భక్తి కథలు

హరివంశం 177

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీపై ఎవరూ దండెత్తి రాలేరు. వస్తే మళ్లీ తిరిగిపోలేరు. నినె్నవరూ జయించలేరు అని వరమిచ్చాడు. ఇక శోణపురి రాజధానిగా బాణుడు సకల రాక్షస చక్రవర్తిగా మహావిభవంతో ఉంటూ వచ్చాడు. కుమారస్వామికి కూడా బాణుడిపై ప్రేమ కలిగి దివ్య మయూరాన్ని అతడికి వాహనంగానూ, అతడి ధ్వజ చిహ్నంగానూ ఉండేట్లు అనుగ్రహించాడు.
పరమ శివుడే తనను పుత్రుడిగా స్వీకరించాడు కాబట్టి బాణుడికి త్రిలోకాలలో ఎవరూ వైరులు లేకపోయినారు. సురగరుడోరగ యక్ష రాక్షస గంధర్వ సిద్ధ సాధ్యులంతా అతడికి తలవంచారు. బాణుడిపై దండెత్తిరాగలవారు కాని, బాణుడు దండెత్తిపోవలసినవారు కాని ఈరేడు లోకాలలో ఎవరూ లేకపోయినారు.
ఇక బాణుడికి యుద్ధకండూతి రోజురోజుకూ దుస్సహంగా ఎక్కువవుతూ వచ్చింది. ఇట్లా చాలాకాలం ఎంతో అసహనంతో నిరీక్షించాడు బాణుడు. ఇక ప్రతీక్షించలేకపోయినాడు. పరమ శివుడి దగ్గరకు వెళ్లి సాష్టాంగ దండప్రణామం చేసి తన అవస్థ విన్నవించుకున్నాడు. వేయిసార్లు మొక్కాడు. నా చేతులు నాకు చాలా బరువనిపిస్తున్నాయి. ఇవి ఉండి ఏం ప్రయోజనం. ఇన్ని చేతులు ఒక అలంకారమా? ఇంద్రుడు మొదలైన వారు ఇదివరకే నాకు ఎన్నోసార్లు దాసోహమన్నారు. ఈ రణకండూతిని నేను భరించలేకపోతున్నాను. కాబట్టి దీనికేదో నీవే ఉపాయం చూడాలి. కుమారుడి కోరిక తండ్రి కాక మరెవరు తీరుస్తారు? అవి వినయ వినమిత శిరస్కుడై అని పరమ శివపాదానుద్యాతుడైనాడు.
పరమశివుడు పెదవి విరుపు కనపడనీయకుండా లేత నవ్వుతో ‘నీవు ఏమి కోరినా సరే! నేను ఇవ్వకుండా ఎట్లా ఉండగలను? కాబట్టి ఒక సంకేతం చెపుతున్నాను విను. నీ రాజ్య చిహ్నమైన నెమలి ధ్వజం నిర్నిమిత్తంగా, నిష్కారణంగా, అప్రయత్నంగా ఎప్పుడు విరిగి నేల కూలుతుందో, అప్పుడు నీవు కోరిన మహత్తరమైన పోరు నీకు సిద్ధిస్తుంది’ అనిఅనుగ్రహించాడు బాణుణ్ణి. మరి మరి మదనాంతకుడికి మొక్కులు చెల్లించి బాణుడు తన కొలువుకూటానికి వెళ్లి నెమలి ధ్వజం ఎక్కడ తన మహారాజ్య వైభవ చిహ్నంగా రెపరెపలాడుతూ శోభిస్తూ ఉంటుందో ఆ చోటికి వెళ్లి అక్కడే నీ రక్షాలోచనుడై కూచుండి తన ఆంతరంగిక మంత్రిని తన దగ్గరకు పిలిపించుకున్నాడు. కుంభాండుడనే ఆ మంత్రి రాగానే ‘నీకు అత్యంత ప్రియకరమైన వార్త చెప్పబోతున్నాను అని తన మంత్రిని ఉత్సుకుణ్ణి చేశాడు బాణుడు. ‘అదేమిటో చెప్పకుండా ననె్నందుకు ఉత్కంఠితుణ్ణి చేస్తావు? నా మనస్సు ఉద్వేగిస్తున్నది. వెంటనే చెప్పవలసిందని’ తన ఆప్త సచివుడు బాణుణ్ణి అర్థించాడు. ఇక ఉండబట్టలేక ‘ఇంద్రుడూ, ఉపేంద్రుడూ కూడబలుకుకొని నీమీదికి యుద్ధానికి రాబోతున్నారా? శంభువరప్రసాదివి కాబట్టి వాళ్ళు నినే్నమీ చేయలేరు. వీళ్ళిద్దరినీ ఔడు కరపించావంటే నీ తండ్రి బలిచక్రవర్తి వచ్చి నిన్ను అభినందిస్తాడు. బలిని మాయోపాయంతో విష్ణువు రసాతలానికి అణగద్రొక్కాడు. సత్యసంధుడు, పరమోదారుడు కాబట్టి నీ తండ్రి దానికనుమతించాడు. నీ తండ్రికి జరిగిన అన్యాయం నీవు చక్కదిద్దాలి. నీపై ఆ విష్ణువే యుద్ధానికి వస్తే అతణ్ణి ఓడించి పారద్రోలాలి. ఇంద్రుడు కాదు కదా వాడి అబ్బ వచ్చినా ఈసారి నీ దెబ్బకు తట్టుకోలేడు, అని ఇటువంటి పరమోత్సాహ భరితమైన వార్త ఏదో చెపుతావనుకుంటే, ఈ నెమలి ధ్వజాన్ని చూస్తూ కూచున్నావు?’ అని కుంభాండుడు వ్యాజస్తుతి చేశాడు బాణుణ్ణి.
అప్పుడు బాణుడు, పరమశివుడు తనకు చెప్పిన సంకేతం గూర్చి కుంభాండుడికి చెప్పాడు. కాని ఈ వార్తకు కుంభాండుడు సంతోషించకపోగా పెదవి విరిచాడు. ఇదా మహారాజా! మీరు చెప్పే వార్త! ఇందులో ఏదో గూఢార్థం, కపటార్థం నాకు స్ఫురిస్తున్నది.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు