మంచి మాట

విద్యాబుద్ధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి మనుగడ సవ్యంగా సాగాలంటే మంచి విద్య చాలా అవసరం. దానికి తోడు వినయం, విధేయతతో కూడిన బుద్ధి కూడా అవసరం. అంతకుమించి మంచి సంస్కారం ఉండాలి. అందుకే విద్య లేనివాడు వింత పశువు అన్నారు. విద్యలేనివాడు గొడ్డులా చాకిరీ చేయగలడు కానీ సమయస్పూర్తితో కొన్ని పనులు చేయలేడు. అదే మంచి విద్యను అభ్యసించినవాడు కండబలంతో, బుద్ధిబలంతో అన్ని పనులు సవ్యంగా నిర్వర్తించగలడు. అదే విద్యకున్న మహిమ. ఎన్ని కోట్లు ఆస్తులున్నా పదిమందికి విద్యను పంచేవాడే గొప్పవాడు.
పూర్వం రోజుల్లో ఎక్కడో అడవుల్లో వుండే ఆశ్రమాల్లో గురువుల స మక్షంలో విద్యను అభ్యసించేవారు. రాజైనా, పేదైనా, రాముడైనా కృష్ణుడైనా గురువుల వద్ద విద్యను అభ్యసించినవారే. అదే విద్యకున్న విలువ. సకల శాస్త్రాలు చదివే వారు అస్త్ర శస్త్రాలు నేర్చుకునేవారు అందుకే వారంతా మహాత్ములు అయ్యారు.
కాని నేటి తల్లిదండ్రులు పిల్లలను డాలర్ల యంత్రాలుగా మార్చి అందరూ మర మనుషుల్లా జీవిస్తున్నారు. అందరూ ఉన్నా ఆస్తులున్నా జీవచ్ఛవాల్లా ఎవరు లేని అనాధల్లా జీవితం గడుపుతున్నారు. పిల్లలు చిన్న వయసులోనే అనేక రోగాల బారిన పడుతున్నారు. ఇదెంతవరకు సమంజసమో మనమంతా ఓసారి ఆలోచించాలి. బంధాలు, అనుబంధాలు, మమతానురాగాలు ప్రేమాప్యాయతలు పంచలేని విద్యాబుద్ధులు ఎందుకు? సభ్యత సంస్కారం లేని విద్య ఎందుకు? మంచి విద్యాబుద్ధులను తల్లిదండ్రులు చిన్నప్పటినుండే నేర్పాలి. పిల్లలకు మంచి విద్యనందించే గురువులు కల కళాశాలయందే చేర్చాలి. అపుడే మన పిల్లలకుభావి జీవితానికి పురోగతి.
మనకు దిశానిర్దేశం చేసేది ఒక్క గురువు మాత్రమే. ప్రతి గురువు తనవద్ద విద్యనేర్చిన ప్రతివాడు మంచివాడుగా ఎదగాలనే కోరుకుంటాడు. మంచి సంస్కారవంతుడు అవ్వాలని ఆశిస్తాడు. ఆడుకునే వయసులోఆడుకోవాలి. పాడే వయసులో పాడాలి. చదువుకునే వయసులో మంచి విద్యను అభ్యసించాలి. చదువుతోపాటు మంచి సంస్కారం, వినయ విధేయతలు అలవరుచుకోవాలి.
మానవ జీవితం దర్పణం లాంటిది. నవ్వితే నవ్వుతుంది. ఏడిస్తే ఏడుస్తుంది. అందుకే జీవితాన్ని అందంగా దిద్దుకోవాలి. సమయానుకూలంగా స్పందిస్తూ సంఘంలో మంచిపేరు తెచ్చుకోవాలి. దీపం వెలుగుకు చచ్చే పురుగులా కాకుండా ఆ వెలిగే దీపం మనం కావాలి. కష్టమనే ప్రమిదలో శ్రమనే వత్తిని వేసి ఆనందం చమురు వేసి పరమానందం అనే వెలుగునివ్వాలి. దీపం పరబ్రహ్మ స్వరూపం. అజ్ఞానపు చీకట్లను పారదోలి ఈ ప్రపంచానికి వెలుగురేఖ కావాలి.
భగవంతుడు మనకెంతో శక్తిని ఇచ్చాడు. అన్ని జన్మలకన్నా మానవ జన్మ ఉత్తమమైంది. సకల జీవకోటిలో లేని గొప్పదనం ఒక్క మానవుడికే ఇచ్చాడు భగవంతుడు. అలాంటి భగవంతునికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలము కడదాకా మంచికోసం శ్రమించడం తప్ప. మంచి మానవత్వం, పదిమందికి సాయపడడం, భగవంతుని ఆరాధన, అమ్మానాన్నలను గౌరవించడం, గురువులను పూజించడం, ఆపన్నులను ఆదుకోవడం లాంటివి మంచి పనులు చేయడం. చేసే పనికి ఫలితం ఆశించనివాడే మనిషి. శ్రీ కృష్ణపరమాత్ముడు ‘నీవు చేసే పని చేస్తూ వెళ్లు. ఫలితం ఆ భగవంతుడు ఇస్తాడు అని గీతలో బోధించాడు. ఈ అత్యుత్తమ జన్మను ప్రసాదించిన ఆ భగవంతునికి మనసా వాచా కర్మణా కృతజ్ఞతా అక్షర నమస్సుమాంజలులు అర్పిద్దాం. మంచి మనిషిగా కలకాలం జీవిద్దాం.
...................................................................
మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి. మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి.
ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

-కురవ శ్రీనివాసులు