పశ్చిమగోదావరి

దాళ్వాకు నీరివ్వకుంటే నష్టపరిహారం ఇవ్వాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-రైతు కార్యాచరణ సమితి అల్టిమేటం
భీమవరం, డిసెంబర్ 18: దాళ్వాలో వరిచేలకు నీరివ్వకుంటే ప్రభుత్వం నష్టపరిహారం అందచేయాల్సి ఉంటుందని రాష్ట్ర రైతు కార్యాచరణ సమితి ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేసింది. నీటిపారుదలశాఖలో ఇఇ నుండి కింది స్థాయి వరకు సక్రమంగా పనిచేయకపోతే రైతులు ఉమ్మడిగా కేసులు పెడతారని అధికారులను హెచ్చరించారు. అసలు ఈ ఏడాది దాళ్వా ఉందా, లేదా అనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. భీమవరంలో శుక్రవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో రాష్ట్ర రైతు కార్యాచరణ సమితి ఉపాధ్యక్షుడు భూపతిరాజు పాండురంగరాజు, ప్రధాన కార్యదర్శి గాదిరాజు నాగేశ్వరరాజు మాట్లాడుతూ ప్రభుత్వం వంతులవారీ విధానాన్ని అమలుచేస్తే, ముందస్తుగానే ఏ గ్రామానికి, ఏ కాలువకు, ఏ తేదీన, ఏ సమయానికి నీరు విడుదల చేస్తారో సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతి ఎకరానికి నీరివ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. అనధికారికంగా ఎవరైనా నీరు పారుదల కాకుండా వంతులవారీ సమయంలో తూరలు పెడితే, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే హైలెవిల్ కెనాల్స్ ద్వారా నీటిని సక్రమంగా అందించాలన్నారు. పిడబ్ల్యూడి, నీటిపారుదల శాఖ, డ్రైనేజి విభాగాలు సంయుక్తంగా దాళ్వా పంట పండించే వరకు రైతులకు అండగా నిలవాలన్నారు. శివారు ప్రాంతాలకు నీరందే పరిస్థితి లేని కారణంగా ముందు నుండి ప్రణాళికాబద్ధంగా గోదావరి జలాలను శివారు ప్రాంతాలకు అందించాలని పాండురంగరాజు డిమాండ్ చేశారు. నాడు పట్టిసీమ వద్ద జలాలు నిల్వ ఉండేవని, ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన తర్వాత అసలు గోదావరిలోనే నీరు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్ 25 నుండి పనులు ప్రారంభించాలని, అయితే నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటి వరకు వ్యవసాయ పనులు ప్రారంభించలేదన్నారు. ప్రభుత్వం దాళ్వా పంటపై ప్రత్యేక దృష్టి సారించి పూర్తిస్థాయిలో నీరందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి లంకా కృష్ణమూర్తి, సహాయ కార్యదర్శి తమ్మినీడి నాగేశ్వరరావు, చినమిల్లి వీరబాబు, మేళం దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.