భక్తి కథలు

హరివంశం -7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనఘాత్మా! క్రతువులలో అగ్రపూజితుడివి నీవు. వేద పురుషుడివి నీవు. తపోయజ్ఞాలు, యజన యాజనాదులు నీవే. రాక్షస సంహారం కోసం నీవు నిమగ్నుడివైనందువల్ల మేము మా అధ్వర క్రియలన్నీ చాలించి నినే్న తలచుకుంటూ వచ్చాము. ఇపుడు నీవు విజయుడవై మాకు సాక్షాత్కరించావు. మా సేవలు, మా పూజలు స్వీకరించవలసింది అన్నారు వాళ్ళు.
ఈ అభ్యర్థనలకు ఎంతో సంతుష్టుడైనాడు శ్రీమన్నారాయణుడు. అక్కడ చేరిన వారందరికినీ పేరు పేరునా ప్రత్యేకించి దగ్గరకు తీసుకుని అనుగ్రహించాడు. ఆ దేవాది దేవుడు పితామహుడికి వందనం చేశాడు. వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పాడు. అక్కడినుండి మరి ఎక్కడకూ పోకుండా పాలకడలికి వెళ్లాడు. ఆయన అసలు నివాసమది. అది వైకుంఠం. అక్కడ సూర్య చంద్రకాంతులు వెల వెలబోతాయి. బ్రహ్మేంద్రాది దేవతలు తప్ప ఇతరులెవరూ అక్కడకు చేరలేరు.
పురాణ నివాస స్థానమది ఆయనకు. వెలుగులన్నింటి వెలుగై సహస్ర శీర్షుడై, సహస్రాక్షుడై, దశసహస్రకరుడై, ఆయన శేష తల్పంపై సుప్తిననుభవించాలని కోరుకున్నాడు. అది ఆయన యోగ నిద్ర. ప్రతి కల్పాంతంలో ఆయనను సేవించుకుంటుంది ధన్యాత్మ అయిన విశ్వమోహన అని సార్థకనామయైన నిద్ర. సృష్ట్యాదిలో, సృష్టంత్యాన, ఆయన తత్త్వమేమిటో, ఆయన సత్వమేమిటో, ఆయన మహిమ ఎటువంటిదో, ఆ పరంజ్యోతి, పరంధాముడి ప్రభావమేమిటో ఎవరూ ఊహించలేరు. పరి పరి ఊహలు చేస్తారు పరతత్త్వం బోధపరచుకోవాలని ప్రయత్నపరులైన వాళ్ళు. ఆ అచ్యుతుడు దేవతలకే ఆది అంతు తెలియనివాడు.
గ్రీష్మ ఋతువు సమాప్తిలో ఆయన సుప్తి పొందగానే ఇంద్రుడు పుష్కలాపర్తం మొదలైన సమస్తమేఘాలను జగత్తును చల్లబరచి సస్యవృద్ధి చేకూరేట్లు పంపుతాడు. అపుడు పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయి. లోకమంతా పచ్చదనంతో శోభిస్తుంది. ఇంతలో శరదృతువు వస్తుంది. అపుడు పరాత్పరుడు మేలుకొంటాడు. లోకాలన్నింటా సర్వ కల్యాణాలు సమకూరుతాయి. యజ్ఞ సమృద్ధి విభవంగా లోకాలు పరితోషం చెందుతాయి. ఈ విధంగా అన్ని కల్పాలలోను పతిని, పతివ్రతలాగా యోగనిద్ర శ్రీమన్నారాయణుణ్ణి అనుసరించి ఉంటుంది.
ఒక్కొక్క కారణంగా ఒక్కొక్క యుగంలో భయంకర బలదర్పితులైన దనుజులు విజృంభిస్తారు. లోకాలను ఉపద్రవాలపాలు చేస్తారు. దేవలోకం వారిని బాధలపాలు చేస్తారు. వాళ్ళపై దండెత్తుతారు. దేవతలు దీన స్థితిననుభవిస్తారు. లోకాలన్నీ వ్యాకులమైపోతాయి. అపుడు పరాత్పరుడు, పరంధాముడు, పరమాత్మ, రాక్షస వినాశనం కోసం కావలసిన సన్నాహంతో ఆయా అవతారాలు అంగీకరించి లోక కల్యాణాన్ని మళ్లీ మళ్లీ నిర్వహిస్తాడు. యోగనిద్ర ఆయన మూలప్రకృతి. కల్పాంతంలో ఆయనలో లీనమవుతుంది.
విశ్వరక్షకుడైన శ్రీమన్నారాయణుడు దుగ్ధసాగరంలో విముగ్ధయోగ నిద్రా పరవశుడై ఉన్న ఆ సమయంలో కృత, త్రేతాయుగాలు రెండూ గడచిపోయాయి. ద్వాపర యుగం వచ్చింది. ఈ ద్వాపరం గడుస్తున్నకొద్దీ జన సంఖ్య అంతకంతకూ అధికమవుతూ భూదేవి ప్రజాభారాన్ని సహించలేకపోతున్నది. రోజు రోజుకూ ఆమె సంతాపం అధికమవుతూ వచ్చింది. ఓర్చుకోలేక ఆక్రోశించసాగింది పృధివీమాత. ఆమె కష్టాన్ని చూసి, దుఃఖాన్ని చూసి దేవలోకంలోని దేవతలు తల్లడిల్లిపోయారు. వాళ్ళంతా సమూహంగా వెళ్లి బ్రహ్మదేవుడికి భూదేవి గోడు విన్పించారు.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు