మంచి మాట

అసతోమా సద్గమయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇహ, పర, లోక జీవన సౌఖ్యాలను గురించి విశే్లషణ చేయాలంటే అందుకు తగిన ఏకాగ్రత కావాలి. విశే్లషణలో హేతుబద్ధత వుండాలి. వివేచన, లోతైన ఆలోచన, ఏకాగ్రత- ఈ మూడూ కలిస్తే అది తపస్సు అవుతుంది. విశిష్ట్భక్తులు, నిస్వార్థపరులు, విశ్వమానవ హితాభిలాషులు అయిన ఋషులు చేసే తపస్సు అలాంటిదే. ఎంతో దీక్షాదక్షులయిన మహాఋషులు చేసే తపస్సు, పరిశోధనలు, అన్నీ సర్వమానవ హితం కోసమే చేశారు. ప్రతిభాశాలురైన ఈనాటి శాస్తవ్రేత్తలు చేస్తున్న పరిశోధనలు, వాటి సత్ఫలితాలు, సర్వమానవహితం చేకూర్చేవే! వారూ ఋషులవంటివారే! పిచ్చికుక్క కాటుకు గురి అయిన మనుషులు మరణించకుండా టీకా మందు కనిపెట్టి కాపాడిన ‘లూరుూ పాశ్చర్’ ఋషి వంటివాడు కాదంటారా? అటువంటి మహనీయుల్ని ఆధునిక ఋషులు అనవచ్చు! తపస్సంపన్నులైన ప్రాచీన ఋషులు చేసిన మానవ మహోపకారమే ఈనాటి ఆధునిక ఋషులైన శాస్తవ్రేత్తలు చేస్తున్నారు. ఇక ముందూ చేస్తారు, విజయాలు సాధిస్తారు.
నిరంతరం మానవ సమాజ పరిణామక్రమాన్ని నిశితంగా పరిశీలించిన గతకాలపు ఋషులు, ఈ కాలపు శాస్తజ్ఞ్రులు, మేధావులు చేసిన పరిశోధనలు ఏకాగ్రంగా, దీక్షతో స్వయంగా చేయటానే్న స్వాధ్యాయం, తపస్సు అంటారు. ఆ తపస్వాధ్యాయాల ద్వారానే అనేక నవీన ఆవిష్కరణలు జరిగాయి, జరుగుతున్నాయి. ఇంకా జరుగుతాయి. ఇతర గ్రహాలపై మానవ నివాసాలు ఏర్పడతాయి. ఈనాటి విజ్ఞాన శాస్త్ర పురోగతి ఇది తథ్యం అని సూచిస్తూ వుంది. అత్రి, వశిష్ట, విశ్వామిత్ర, వామదేవ, గౌతమ, కణాద, అగస్త్య, మార్కండేయాది మహాఋషులు వేసిన జ్ఞాన, విజ్ఞాన శాస్త్రాల పునాది ఈనాటికి ఇలా ఎదిగి విస్తరించి మానవులు అంతరిక్ష గ్రహాలపై అడుగుపెట్టే స్థాయికి వచ్చింది. ఆ మహాఋషుల కృషిలో పాలు పంచుకొని అమూల్యమైన సహకారం అందించిన వారి సతీమణులు అనసూయ, అరుంధతి, మరుద్వతి, అహల్య, లోపాముద్రలు ఆదర్శ మహిళలే! భారతీయులకు ఆరాధనీయులే!
ఏ దినమున జగద్గురువు శ్రీకృష్ణ్భగవానుడు ఈ భూమిపై ధరించిన శరీరాన్ని విడిచి వైకుంఠానికి చేరాడో ఆ దినం నుండి అశుభ ప్రతిపాదకమైన కలియుగం ఆరంభం అయిందని మహాభాగతం చెప్పింది. ఆ కలియుగ కాలగమనంలో నిష్ఠాగరిష్ఠులైన అలనాటి ఋషుల వంటి మహనీయులు కనుమరుగయ్యారు. ఈనాటి ఆధ్యాత్మిక గురువులు, బాబాలు ఎలా వున్నారో చెప్పాలంటే వింత కథలాగే వుంటుంది.
ఆపాద భుజ, హస్త, కాషాయాంబర ఆడంబర వేషధారులు, ఆధ్యాత్మికం పేరుతో మాయమాటలు చెప్పే మాంత్రికులు, కనికట్టు గారడీ విద్యల తాంత్రికులు, బాబాలై, స్వాములై అవతార పురుషులవలె నవ సమాజపు తెర ముందుకు వచ్చారు. వింతగా కనిపించే రింగుల తలకట్టు జుట్టులతో, పెద్ద పెద్ద కుంకుమ బొట్టులతో అమాయక స్వదేశ విదేశ భక్తుల్ని ఆకర్షిస్తున్నారు. దేవుళ్లమని భ్రమింపజేస్తున్నారు. కానుకలు, విరాళాల రూపంలో కోట్లు గడిస్తున్నారు. ఇంద్రభవనాల్ని తలపింపజేసే ఆశ్రమ భవనాలు నిర్మించుకొంటున్నారు. విలాసజీవితాన్ని గడుపుతున్నారు. నిష్ఠాగరిష్ఠ తపస్సంపన్నులైన ప్రాచీన కాలపు ఋషులెక్కడ! ఒకవైపు భారతదేశం శాస్త్ర విజ్ఞానంలో అగ్రగామి దేశంగా అంతరిక్షంలోకి దూసుకుపోతుంటే, మరోవైపున పవిత్రమైన భారతీయ ఆధ్యాత్మిక పరిజ్ఞానం బాబాల, స్వాముల బారినపడి మూఢ నమ్మకాలతో మసకబారింది. ప్రభుత్వాలు, మేధావులు పట్టించుకోవాలి. ప్రజల్ని చైతన్యవంతుల్ని చెయ్యాలి. ప్రజా ప్రతినిధులు కూడా బాధ్యత వహించి ఈ ప్రజా వంచకుల ఆటలు కట్టించాలి!
నవయుగ మానవులారా! మీ మనస్సులను నిశ్చలం చేసుకొని అసత్యం నుండి సత్యమార్గానికి మళ్లించండి! చీకటినుండి వెలుగు వైపునకు నడవండి! ‘అసతోమా సద్గమయా, తమసోమా జ్యోతిర్గమయా’ అనే వేద సూక్తంలోని అర్థం అదే! మానవుల్ని సత్యమార్గంలో నడవమంటున్న వేదసూక్తి ఎంతో విలువైనది, సత్యమైనది- అదే అసతోమా సద్గమయ!

-పారుపల్లి వెంకటేశ్వరరావు