నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేరి యొకండు నొవ్వబడి చిక్కుచు జేరెడు శాలిధాన్యమే
కోరు, నతండు పిమ్మట నకుంఠి ధనోన్నతుడై వసుంధరం
బూరికి సాంటిగా దలచు భూరి ధనాడ్యుల చొప్పనేకమై
గౌరమున్ లఘుత్వమును గైకొను వస్తువులందు నెల్లెడన్

భావము:దారిద్య్రంలో ఉండి బాధలు పడుతున్నప్పుడు ఒక గుప్పెడు ధాన్యాన్ని కోరే వ్యక్తియే కాలాంతరంలో ఐశ్వర్యవంతుడైతే భూమండలాన్నంతా గడ్డిపరకతో సమానంగా చూస్తాడు. కాబట్టి సమయానుసారంగా వస్తువులు గొప్పవిగాను, అల్పమైనవిగాను భావింపబడతాయి. ఒకప్పుడు అల్పమైనది మరొకప్పుడు అధికమైనదిగాను, మరొకప్పుడు అల్పమైనదిగాను కనిపిస్తుంది. ఇది లోకసహజం.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ

- కె. లక్ష్మీఅన్నపూర్ణ