విజయవాడ

నేడు వీఎంసీ బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 1: నగర పాలక సంస్థ 2018-19 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ఆమోదంపై కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరుగనుంది. శుక్రవారం ఉదయం వీఎంసీ కౌన్సిల్ హాల్లో మేయర్ కోనేరు శ్రీ్ధర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గత సంవత్సరం మాదిరిగానే నగర సమగ్రాభివృద్ధి, ప్రజల వౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యతనివ్వడమే కాకుండా పన్ను భారాలు లేకుండా ఆదాయ వ్యయాలను పొందుపర్చామని అధికార టీడీపీ పక్షం చెబుతుంటే ఎప్పటిలాగానే ఇది నిరాశ బడ్జెట్ అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. నగర పాలకులు రూపొందించిన డ్రాఫ్ట్ బడ్జెట్ ఇప్పటికే స్టాండింగ్ కమిటీ ఆమోదించగా నేడు జరగబోయే సాధారణ కౌన్సిల్‌లో బడ్జెట్ ఆమోదానికి అధికార పక్షం వ్యూహరచన చేస్తోంది. బడ్జెట్ పొందుపర్చిన అంశాల ప్రకారం రెవెన్యూ ఆదాయం రూ.605,25,46000లు కాగా ఖర్చు రూ.496,13,32,000 లుగా చూపారు. క్యాపిటల్ ఆదాయం రూ.816,37,95,000 లు కాగా ఖర్చు రూ.887,73,26.000లుగా చూపారు. గత బడ్జెట్ అంచనాల కన్నా ఆదాయాన్ని రూ.226 కోట్లకు, ఖర్చును రూ.235 కోట్లు అదనంగా చూపారన్నది స్పష్టమవుతోంది. అమృత్ పథకంలో వీఎంసీ భరాయించాల్సిన 67శాతం నిధులను, 100 కోట్ల రూపాయలను ఆదాయంగా చూపారు. జేఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పక్క్భావనాల నిర్మాణాల పూర్తికి రూ.100 కోట్లు, వీఎంసీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల అభివృద్ధికి రూ.10కోట్లు, క్యాపిటల్ ఖర్చులో ఇతర పనుల కింద గత బడ్జెట్‌లో రూ.104 కోట్లను ఈసారి రూ.122 కోట్లుగా చూపారు. నగరంలో ప్రకటనల ద్వారా రూ.8కోట్ల ఆదాయం చూపిన పాలకులు డ్వాక్రా మహిళల స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణకు రూ.14 లక్షలు కేటాయించారు. వీఎంసీ కార్యాలయంలో నూతనంగా నిర్మిస్తున్న జీ ప్లస్ 9 అంతస్తుల భవనానికి బడ్జెట్ నిధులు కేటాయింపు లేకపోవడం గమనార్హం. గత సంవత్సరం బడ్జెట్‌లో కేటాయించిన నిధులు, వాటి వినియోగం, ప్రస్తుత బడ్జెట్‌లో నిధుల కేటాయింపు తదితర అంశాలపై వత్యాసాలున్నాయి. వాస్తవానికి పన్ను పోటు లేకుండా ప్రజాకర్షణగా బడ్జెట్‌ను రూపొందించామని అధికార పక్షం, ప్రజా ప్రయోజనాలను విస్మరించిన పాలకుల వైనంపై విపక్షాలు ఇప్పటికే అధికార పక్షంపై తీవ్ర ఆగ్రహంతో ఉండగా, నేడు జరుగబోయే ప్రత్యేక సమావేశంలో ఇరు పక్షాల మధ్య వాడీ వేడీ వాతావరణంలో చర్చ జరుగుతుందన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది.