నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. ఆ విశ్వకర్మ నిర్మిత
దేవవిమానుఁటు నిఖిల దివ్యాభరణ
శ్రీనిరచన పరితోషిత
దేవుఁడు శిల్పప్రజాపతియు నై నగదెన్

భావం: ఆ విశ్వకర్మ దేవతల విమానాలను నిర్మించినవాడు. సమస్త దివ్యాభరణసంపదను విరచించటం చేత దేవతలను సంతోషపెట్టినవాడు, అతడు శిల్ప ప్రజాపతిగా ప్రసిద్ధి కెక్కాడు.
చ. దివిజ మునీంద్ర దానవదితి ప్రభవాది సమస్త్భూతసం
భవముఁ గృతావధను లయి భక్తిమెయిన్ వినుచున్న పుణ్యమా
నవులకు నిక్కువంబగు నమప్రియ నిత్యసుఖంబులుం జిరా
యువు బహు పుత్ర లాభవిభవోన్నతియున్ దురిత ప్రశాంతియున్
భావం: దేవతలు, మునులు, దైత్యులు, దానలులు, మొదలైన జీవుల పుట్టుకను సావధానులై వింటున్న పుణ్యులకు అభీష్టాలైన నిత్యసుఖాలు, చిరాయువు, బహుపుత్ర లాభం ఉన్నతమైన వైభవం పాపక్షయం యథార్థంగా అవుతాయి.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము