మంచి మాట

వాత్సల్యం - దేశభక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాత్సల్యం ఒక అనుభూతి. ప్రేమ కంటే మధురమయినది. వాత్సల్యాన్ని ప్రత్యక్షంగా పరిశీలించాలంటే.. అప్పుడే ఈనిన గోమాత వద్దకు వెళ్లి చూడండి. తన బిడ్డ (లేగదూడ)ని అది సాకే విధానం గమనించండి. దూడ శరీరాన్ని నాకుతూన్నప్పుడు, ఆ గోమాత కళ్ళలో కనపడేదే వాత్సల్యం. వత్స అంటే శిశువు. తన శిశువు మీద గోమాత చూపించేదే వాత్సల్యం.
కొడుకులలో మంచివాళ్ళు ఉంటారు. చెడ్డవారు కూడా ఉంటారు. ఒక్కోసారి కుమారుడు చెడ్డవాడుగా మారవచ్చు. ఎట్టి పరిస్థితిలోనూ ఏ కాలంలోనూ చెడ్డ తల్లి ఎక్కడా ఉండదు. ప్రతీ జీవికి, ఎవరి తల్లి వారికుంటుంది. కానీ దేశ ప్రజలమైన మనందరికీ కలిపి ఒకే ఒక తల్లి ఉంది. ఆవిడే దేశమాత. అందువల్లే మనం జన్మించిన ఈ భూమిని మాతృభూమి అని పిల్చుకుంటాం. మనం ఆ తల్లిమీద చూపించేదే మాతృభక్తి అనీ, దేశభక్తి అనీ వ్యవహరిస్తాం. అదే మన మాతృదేశంమీద ఉండే గొప్ప భావన. ప్రజలకు దైవభక్తి మాత్రమే ఉంటే సరిపోదు, దానితోపాటు దేశభక్తి కూడా ఉంటే అది సంస్కారయుతంగా ఉంటుంది. మననీ, మన దేశాన్నీ విజయాలవైపు నడిపిస్తూంటుంది. చూడండి..
అనేకానేక సందర్భాలలో మనమందరం భగవంతుణ్ణి ప్రార్థిస్తూంటాం.. ఒక గుడిలోనో పుణ్యతీర్థంలోనో, ఇంట్లోనో, బస్సులో వెళ్ళేపుడు రోడ్డుప్రక్కనున్న చిన్న ఆలయంలోనో చూసి చేతులు జోడించి నమస్కరిస్తూండడం సహజం. అలా నమస్కరించిన ప్రతిసారీ లేదా దేవాలయానికి వెళ్లినపుడు, పూజలు చేసినపుడుగానీ మనతోపాటు దేశాన్ని కూడా రక్షించమని వేడుకుందాం. అలాటి కోట్ల కొలది ప్రార్థనలను విన్న భగవంతుడు మననూ, మన దేశాన్నీ తప్పక సుభిక్షం చేయగలడు. అప్పుడు దేశంతోపాటు మనమూ బాగుంటాం. దేశం బాగుండకపోతే మనం మాత్రం ఎలా బాగుండగలుగుతాం?
ఇలాటి మాతృభూమి ఒడిలో ఎందరో కుమారులు పుట్టి పెరుగుతూంటారు. కొద్దిమంది దుష్ట స్వభావులై, స్వార్థంతో కన్నూ మిన్నూ కానక ప్రవర్తిస్తుండడం గమనించే ఉంటాము. కానీ తల్లి, తన కుమారుడెటువంటి వాడైనా తనకి తానుగా అటువంటి కుమారుని శిక్షంచలేదు.. ‘అమ్మ’ కదా! అటువంటి సమయాలలో శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్లి భూమాత మొరపెట్టుకుంటుంది. ఆయనేమో అవతారాలెత్తి దుష్ట సంహారం చేస్తాడు.
అందుకే మొదట మనకి జన్మనిచ్చిన మాతృమూర్తినీ, మనం జన్మించిన మాతృభూమినీ, తదుపరి మనని క్షేమంగా ఉంచుతున్న దేశమాతనీ, ఎన్నికయిన ప్రభుత్వాన్నీ, నివశిస్తున్న మన సమాజాన్నీ గౌరవించడం ప్రతి పౌరుడూ విధిగా చేయాల్సిన పని. ఈ పని మనం ఎవరినో గౌరవించడం కానే కాదు.. మనని మనం గౌరవించుకోవడమే అని చెప్పాలి. తల్లిని ప్రేమించగలిగినవాడూ, తల్లిని గౌరవించగలిగినవాడూ మాత్రమే తనతో సమానంగా భార్యను గౌరవించగలడు. ప్రేమగా చూసుకోవడం చెయ్యగలడు. ఇటువంటివారి సంతానమే సత్సంతానంగా మారి సమాజానికీ, దేశానికీ బలమైన, పట్టుదల కలిగిన యువతనందించగలదు.
ఈ రోజుల్లో చాలామంది గీతా పారాయణం చేస్తున్నారు. అలాగే ప్రవచనకారుల ప్రవచనలకి భక్తితో హాజరవుతున్నారు. ఒకానొక సద్గురువుని ఆశ్రయించి వారి అనుంగు శిష్యులుగా మారి, వారు చెప్పేవన్నీ శ్రద్ధగా విని భక్తిగా ఉంటారు. శ్రీరామకృష్ణపరమహంసని తన గురువుగా నరేంద్రుడు కోరుకోలేదు. నరేంద్రుడినే తన శిష్యునిగా పరమహంస ఎంచుకున్నారు. నరేంద్రుడు ఒక్కసారి శ్రీరామకృష్ణుని గురువుగా అంగీకరించాక వారు మార్గదర్శకులయి.. దేశం, ప్రపంచం అంతా మన సంస్కృతి పరిమళాల్ని వెదజల్లారు. వివేకానందుని ద్వారా వెదజల్లిపించారు. అందువల్లనే ‘ప్రపంచానికి భారతదేశం ఒక పూజగది’ అని వివేకానందులు సెలవిచ్చారు. వారిరువురు మధ్యా వున్న వాత్సల్యం హద్దుల్లేనిది.

-సుబ్రహ్మణ్యం కంభంపాటి