యువ

చిన్నారులకు చిరుసేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇరవై ఆరేళ్ల మిలింద్ చాంద్వానీ బాగా బిజీ. ఎంత బిజీ అంటే అప్పుడప్పుడు కాఫీ తాగడానికి, భోజనం చేయడానికి కూడా టైమ్ ఉండనంత. ఇంత బిజీగా ఏం చేస్తున్నాడు? ఏమన్నా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడా అనుకుంటున్నారా? అలా అయితే మీరు కొంతవరకూ కరెక్టే. అతను సాఫ్ట్‌వేర్ ఇంజనీరే కానీ, ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టేశాడు. మరి బిజీ దేనికనేగా మీ ప్రశ్న? మిలింద్ చిన్న పిల్లలకోసం ‘కేంప్ డైరీస్’ అనే సంస్థను మొదలుపెట్టాడు. లాభాపేక్ష రహితమైన ఈ సంస్థ ద్వారా చిన్నారుల్లో దాగిఉన్న ప్రతిభాపాటవాలకు మెరుగు పెట్టడమే లక్ష్యంగా అహోరాత్రులూ కష్టపడుతున్నాడు.
హైదరాబాద్‌కు చెందిన మిలింద్ చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. బిటెక్ పూర్తి చేసిన వెంటనే మంచి ఉద్యోగమూ వచ్చింది. అయితే ఆ ఉద్యోగంలో ఎంతోకాలం ఉండలేకపోయాడు. ‘చిన్నప్పటినుంచీ మా తల్లిదండ్రులు ఎవరో ఒకరికి సాయం చేస్తూనే ఉండేవారు. డబ్బులివ్వడమో, ఫీజులు కట్టడమో...ఇలా చేతనైనంత సాయం చేసేవారు. ఆ ప్రభావం నాపై పడింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటూ కళలకు దూరమైపోతున్న చిన్నారులకు వాటిని నేర్పించాలని అనిపించింది. వెంటనే ‘కేంప్ డైరీస్’ను స్థాపించి, చిన్నారులకు చెస్, డాన్స్, గిటార్, రూబిక్స్ క్యూబ్, బీట్‌బాక్సింగ్ వంటివి నేర్పిస్తున్నాను’ అంటూ మిలింద్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తన కార్యకలాపాలను బెంగళూరుకు కూడా విస్తరించే ఆలోచనలో ఉన్నాడు మిలింద్. నా ఆలోచనకు సహకారం అందించే స్నేహితులు దొరకడంతో కేంప్ డైరీస్‌ను ముందుకు తీసుకెళ్లగలుగుతున్నానంటాడతను. పిల్లలు ప్రాక్టీస్ చేసుకునేందుకు వీలుగా గిటార్లు, రూబిక్స్ క్యూబ్‌లు వంటివాటిని వారం రోజులపాటు పిల్లల వద్దే వదిలి వెడతారు. ఆ తర్వాత వారి ప్రతిభను పరీక్షించడం, ప్రోత్సహించడం జరుగుతుంది. పిల్లల చేత స్టేజ్ షోలు చేయించి, వారి ప్రతిభను ప్రపంచానికి చాటుతూ ఉంటారు కూడా. పిల్లలు తయారు చేసే రిసైకిల్డ్ వస్తువుల్ని కాలేజ్ ఫెస్టివల్స్‌లో స్టాళ్లు ఏర్పాటు చేసి, ప్రదర్శిస్తారు. వాటి అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బుని కూడా కేంప్ డైరీస్ నిర్వహణ కోసం వ్యయం చేస్తున్నారు. ఇటీవలే మిలింద్ బృందం ఓ కేన్సర్ ఆస్పత్రిని దత్తత తీసుకుంది. అక్కడ చికిత్స పొందుతున్న 50 మందికి పైగా చిన్నారులకు ప్రతి ఆదివారం నైపుణ్యాలను పదను పెడుతూ ఉంటారు. ప్రస్తుతానికి నిధుల సేకరణకు సమస్య లేదని, ఎందుకంటే చేయూతనిచ్చే స్నేహితులు, వారి కుటుంబాలు అండగా నిలబడుతున్నాయని మిలింద్ చెప్పాడు.