నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. అంగనాజనుల యుత్తుంగ సంగత కుచ కుంకుమ చందన పంకములయు
వారివ ధమ్మిల్లభారావకలిత దివ్యామోద నవ పుష్పదామములయు
వారివ ముఖ సకర్పూర తాంబూలాది వాసిత సురభి నిశ్వాసములయు
వారివ పరిధాన చారు ధూపములయు విలసిత సౌరభావలులు దాల్చి
తే. యనిలుఁడను దూత వోయి తొడ్కొనుచు వచ్చె
దేవయాని పాలికి మృగతృష్ణ ఁ జేసి
కాననంబునఁ గ్రుమ్మరువాని వరు
నతి పరిశ్రాంతుఁడైన యయాతి నంత
భావం: స్ర్తిల సౌందర్యాలకు మెరుగుపెట్టే చందనాదికములు, కర్పూరాదికములు వారి కొప్పులలో ఒదిగిన సుగంధ పుష్పాదికములు ఇలాంటి వాటి వల్ల కలిగే చక్కని సుగంధములను వాయుదేవుడు చూచాడు. అపుడే అక్కడ యయాతి మహారాజు శ్రమ వలన మిక్కిలిగా డస్సీపోయి చెట్టు మొదలు కింద సేదతీరుతున్నాడు. అటువంటప్పుడు ఆ వాయుదూత తన స్నేహితుని అలసటను తీర్చడానికి ఈ సుగంధలేపనాది వాసనలు తీసుకెళ్లితే బాగుండుననుకొని మెల్లగా వాటినంతా తీసుకొని యయాతి ముక్కురంధ్రముల దగ్గరకు చేర్చాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము