నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. అభ్యస్తవేద వేదాంగులు విధిదత్త దక్షిణాప్రేణిత ధరిణిదేవు
లనవరతాశ్వమేధానభృథస్నాన పూనమూర్తులు కృతపుణ్యులహిత
వర్గజయుల్ ప్రాప్త వర్గ చతుష్టయుల్ సత్త్వాదిసద్గుణ జన్మనిలయు
లాభరతాది మహామహీపాలకు లిద్ధయశోర్థులెందేని ఁబుట్టి
ఆ. రట్టి కౌరవాన్వయంబుఁ బాండవ నృప
రత్నములకు వారిరాశియైన
దాని వినఁగ వలతుఁ దర్దయుఁ బ్రీతితో
విప్రముఖ్య నాకు విస్తరింపు
భావం: సకల వేదవేదాంగాలు అభ్యసించినవారు, యజ్ఞయాగాలలో భూరిదక్షఇణ లిచ్చి బ్రాహ్మణులను సంతృప్తిపరిచినవారు, నిరంతరం అశ్వమేధయాగ లాచరించి అవభృధస్నానం చేత పవిత్రమైన దేహాలు కలవారు, పుణ్యచరితులు అరిషడ్వర్గాలను జయించినవారు. ధర్మార్థకామాదులను పొందినవారు, సత్త్వ గుణసంపన్నులు అయినటువంటి భరతుడు మొదలుగా గల కీర్తికాంక్షులైన మహారాజులు పుట్టిన కౌరవ వంశ పాండవులనే రత్నాలకు సముద్రం వంటిది అటువంటి కౌరవ వంశాన్ని గురించి నాకు సవిస్తరంగా తెలుపుము. విన వేడుక పడుతున్నానని జనమేజయుడు వైశంపాయనుడితో అన్నాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము