భక్తి కథలు

హరివంశం -115

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజ మాయా ప్రభావం ఎవరూ తెలుసుకోలేనట్లుగా వారి వర్తనం ఉండేది. ఇట్లా మధురలో బలరామ వాసుదేవులు పొద్దులు పుచ్చుతుండగా బలదేవుడు తమ్ముడితో ఒక రోజున ఇట్లా అన్నాడు. ‘కృష్ణా! ఒకసారి వ్రేపల్లె వెళ్లి అక్కడి మన చిన్ననాటి రోజులను వేడుకగా గుర్తుచేసుకోవాలని ఉంది. మళ్లీ ఆ ప్రదేశాలలో ఒకసారి విహరించాలని ఎంతో కుతూహలం కలుగుతుంది. కొన్ని రోజులక్కడ గడిపి మళ్లీ నేను నీ దగ్గరకు వచ్చేస్తాను’ అని కృష్ణుడితో ఒప్పించుకొని ఆ గోకులంలో గడపిన నాటి వేషభాషలతో అక్కడకు చేరాడు బలరాముడు. ఆయనను చూసి గోకులం వాసులంతా ఎంతో సంసబరపడ్డారు. గోపికలంతా ఉత్ఫులనయనాలతో ఆయన రాకను స్వాగతించారు. కులం పెద్దలంతా ఆయనను పరివేష్టించి జరిగిన సంగతులన్నీ ఆయనతో పరితోషంతో ముచ్చటించారు. ‘చూడు! బలదేవా! పెద్దలేమంటారు? తమ తమ పుట్టి పెరిగి చిన్ననాడు విహరించిన ప్రదేశాలకన్నా ప్రియమైన తావులు మరి ఇతరములుండవంటారు కదా!
అది ఇప్పుడు నీ రాకవల్ల నిజమైంది. మమ్ముల్ని చూడాలని నీకనిపించటం, అది మాకెంతో భాగ్యం! మా అదృష్టం ఆ దేవలోకవాసులకు కూడా పట్టదు కదా! అని మురిపంగా బలరాముణ్ణి కొనియాడారు గోకుల వాసులు. అంతేకాక మీ అన్నదమ్ములిద్దరూ మధుర వెళ్లినప్పటినుంచీ మీ గూర్చి అన్ని విషయాలూ మేము వింటూనే ఉన్నాం. కంసుణ్ణి చంపటం, చాణూర ముష్టికులను హతమార్చటం, మీ తల్లిదండ్రులను ఇంతింతనరాని ఇడుముల పాల్జేసిన ఘోరపరాధి పరమ శత్రువైన కంసుడి తండ్రికే మళ్లీ రాజ్యాన్ని ఇవ్వటం, అవంతి నగరానికి వెళ్లి సకల విద్యలార్జించటం, మృతుడైన గురుపుత్రుణ్ణి ఆతడి తండ్రికి గురుదక్షిణగా సమర్పించటం, గోమంతనగం దగ్గర శత్రువులను జయించటం, మీ దివ్యాయుధాలను ధరించటం, కరవీరపురం ఏలే రాజును వధించటం, మళ్లీ మధురకు పోవటం, అక్కడ జరాసంధుణ్ణి పదే పదే పరాభవించటం అన్ని సంగతులూ మేమూ విన్నాము. మీ దివోద్బుత ప్రభావ పరాక్రమాలు తెలుసుకున్నాము. మీరెవరివారో ఇక వారికి సకల కల్యాణాలు చేకూరటంలో ఆశ్చర్యం ఏమున్నది? అని బలరామకృష్ణులపట్ల తమ ప్రేమాభిమానాలను వ్యక్తం చేశారు.
అప్పుడు బలరాముడు కూడా మీ ఇళ్ళలో పెరిగి పెద్దవాళ్ళమైనాము. మీ మక్కువ మాకెక్కడా లభించదు. ఆనందోల్లాసాలు ఇక్కడ పొందినంతగా మేమెక్కడా పొందలేదు. మీ విందులు, మీ ప్రియ వాత్సల్యాలు మేమెట్లా మరచిపోతాము? మాకు రాచ సిరి అబ్బిన మాట నిజమే! కాని ఆ రాచరికపు సుఖ సౌఖ్య సౌభాగ్య విలాసాలకంటే వ్రేపల్లె అంటేనే మాకు ఇష్టం. మీ వంటి బంధువులు మాకెక్కడ లభిస్తారు? అని గోకుల వాసులను సంతోషపెట్టాడు బలరాముడు.
ఇట్లా గోకులంతో సంతోషంగా గడుపుతుండగా ఒక రోజున గోకుల వాసులైన గోపకులు, గోపికలు బంధువులు ఆయనను అర్చించారు. అనేకమైన కానుకలు సమర్పించారు. వివిధాన్న భక్ష్య భోజ్య రసపానీయాలతో సంతృప్తిపరచారు. సముద్ర మథన వేళ వరుణ పుత్రిక వారుణి ఆయనను వరించింది కాబట్టి బహు సుగంధ మాధుర్య వైవిధ్య రసోపేతమైన మధువును సభక్తికంగా అర్చించి కృతార్థులైనారు. ఆయన ఆ మధువును పరితృప్తిగా ఆస్వాదించాడు. అప్పుడాయన గోకుల వాసులు తన పట్ల చూపిన ప్రేమాభిమానాలకు, ఆదర గౌరవాలకు, మాధుర్య రసార్ద్రతలకు పరవశుడైనాడు. ఆయనకు యమునా నదిలో తృప్తిదీర స్నానం చేసి శరీరాయాసం తీర్చుకోవాలనిపించింది.

ఇంకాఉంది

- అక్కిరాజు రమాపతిరావు