బిజినెస్
విద్యుత్ చార్జీల పెంపు వాయిదా..?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు అంశంపై ప్రభుత్వం మల్లాగుల్లాలు పడుతోంది. మార్చి నుంచి విద్యుత్ చార్జీలు పెంచాలని ప్రభుత్వం అనుకున్నప్పటికీ ఈ వారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో తాత్కాలికంగా విద్యుత్ చార్జీల పెంపు అంశం వాయిదా పడిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోపక్క విద్యుత్ సంస్థలు తమ నివేదికను అందించడానికి కొంత గడువు కావాలని ఈఆర్‌కి లేఖ రాశాయి. విద్యుత్ చార్జీల పెంపు ఏ ప్రాతిపదికన పెంచాలన్న యోచనలో సీఎం కేసీఆర్ సమాలోచన చేస్తున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. సామాన్యుడిపై భారం పడకుండా విద్యుత్ చార్జీలను పెంచే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు. ఇటీవల ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి విద్యుత్ చార్జీలు పెంచినప్పటికీ సామాన్యుడిపై భారం పడకుండా జాగ్రత్త పడ్డారు. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాలపై ఏపీ ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచింది. 500 యూనిట్లు పైబడిన వర్గాలపై కేవలం 95 పైసలు మాత్రమే పెంచారు. దీనిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ చార్జీలను పెండానికి విద్యుత్ సంస్థలను ఆదేశించవచ్చునని తెలుస్తోంది. తెలంగాణ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచలేదు. ఈ ఆరు సంవత్సరాలు విద్యుత్ ఉత్పత్తిపై భారం పడుతున్నా ప్రభుత్వం భరిస్తోంది. రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు రోజురోజుకూ గణనీయంగా పెరుగుతున్న సందర్భాలను విద్యుత్ అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. చార్జీల పెంపు ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. ఇటీవల స్థానిక
సంస్థల ఎన్నికలు సందర్భంగా విద్యుత్ చార్జీలు పెంచితే ఎన్నికల ఫలితాలపై పడుతుందని సీఎం వాయిదా వేశారు. ప్రతి రెండు సంవత్సరాలకు విద్యుత్ చార్జీల పెంపు, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా అంశాలపై తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిటీ సమీక్షిస్తుంది. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ విద్యుత్ సంస్థలు తమ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ చార్జీల పెంపు నివేదికను ఈఆర్‌సీకి నివేదిక ఇవ్వాల్సి ఉంది. అయితే విద్యుత్ చార్జీల పెంపునకు సీఎం కేసీఆర్ గ్రీన్‌స్నిగల్ ఇవ్వలేదు. దీంతో విద్యుత్ సంస్థలు తమ నివేదికను ఈఆర్‌సీకి సమర్పించలేదు. విద్యుత్ చార్జీల పెంపు నివేదిక ఇవ్వడానికి జాప్యం చేయడాన్ని ఈఆర్‌సీ తప్పుపట్టింది. ఈఆర్‌సీ సూచనలతో విద్యుత్ సంస్థల సీఎండీలు ముఖ్యమంత్రి దగ్గరకు ఉరుకుపరుగులు తీస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు త్వరలో ఉన్నందున తాత్కాలికంగా విద్యుత్ చార్జీల అంశం వాయిదా వేద్దామని సీఎం సూచనలతో విద్యుత్ సంస్థల సీఎండీలు ఊపిరిపీల్చుకున్నారు.