మంచి మాట

మానవతా తత్వ గ్రంథం భగవద్గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకృష్ణుడు వెన్నంటి ఉన్న యుద్ధరంగంలో అర్జునుడంతటి ధీరుడికే మనోదౌర్భల్యం ఆవరించిందంటే ఇక లౌకిక జీవనంలో నిత్యం ఒత్తిళ్ళతో సతమతమయ్యే సామాన్యుల సంగతి చెప్పనక్కరలేదు. ఆపై కృష్ణుడు ప్రవచించిన ధర్మోపదేశమే అర్జునుణ్ణి కార్మోన్ముఖుణ్ణి చేసింది. అదే భగవద్గీతగా నేటికీ నిత్య నూతన జ్ఞాన కాంతుల్ని విరజిమ్ముతోంది. గీతతో జీవనగీతలను మార్చుకోవచ్చని అనేకమంది మహాపురుషులు నిరూపించి చూపారు.
జీవితరథాన్ని ఐహిక వాంఛలతో నడపడం సంసార బంధమైతే, దైవ మార్గంలో మళ్ళించడానికి చేసే కృషిని మోక్షమార్గం అంటారు. అదే గీతారహస్యం. గీతలో కృష్ణుడు మానవుడ్ని నాలుగు దశల్లో చూపిస్తాడు. సంసారంలో చిక్కుకుని సతమతమయ్యే దశ మొదలు ఆ సంసార స్థితినుంచి మెలకువ కలిగే స్థితి రెండవది. మేలుకొన్న మానవుడు యధాస్థితికి చేరేందుకు చేసే యోగసాధన మూడవ దశ కాగా- తన శరీరాన్ని దివ్యోపకరణంగా చేసే యోగ జీవితాన్ని వైభవోపేతంగా మలచుకునే దశ
సాక్షాత్తూ విష్ణువుతో పోల్చదగిన వ్యాస మహాముని అనుగ్రహంవల్ల గీత బోధనను సంజయుడు ప్రత్యక్షంగా వినగలిగాడు. విన్నది విన్నట్లుగా సంజయుడు గీత ను లోకానికి అందించాడు. ఈ గీతాజ్ఞానమంతా పద్దెనిమిది అధ్యాయులుగా పరమపదానికి సోపాన మార్గంగా విరాజిల్లుతుంది. ఒకప్పుడు కర్మపాశబద్ధులైన జీవుల యాతన చూడలేని భూదేవి విష్ణుమూర్తిని ప్రారబ్దం అనుభవించే మానవులకు విముక్తి మార్గమేమిటని అడిగింది.. గీతాభ్యాసమే ప్రారబ్దానికి, పీడలకు సమాధానమని, ఎంతటి కర్ముపాశబద్ధులైనా గీతాపఠనంలో సుఖ సంపదలు పొందగలడని విష్ణుమూర్తి చెప్పాడు. శ్రీకృష్ణునిలో స్నేహశీలతను, రాజనీతిజ్ఞతను, ప్రేమతత్వాన్ని, మూర్తిమత్వాన్ని తెలుసుకోవాలంటే గీతను ఆస్వాదించాల్సిందే.
ఒకసారి శ్రీ చైతన్య మహాప్రభువు దక్షిణ దేశ తీర్థయాత్రలు చేస్తున్నారు. దారిలో పుణ్యక్షేత్రంలో ఓ బ్రాహ్మణుడు గీతాపారాయణం చెయ్యడం ఆయన గమనించారు. పారాయణం చేస్తున్నంతసేపూ ఆ విప్రుని శరీరం పులకలెత్తుతోంది. ప్రవాహంలా కళ్ళ వెంట నీళ్ళు జల జల రాలిపడుతున్నాయి. ఉచ్చారణ మాత్రం దోషభూయిష్టంగా ఉంది. అది పట్టించుకోకుండా గద్గద స్వరంతో గీతాపఠనం చేస్తూనే ఉన్నాడాయన.
అతని దగ్గరే నిలబడి ఇదంతా వింటున్న శ్రీచైతన్య మహాప్రభువు, ఆ విప్రుడు గీతాపారాయణం పూర్తిచేసిన తరువాత, ‘‘అయ్యా! మీరు చూస్తే మహాభక్తుడిలా ఉన్నారు. గీతాపారాయణం అంతా తప్పుల పడకగా వుంది. మీకసలు గీతాశ్లోకం అర్థం తెలుసా?’’ అని అడిగారు. అపుడా విప్రుడు, ‘‘ప్రభూ! తప్పొప్పులు నాకు తెలియవు. శ్లోకాలకు అర్థం తెలియదు. పారాయణం చేసేటపుడు ఎదురుగా ఒక రథం, ధ్వజరూపంలో ఉన్న ఆంజనేయుడు, ఆ రథానికి నాలుగు తెల్లని గుర్రాలు, ఆ గుర్రాలు పగ్గాలు చేబూనిన శ్రీకృష్ణపరమాత్మ శ్యామ సుందర విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. అంతేగాక ఆ విగ్రహం ....... విషణ్ణ వదనంతో, ముకుళిత హస్తాలతో రథాసీనుడైన అర్జునుడూ గోచరిస్తుంటాడు. అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న జగన్మోహనాకారం.. ఆ ఆకారం నన్ను తన్మయావస్థునిగా చేస్తూ ఉంటాయి’’ అంటూ నిష్కల్మషంగా చెప్పాడు. ఇది వింటూనే చైతన్య మహాప్రభువు ఆ విప్రుడిని కౌగిలించుకుని ‘‘మహానుభావా! నిజమైన గీతార్థం మీకు అర్థం అయంది. పూర్తిగా శ్లోకం తెలియకపోయినా గీతోపదేశకుడైన శ్రీకృష్ణుని మూర్తిని మనో మందిరంలో ప్రతిష్ఠించుకున్న మీకు సర్వశుభాలూ కలుగుతాయి!’’ అని ఆశీర్వదించాడు.
ఎక్కడ యోగీశ్వరుడైనా కృష్ణ్భగవానుడు, ఎక్కడ ధనుద్ధరుడైన అర్జునుడు ఉంటారో అక్కడ లక్ష్మి, విజయం, ఐశ్వర్యం, నీతి ఉంటుందని గీతార్థ సంగ్రహం. ఎటువంటి దుఃఖాల మధ్యనైనా సరే ఒక్కసారి చదివితే చాలు చిరునవ్వును చిగురింపజేసే దివ్య గ్రంథం గీత. అనేక కష్టాలనుంచీ, సమస్యలనుంచీ సందేహాలనుంచీ ఉద్ధరించేది భగవద్గీత.

-చోడిశెట్టి శ్రీనివాసరావు