నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ. వేద విహిత విధుల నాదరించుట యూర్థ్వ
గతికిఁదెరువు విధుల ఁ గడచి యెందు
నాఁగ బడినవాని లోఁగక చేయుడ
యధమ గతికి మార్గమనిరి మునులు

భావం: యయాతి తమకు మంచిచెడుల జ్ఞానాన్ని బోధించమని యయాతి మనుమలు అడిగారు. తన అహంకారం, గర్వం అనే గుణాల వల్ల తాను స్వర్గ లోకంనుంచి ఎలా నక్షత్రలోకానికి వచ్చేశాడో తెలుసుకొని తన అహంకారం వల్లనే ఇంద్రుడు ఇలా శపించాడనుకొన్న యయాతి ఇంద్రునిపై కోపగించక తన మనుమలు సత్యధర్మాలను గురించి చెబుతూ వేద విధించబడిన కార్యాలను పాటించటం ఉన్నతమైన గతికి మార్గం . వేదమందు విధించబడిన కార్యాన్ని అతిక్రమించి ఎల్లయెడల నిషేధించబడిన వాటిని వెనుదీయక చేయటం నీచమైన గతికి మార్గం అని మునులు చెప్పారని యయాతి తన మనుమలకు వివరించాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము