నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. కలయఁగ నార్పుల బొబ్బల
యులిపున నవ్వి పెన మను మహోదధిఁ బెలుచం
గలఁచెను దుష్యంత మహా
బల మందరనగము సత్త్వ భయజననం బై
భావం: దుష్యంతుడికి వేటాడాలనే మనసు కలిగింది. ఆరోజు సూర్యుని రథానికున్న గుర్రాలకంటే వేగంగా కదిలే గుర్రాలున్న తన రథంలో ఈటెలు, చిల్లకోలలు, విండ్లు, కత్తులు మొదలైన ఆయుధాలను చేతులలో ధరించిన వీర భటులు అనేకులు వెంటరాగా ముందుకు సాగి వనంలోని మృగాలను చూస్తూ ముందుకు పోతున్నాడు. ఆ సందర్భంలో ఆ వనమంతా దుష్యంతుని భటులు ఆవరించారు. ఉత్సాహంతో కేకలు వేసే భటులు, భయంతోనో వ్యాకులపాటుతోనో అరుస్తున్న జంతువుల అరుపులు కలసిన చప్పుడుతో ఆ అరణ్యమనే మహాసముద్రాన్ని దుష్యంతుడి సేన అనే మందర పర్వతం ప్రాణులకు భయం కలిగేటట్లు కలతపెట్టింది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము