మంచి మాట

విశ్వాత్ముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పినాకపాణి, వృషధ్వజుడు, విశాలాక్షుడు, సదానందుడు, శ్మశానవాసి, శైలధన్వుడు, శశిశేఖరుడు, కపర్ది అంటూ ఎన్ని పేర్లు పిలిచినా అవన్నీ ఒక్క శంకరునికే చెల్లుతాయ. అటువంటి కైలాసవాసునకు వారువీరను తేడాల్లేవు. రాక్షసులు దేవతలు, మనుష్యులు ఎవరైనా ఆయన్ను సేవించేవారే. రాజు-పేద, ఆడ - మగ, పశువు-పక్షి, పాము- చీమ శివుని పూజించేవారే. శివప్రేమను చూరగొంటే చాలు, శివతత్వం అర్థం చేసుకొంటేచాలు మనం శివునిగానే మారిపోవచ్చు. శివపూజకుఏ షరతుల్లేవు. అవధులూ లేవు. శివా అనని మనుష్యులు ఎవరూ ఉండరేమో అని అన్నా దోషంలేదేమో అనిపించేంతటి అందరినీ ఆకర్షించేంతటి ప్రేమాళువు శివుడు. ‘శివ’ శబ్దంలో, ‘శం’ అంటే నిత్య సుఖము, ఆనందము. ‘ఇ’ కారము పరమ పురుషుడు. ‘వ’కారము-అమృత స్వరూపిణి అయిన ‘శక్తి’. ఈ ముగ్గురి సమ్మేళనమే అనగా ఆనందమయమైన శివశక్తి సంయోగమే శివ శబ్దార్ధము.
శివుడు నిరాడంబరుడు. స్మశానం ఆయన నివాసం. నాగుపాము ఆయన ఆభరణం. కట్టుకునేవి చర్మాంబరాలు. ఆయన పూసుకునే లేపనం బూడిద. ఇందులోంచే మనిషికి అత్యంతవసరమైన జీవితసత్యాన్ని ఎరుకపరుస్తున్నాడు శివుడు. కాని శివుడిని ఉమ్మెత పూలతో పూజిస్తే పుత్రప్రాప్తి, జాజి పూలతో పూజిస్తే వాహన ప్రాప్తి, తుమ్మి పూలతో పూజిస్తే మోక్ష ప్రాప్తి, నందివర్థనం తో పూజిస్తే సౌందర్య ప్రాప్తి, నువ్వుపూలతో పూజిస్తే యవ్వన ప్రాప్తి, గనే్నరు పూలతోపూజిస్తే శత్రునాశనం, శిరీష పుష్పాలతో పూజిస్తే సంతోషం కలుగుతుందని త్రయంబకుడు సెలవిచ్చినట్టు శాస్త్రాలు వెల్లడిస్తున్నాయ. అజ్ఞానానికో, పాపాచరణానికో లేక తమోగుణానికో సాధారణ మానవుడు లొంగేసమయంలో చింతలేదు చెంతనే నేనున్నాననే లింగోద్భవం జరిగింది. నిశరాత్రివేళ జ్వాలాయమానమైన లోకాల్ని వెలుగులు విరజిమ్మేట్టుగా లింగరూపంలో ఆది అంతంలేని స్వామి వెనె్నల విరితాల్పుగా ఆవిర్భవించాడు. ఈ స్వామినే వ్రజంలోనూ, మరకతంలోనో, పద్మరాగంలోను, స్పటికంలోనో లింగాకృతినేర్పరిచి పూజించిన వారికి ఇహలోకంలో బాధలుండవు. అంత్యాన శివసాయుజ్యం లభ్యవౌతుంది.
లింగోద్భవ సమయంలో మొదటి జాములో పాలతోను, రెండవ జాములో పెరుగుతోను, మూడవ జామునందు నెయ్యితోను నాల్గవ జామునందు తేనెతోను అర్చించిన ఉమాశంకరులకు అత్యంత ప్రీతికరం అని పురాణఉవాచ. శివ, లింగ, భవిష్యపురాణాలు శివతత్వాన్ని వ్యక్తంచేస్తున్నాయ.
అపమృత్యుభయంతో బాధపడేవారు పరిశుభ్రమైన నువ్వుల నూనెను శివలింగంపై పోసి, మృత్యుంజయ జపాన్ని చేస్తే ఆ పరమశివుడు అపమృత్యువునుంచి కాపాడతాడని శివపురాణం చెబుతుంది. మార్కండేయుని కాపాడిన శివుడు శివుణ్ణి తప్ప అన్యమెరుగని వారిని తనకై తాను వచ్చికాపాడుతాడు.
ప్రతిమాసంలోను శివరాత్రి వచ్చినా మాఘమాసంలో బహుళ చతుర్ధశి నాడు లింగోద్భవం జరిగింది కనుక ఈరోజును శివరాత్రిగా పరిగణించి ఇండ్లల్లోను, శివాలయాల్లోను ప్రముఖంగా పూజలు జరుపుతారు. అర్థనారీశ్వరుడైన శివునకు కల్యాణోత్సవాలు, రథోత్సవాలు జరుపుతారు. లింగోద్భవకాలంలో శివుని పూజించినవారికి అజ్ఞాన నాశనవౌతుంది. పెండ్లికాని యువతులు ఈ పండుగనాడు దీక్ష వహిస్తే మంచి భర్త లభిస్తాడని విశ్వసిస్తారు.
మహాశివుడు సృష్టి, స్థితి లయ కారకుడు. ఆయుష్షు, ఐశ్వర్యాలకు అధీష్టాన దేవుడు ఆయనే. మనిషిలోని సత్వరజస్తమో గుణాలకి పరమ శివుడే ప్రతీక. ‘శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే’ అంటూ శివకేశవులు అభేదులు. శివుని హృదయంలో విష్ణువు; విష్ణువు హృదయంలో శివుడు సుస్థిరమై ఉంటారు అందుకే శివరాత్రివేళ మహావిష్ణువును పూజించినా పరమశివుడు పరమానందంతో అనేక కోట్ల పుణ్యరాశిని మనవశం చేస్తాడని ఐతిహ్యం. ఓనమః శివాయ అంటే చాలు శివకేశవులిద్దరూ ఆనందచిత్తంతో భక్తులను కాపాడడంలో ముందుంటారు.

- సత్య ప్రసాద్