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం వల్ల ఈ ఏడాది జూలైలోద్రవ్యోల్బణ సరళతరానికి వీలుకలిగిందని అన్నారు.