మంచి మాట

రుద్రార్చన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుద్రార్చనలో చాలా విశేషములు గలవు. ‘రుద్రోవైక్రూర’ అని వేదంలో ఒక చోట వున్నది. అధర్మ నాశనమున స్వభక్తులకు గలుగు సంసార భయాదుల పట్టున ప్రళయకాలము సమీపించిన తఱి- ఆది వ్యాధి హరణ కాలమున ధర్మానికి గ్లాని సంభవించిన తరుణంలో దుర్మార్గుల విషయంలో రుద్రుడు క్రూరుడై సంచరించునని, భాష్యకారులు వచించిరి. రుద్రుడనగా రోదనకారణభూతమగు దుఃఖమును హరించువాడనియు నర్థము. అనగా భవబంధ మోచకుడని గ్రహింపదగును.
దేవతారోపణము:మనకు రుద్రార్చన అభిషేక పూర్వకముగా ప్రచారములోనున్నది. అందు ‘నా రుద్రో రుద్రమర్చయేత్’ అని బోధాయనుని పల్కు. ఇది మహన్యాసములోని వాక్యము. మొదట మహన్యాసంలో పంచముఖేశ్వరుని ధ్యానానంతరము ‘ఇంద్రాదీన్ దిక్షువిన్యస్య’ అని ప్రారంభించి ఇంద్రాది అష్టదిక్పాలురను కర్తయగు యజమాని తన పరితః వారిని మంత్ర రూపమున నాహ్వానించి, తత్తద్దిక్కుల యందు న్యాసము చేయును. అటు పిమ్మట ఆత్మయందు అనగా తన శరీరరావయములందు సర్వ దేవతలను ఆరోపించుకొనును. ఇట్లు అష్టదిక్పాలురను పృధివ్యాది సమస్త భూతములను తన యందు ఆరోపణ గావించి పిమ్మట శివ సంకల్పాదుల పఠించి అష్టవిధములగు నమస్కారముల గావించి తాను సాక్షాత్ రుద్రునిగా భావన చేసుకుని ‘మూలాధారమను చక్రగతుండగు నా పరమ రుద్రుని హృదయాకాశమున తన్మధ్యే ఆత్మని దేవతా స్థాపయేత్ అన్నట్లు హృద్దేశమున పర దేవతా రూపుడగు రుద్రుని ప్రతిష్ఠించుకొనును.
రాష్ట్రాంతరాలలోని విశేషాలు
ఆంధ్ర దేశమున మహన్యాస పూర్వక ఏకాదశవార రుద్రాభిషేకము సంప్రదాయ సిద్ధంగా ఆచరించుట అనాది నుండి వచ్చుచున్నది. కాని మనకు సమీప రాష్టమ్రులవారు తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రాంతములవారు ఆత్మశుద్ధికై మహన్యాస పఠనము గావించి ఏకవారం అనగా ఒక పర్యాయం అభిషేకం చేసుకొనుట ఆచారము.
‘‘బోధాయనుడు ఈ మహన్యాస ప్రక్రియను ఆచరించుటకు కొన్ని పద్ధతులు చెప్పినాడు. జీవితార్థీ- సదా పాపక్షయార్థీ- వ్యాధినాశనార్థీ- పుత్రార్థీ- మోక్షార్థీ అని మొదలిడి ఈ కామ్యముల నీడేర్చుకొనుటకు మహన్యాసపూర్వక, ఏకాదశ వార రుద్రాభిషేకము చేసి, వారి వారి అభీప్సితములను పొందవచ్చును’’ అని పల్కినాడు.
కాగా మహన్యాస పూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకానంతర కాలమున ఆచార్యునికి వత్సలతో అనగా దూడలతో కూడిన ఆవులను ఇచ్చి తీరాలి. దానం చేసి తీరాలనెడి నియమం గూడా నిర్వర్తించుట- కర్మాంగమై ఉన్నది. ఇవి విశేషములను చెప్పుటకు గల కారణము. మహన్యాస పఠనమువలననే పఠితకు రుద్రత్వ సిద్ధి కల్గును.
దేహమే దేవాలయము- సనాతనుడగు దేవుడే జీవుడు. అజ్ఞాన నిర్మాల్యమును తొలగించుకొని ఆ దేవుడను నేనను భావములతో సంపుణీకరణము చేయవలెను.
హంస అనగా నిర్వికార నిరామయుడగు నీశ్వరుడు. హంసయే సదాశివుడును, హంస పదోచ్చారణ చేతనే తత్పద పాఠకుడు పరమహంస యగు నీశ్వరతుల్యుడును.
ఈ మహన్యాసమున సర్వదేవతలను, తన యందు ఆరోపించుకొనుటచే కలుగు లాభమును బోధాయనుడు ఈ రకంగా వివరించినాడు.
త్వగస్థితైః సర్వపాపైః ప్రముచ్యతే సర్వభూతేష్య పరాజితో భవతి! భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షస యక్ష యమ దూత శాకినీ, ఢాకినీ జ్వరాది ఉపద్రవ జరోగాః సర్వేజ్వలంతం (మాం) పశ్యంతు! అనగా లోకంలోని ఏ భయంకరములగు భూత ప్రేత పశాచాదులు- యమదూతాదులు- జ్వరాది ఉపద్రవజములు- త్రినేత్రుని అపాంగాజనిత కంటి మంటవలె ప్రజ్వలించే ఈశ్వరధ్యాతను జూచి వాటంతటవి పరాజితములగునని బోధాయనోత్త వాక్యార్థము. వీటినన్నిటిని పరిశీలింపగా ఈ శతరుద్రీయ ప్రకరణోక్త మహన్యాసములోని మంత్రములు యజమానికి మంత్ర పఠనము ద్వారానే రుద్రత్వ ప్రాప్తికి సన్నిహిత కారణములగుటలో సందేహము లేదు.

- మల్లాది నరసింహమూర్తి