బిజినెస్

ఉత్తరకోస్తాలో భూగర్భ విద్యుదీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూ.94.4 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు * ప్రభుత్వానికి ఈపిడిసిఎల్ ప్రతిపాదనలు

విశాఖపట్నం, నవంబర్ 26: ప్రకృతి విపత్తుల సమయాల్లో సైతం విద్యుత్ సరఫరా అంతరాయాలు లేకుండా చేసేలా ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో భూగర్భ విద్యుద్దీకరణ ప్రాజెక్ట్‌ను చేపపట్టాలని ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) నిర్ణయించింది. దీనికి సంబంధించి పైలెట్ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేసి, ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. ప్రపంచబ్యాంకు నిధులు మంజూరు చేయాల్సిందిగా ఈ ప్రతిపాదనలల్లో కోరింది. గత ఏడాది అక్టోబర్ 12వ తేదీన విశాఖలో సంభవించిన హుదూద్ వంటి భయంకరమైన తుపాన్లను సైతం అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ ప్రాజెక్టు మంజూరైతే రానున్న రోజుల్లో విద్యుత్‌పరమైన సమస్యలను పూర్తిస్థాయిలో అధిగమించవచ్చని సంస్థ భావిస్తోంది. సంస్థ పరిధిలో విజయనగరం మినహా మిగిలిన నాలుగు జిల్లాలకు సంబందించి ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నారు. శ్రీకాకుళం అరసవిల్లి, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని గోదావరి తీర ప్రాంతాలు, కాకినాడ పట్టణం, పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు, విశాఖ జిల్లా భీమిలి, అనకాపల్లి పట్టణ ప్రాంతాల్లో భూగర్భ విద్యుద్దీకరణ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. కాకినాడ పట్టణంలో భూగర్భ విద్యుద్దీకరణ కోసం రూ.26 కోట్లు, తణుకులో రూ.7.6 కోట్లు, శ్రీకాకుళం అరసవిల్లిలో రూ.8.5 కోట్ల మేర వెచ్చించాల్సి ఉంటుందని ప్రతిపాదనల్లో సంస్థ పేర్కొంది. మిగిలిన నిధులతో విశాఖ జిల్లా భీమిలి, అనకాపల్లి, రాజమండ్రిల్లో వెచ్చించాలని నిర్ణయించింది. గత ఏడాది అక్టోబర్ 12న విశాఖలో సంభవించిన హుదూద్ తుపానుతో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. దీనిని దృష్టిలోపెట్టుకున్న ప్రభుత్వం విశాఖలో భూగర్భ విద్యుద్దీకరణ ప్రాజెక్ట్ అవసరాన్ని గుర్తించి, రూ.705 కోట్ల వ్యయంతో దీనిని చేపట్టాల్సిందిగా ఈపిడిసిఎల్‌ను ఆదేశించింది. ఇందుకోసం డిపిఆర్‌ను సిద్ధం చేసింది. దీనికి ఆమోదం లభిస్తే త్వరలో టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభిస్తారు.