నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. దానికి భీతుఁడవై య
మ్మారవతీ ప్రార్థనం గ్రమం బొనరఁగ సం
తానము వడసిత నెదలో
దీనికి నలుగంగఁ దగునె దివ్యమునీంద్రా
భావం: దేవతా మునిశ్రేష్ఠుడివైన ఓ శుక్రాచార్య! ఆ భ్రూణ హత్యా పాపానికి భయపడి మానవతి యైన శర్మిష్ఠ కోరిక చేత వరుస ఒనగూడేటట్లుగా సంతానాన్ని పొందాను. దీనికి హృదయంలో కోపించతగునా? అని యయాతి మహారాజు తన భార్యకు ఇచ్చిన కానుకలతో పాటుగా వచ్చిన వేయమంది కన్యారత్నముల్లోనిదైన శర్మిష్ఠను పెళ్లాడినది కేవలం ధర్మచ్యుతి కలుగకూడదని అని మాత్రమే చెప్పాడు. అట్లా అని శుక్రాచార్యుని కోపాన్ని తగ్గించడం కోసం ఇలా మాట్లాడాడు. కాని దైవం ఏమి శాసిస్తుందో అదే జరుగుతుంది కదా. శుక్రాచార్యుడు తన కూతురి పై ఉన్న ప్రేమతో యయాతికి శాపం ఇచ్చాడు. దాని వల్ల అమృతత్వసాధన వెల్లడైంది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము