మంచి మాట

చదువు - సంస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుడు సృష్టించిన సకల జీవకోటి రాశుల్లో మానవ జన్మ మహోన్నతమైంది. ఎంతోమంది మహాత్ములు నడయాడిన ఈ పుణ్యభారతావనిలో.. జన్మించడం మనం చేసుకొన్న గొప్ప భాగ్యం. అలాంటి మానవజన్మకు ఓ అర్థం పరమార్థం చేకూరాలంటే.. మన మహాత్ములు చూపిన మంచి మార్గాన పయనించాలి. మనం సృష్టించుకొన్న కుల మత వర్గ వైషమ్యాలను విడనాడి మానవత్వంతో మనుషులుగా జీవించాలి.
మన జీవన యానంలో బాల్యం, యవ్వనం వృద్ధాప్యం తప్పనిసరి. బాల్యం ఆటపాటలతో అల్లరి చిలిపి పనులతో ముద్దుగా బంగారుమయంగా సాగుతుంది. ఆ తర్వాత వచ్చేది జీవితంలో ముఖ్యమైన దశ యవ్వనం. ఆ దశలో పయనం మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. లేదంటే అధోగతిపాలు జేస్తుంది. ఎందుకంటే యవ్వనం ఉరికే జలపాతం లాంటిది. అడ్డు అదుపు లేకుంటే జలపాత నీరు సముద్రంలో కలుస్తుంది. అదే జలపాతానికి అడ్డుకట్టవేసి పంట పొలాలకు తరలిస్తే బంగారు పంటలు పండుతాయి. అఖిల జనావళికి ఆహారం దొరుకుతుంది. అందుకే యవ్వనంలో మంచి విద్య, బుద్ధులు నేర్చుకొని ప్రయోజకుడివైతే కుటుంబానికి, దేశానికి ప్రయోజనం చేకూర్చినవాడివవుతావు. పెద్దలు చెప్పినట్లు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అన్న నానుడిని సదా స్మరిస్తూ.. మంచి జీవితానికి నాంది పలికి నిరంతరం ఆ భగవంతుని సేవలో తరించి.. ఈ జన్మను ధన్యం చేసుకొనడంలో కృతకృత్యులవుదాము.
ప్రతి మనిషి జీవితంలో చదువు చాలా ముఖ్యమైనది. ఫలం, ఫలితం లేని చదువులు ఎంత చదివినా వ్యర్థం. ఎంత పెద్ద చదువులు చదివినా.. ఎంత ఉన్నత పదవులు అలంకరించినా.. సంస్కారముండాలి. సంస్కారం లేని చదువు ఎందుకూ కొరగాదు.
అలాగే మన నిత్య జీవితంలో చూస్తూనే వుంటాము.. ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరూ తప్పు చేయవచ్చు. ఆ తప్పును మన్నించినవాడే మహాత్ముడవుతాడు. అలా కాకుండా తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి జీవితాంతం మూర్ఖుడిలా ప్రవర్తించేవాడిని ఆ దేవుడిక్కూడా మార్చడం సాధ్యం కాదు. ఇంటిముందుకొచ్చిన శత్రువునైనా ఆదరించడం మానవ ధర్మం. అలా కాకుండా తనేదో గొప్పవాడినయినట్లు ప్రవర్తించడం మూర్ఖత్వం
. పూవుకు పరిమళం తోడయినట్లు.. గొప్ప చదువుకు సంస్కారం తోడైతే ఆ మనిషి జీవితం పరిపూర్ణం అవుతుంది. సంస్కారం లేని మనిషి జీవితం ప్రాణం లేని జీవం లాంటిది.
ఈ ఎనభై నాలుగు వేల కోట్ల జీవరాశులకు విద్యను ప్రసాదించేది సాక్షాత్ సరస్వతి మాతయే. ఆమె అనుమతి లేనిదే ఏ జీవి జీవించలేదు. విద్య అంటే కేవలం వేదాలు చదవడం, పాఠాలు వల్లె వేయడం కాదు. తల్లి గర్భాన తొమ్మిది నెలలు.. తర్వాత జననం నుండి మరణం వరకు మనిషి ప్రతి చర్య అమ్మ నేర్పే విద్యయే. ఆకలి వేస్తే ఏడవడం పాపకు ఎవరు నేర్పుతారు.
బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం మనిషి పరిణామక్రమంలో.. ఏమి జరిగినా అంతా భగవంతుని లీలా విశేషమే. ఈ మూన్నాళ్ల మనిషి జీవితం నీటిమీద బుడగలాంటిదే అయినా మానవత్వంతో పరిమళించాలి. ముందు మన కుటుంబం నుండి మొదలెట్టి తర్వాత ఈ జగానికి తన వంతు సాయం చేయాలి. తరాలు కూర్చొని తినే భోగభాగ్యాలు నీ వెంట రానే రావు. కేవలం మనం చేసే మంచి పనులు నిన్ను కీర్తిశిఖరాలకు చేరుస్తాయి.
అంతేకాని అయినవారిని మోసం చేసి, దగా చేసి నా అంతటివాడు లేడనే భావం ఎంత మాత్రం తగదు. చివరి దశలో తీరని వేదనతో మనిషిగా మాయమైపోతాడు. ఈ పుణ్యభూమిలో ఎందరో మహానుభావులు ఈ జన్మభూమికై ఎన్నో త్యాగాలు చేసారు. వారు మన హృదయాల్లో అమరజీవులుగా చిరంజీవులై నిలిచిపోయారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రతి మనిషి మానవత్వం మరువరాదు.
నీతి నిజాయితీని వీడరాదు. మనకున్నంతలో ఆపన్నులకు, అన్నార్తులకు సాయం అందించాలి. అపుడే ఈ మానవ జీవితానికో అర్థం పరమార్థం. ఆ భగవంతుడు ఇచ్చిన ఈ మానవ జీవితం ఆ భగవంతుని సేవకై అంకితమిద్దాం.

-కురువ శ్రీనివాసులు