నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. కరువలి దూలుకపిల జటాలియ కరమొప్పు శిఖలుగాఁ గనక రత్న
మయజాల భూషణమలదేహ దీప్తుల తేజంబుగాఁ బ్రవి దీవ్యమాన
యాగశతంబుల నర్చితం లైన మూఁ డగ్నుల ప్రత్యక్షమైన యట్లు
దనమ్రోల శర్మిష్ఠ తనయులు గ్రీడించు చుండంగ నున్న యయ్వుర్విఱేని
ఆ. కడకు నేఁగుదెంచెఁ గన్యలు దనుజాధి
రాజౌలిలఁ దొడరాఁజ నొప్పె
దేవి దేవయాని దేవేంద్రుని దేవియ
పోలె నెంతయును విభూతి మెఱసె
భావం: గాలి చేత కదిలే కపిల వర్ణం గల జడల సమూహమే మిక్కిలి సుందరమైన సిగలుగా , బంగారంతోను, రత్నాలుతోను. నిండిన నగల వలె నిర్మలమైన శరీరకాంతులే తేజస్సుగా ప్రకాశిస్తున్న వందలాది యజ్ఞాల యందు పూజించబడిన త్రేతాగ్నులు సాక్షాత్కరించినట్లు తన ఎదుట శర్మిష్ఠకుమారులైన ద్రుహ్యుడు, మొదలైన వారు ఆడుతుండగా వున్న యయాతి మహారాజు వద్దకు కన్యకలున్నూ, వృషపర్వుడి కూతురైన శర్మిష్ఠ యున్నూ తన వెంట రాగా దేవేంద్రుడి పట్టమహిషి యైన శచీదేవి వలె వైభవం మెరయ పట్టమహిషి యైన దేవయాని వచ్చింది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము