ఎలావుందీ వారం?

ఎలావుందీ వారం? (జనవరి 31 నుండి ఫిబ్రవరి 6 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-ఎస్.రవిప్రకాశ్
----------------
మేషం (ఏప్రిల్ 15 - మే 14)
పరిమిత వనరులుండటం వల్ల వ్యవహారాలు నిదానంగా సాగవచ్చు. వ్యక్తిగత విషయాల్లో తొందరపాటు కూడదు. ఆలస్యంగానైనా మీ చర్చలు, సమావేశాలు ఫలితాల నిస్తాయనవచ్చు. బుధ, గురువారాల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఆత్మీయులకు మీ తోడ్పాటు అవసరమవుతుంది. అనవసర ఆలోచనల నుండి బయటపడి ఉద్యోగ, వృత్తి విషయాల పట్ల శ్రద్ధ వహించండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు కృషి పెంపు చేయాలి.

వృషభం (మే 15 - జూన్ 14)
వారంలో అధిక భాగం వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. కొత్త సమస్యలు మీద పడినా వాటిని సులువుగానే పరిష్కరించగలరు. ఇంటా బయటా మీ ప్రాధాన్యత ఇనుమడిస్తుందనడంలో సందేహం లేదు. బంధుమిత్రుల కోసం మీ సుఖాలు కొన్ని త్యాగం చేయడానికి సిద్ధమవుతారు. పెట్టుబడులు సంతృప్తికర ఫలితాల నిస్తాయి. కొన్నిచోట్ల పోగొట్టుకున్న పరువు ప్రతిష్ఠలు తిరిగి పొందగలుగుతారు.

మిథునం (జూన్ 15 - జూలై 14)
మీ ప్రతిభా పాటవాలు ప్రదర్శించి అన్ని వ్యవహారాలు సక్రమంగా సాగేట్లు చూడగలుగుతారు. కుటుంబ వాతావరణం సుఖ సంతోషాల నిచ్చేదిగా ఉంటుంది. సకాలంలో స్పందించి కొన్ని సమస్యలు పరిష్కరిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. భాగస్వామ్యాలు అభివృద్ధి దిశగా సాగుతాయనవచ్చు. విద్యా, వివాహ ప్రయత్నాలు జోరుగా సాగుతాయనవచ్చు. పారిశ్రామిక రంగంలో నూతన అవకాశాలు లభ్యమవుతాయి.

కర్కాటకం (జూలై 15 - ఆగస్టు 14)
వాద ప్రతివాదనల పిదప మీ అభిప్రాయాలే సరైనవని సన్నిహితులు తెలుసుకుంటారు. ఉన్నత స్థాయి వారు మీ కృషిని గమనించి సహకరిస్తారు. పోటీలను, బాధ్యతలను అలవోకగా జయప్రదం చేస్తారు. ఆత్మవిశ్వాసం, శక్తి సామర్థ్యాలు ప్రదర్శించే అవకాశాలు లభ్యమవుతాయి. ప్రణాళికలు సహచరుల సాయంతో సక్రమంగానే సాగుతాయనవచ్చు. ఆర్థికపరంగా మెరుగైన స్థాయికి చేరుకుంటారు.

సింహం (ఆగస్టు 14 - సెప్టెంబర్ 14)
ప్రత్యర్థులను అదుపు చేయడంలో కృతకృత్యులవుతారు. కుటుంబ సంబంధ విషయాల్లో మీ ఆలోచనా ధోరణి మారుతుంది. కార్యవర్గంతో సామరస్యంగా మెలగితే పనులు సులువుగా పూర్తవుతాయి. ఆలస్యంగానైనా అవసరమైన డబ్బు చేతికందుతుంది. విందులు, వివాహాలు, దూర ప్రయాణాలకు సంబంధించిన ప్రయత్నాలలో వారమంతా బిజీగా ఉంటారని చెప్పవచ్చు. బంధుమిత్రుల నుండి ఆశించిన సహకారం లభ్యమవుతుంది. సంక్షేమ పథకాలు ఆకర్షిస్తాయి.

కన్య ( సెప్టెంబర్ 15- అక్టోబర్ 14)
కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. వసతులు, వనరులు పెరగడంతో వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. కొత్త భాగస్వామ్యాలు ప్రోత్సాహకరంగా ఉంటాయనవచ్చు. పిల్లల, పెద్దల నుండి మీకు కావలసిన సహకారం అందుతుంది. ఆరోగ్యం మెరుగవడంతో కొత్త ప్రణాళికలకు శ్రీకారం చుట్టేందుకు ప్రయత్నిస్తారు. మంగళ, బుధవారాల్లో ధనాదాయం, శుభవార్తలు వింటారు.

తుల (అక్టోబర్ 15- నవంబర్ 14)
శ్రమ పెరిగినా అన్ని రంగాలలో లక్ష్యాలను చేరుకోగలగడం గమనించదగ్గ విషయం. శుభకార్యాలకు, ప్రారంభోత్సవాలకు హాజరవుతారు. ఆలస్యంగానైనా కుటుంబ వ్యక్తులకు సంబంధించిన విషయాలు సఫలీకృతమవుతాయి. వ్యక్తిగత విజయాలను నమోదు చేసుకుంటారు. మీ కృషి, ప్రావీణ్యం కొనియాడబడతాయి. అనుచరులు మీ ప్రయత్నాలకు తగిన చేయూత నిచ్చి శుక్ర, శనివారాల్లో వృత్తి ఉద్యోగాలలో మీ విజయంలో పాలుపంచుకుంటారు.

వృశ్చికం (నవంబర్ 15-డిసెంబర్ 14)
విధేయులైన అనుచర గణం ఏర్పడుతుంది. ఆగిపోయిన వ్యవహారాలు పునః ప్రారంభం చేస్తారు. సత్వర ప్రగతి కోసం నూతన మార్గాలను అవలంబిస్తారు. కొత్త విషయాలను, విద్యలను నేర్చుకునే అవకాశాలు అధికం. స్థిరాస్తి లావాదేవీలు అనుకూలించవచ్చు. ప్రయాణాలు లాభిస్తాయి. బాధ్యతలు వత్తిడి పెంచినా ఆత్మవిశ్వాసంతో కృషి చేసి అందరినీ మెప్పించ గలుగుతారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

ధనస్సు (డిసెంబర్ 15-జనవరి 14)
మీ అభిప్రాయాలు, భావాలు తెలుపడానికి తగిన సమయం కోసం వేచి చూడడం మంచిది. నిర్ణయాలు తీసుకుని కఠిన పరిశ్రమ చేస్తే తప్ప లక్ష్యాలను చేరుకోవడం కష్టం. మీ ఏకాగ్రతను భగ్నం చేసేందుకు కొందరు ప్రయత్నించవచ్చు. గతానుభవాలు గుర్తుంచుకుని వృత్తి ఉద్యోగాలలో జాగ్రత్త పడటం ఉత్తమం. రాజకీయ, ఆధ్యాత్మిక రంగాల్లో జరిగే సంఘటనలు మీ ఆలోచనలను ప్రభావితం చేస్తాయి.

మకరం (జనవరి 15-ఫిబ్రవరి 14)
అవసరానికి తగ్గట్టుగా కృషి చేసి వృత్తి వాణిజ్యాల్లో మీ పరపతిని పెంపు చేసుకోగలుగుతారు. రుణాలు, వాయిదాలు చెల్లించి మరో భారాన్ని తగ్గించుకుంటారు. సాంకేతిక లోపాలు సవరించబడి యంత్రాలు, వాహనాలు తిరిగి వాడుకలోనికి వస్తాయనవచ్చు. ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు తయారుచేసుకుంటారు. స్ర్తి సంబంధ విషయాల్లో మెలకువగా వ్యవహరించడం ముదావహం.

కుంభం (ఫిబ్రవరి 15-మార్చి 14)
సులువుగా పూర్తవుతాయనుకున్న పనులు కొన్ని అనుకోకుండా వాయిదా పడవచ్చు. పరామర్శలు, పరస్పర సహకారం ద్వారా కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తే గురు, శుక్రవారాల్లో ముఖ్య విషయాల్లో విజయం మీదవుతుంది. సర్వీసులు, సంక్షేమ కార్యక్రమాలకై ధనం వినియోగిస్తారు. మీ పరిధిలో లేని విషయాలను గురించి ఆలోచించి అశాంతికి గురవుతారు. ఆర్భాటాలకు, హామీలకు కొంతకాలం దూరంగా ఉండడం శ్రేయస్కరం. శత్రువులు కొందరు మిత్రులవుతారు.

మీనం ( మార్చి 15- ఏప్రిల్ 14)
ఆధునిక సదుపాయాలు, పరికరాలు సమకూర్చుకోవడంలో ఆసక్తి చూపుతారు. కొత్త కార్యక్రమాలు ప్రారంభించినా పూర్తి చేయడానికి ఆశించిన దానికన్నా అధిక సమయం పట్టవచ్చు. అనవసర విషయాల గూర్చి ఆలోచించి అసంతృప్తికి గురవుతారు. ఆత్మీయుల కోసం సమయం, ధనం వినియోగించి సంతృప్తి పరిచేందుకు ప్రయత్నిస్తారు. కాలహరణం కాకుండా ముఖ్య లావాదేవీలను పూర్తి చేయడం కొంతవరకు మనశ్శాంతి నిస్తుంది. ప్రముఖుల నుండి గౌరవాదరాలు లభిస్తాయి.