మంచి మాట

రథయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతుడు, అనంతనామధారుడు, వ్యాప్తుడు, సర్వరక్షాకరుడు, దుర్లభుడు, సులభుడు, సంగతుడు, నిస్సంగతుడు, నిరాకారుడు, ఆకారుడు, ఇట్లా ఎనె్నన్ని విశేషణాలకు ఆధారభూతుడైన సర్వసాక్షి పరదైవం తన్ను తాను తన భక్తులకోసం అనేకవిధాలుగా, అనేక రూపాలుగా సృజియించుకుంటూ ఉంటాడు. అట్లా తన్ను తానుసృజియించుకునే భగవంతుడు వస్తువులోను, అవస్తువులోను తానే ఉన్నాడన్న సత్యాన్ని మరోసారి నిరూపించడానికి కోసం తన్ను దారువులో చెక్కమని చెప్పిన వాడు అన్నింటికీ కారణమైన వాడు తన మాటను వినలేదన్న కినుకతో సగం సగం పూర్తిఅయిన రూపాలతోనే పూరీ క్షేత్రంలో జగాలనేలే జగన్నాథుడిగా స్థిరపడ్డాడు. పూరీక్షేత్రంలో పూర్తిరూపమేర్పడని జగన్నాథుని ఉత్సవాలు, ఆచారాలు, సంబురాలు ఇట్లాంటివన్నీ కూడా విభిన్నం గా జరుగుతుంటాయ. ఎక్కడైనా తన భార్యతో ఉంటూ దర్శనమిచ్చే భగవంతుడు పూరీ క్షేత్రంలో మాత్రం తన సోదర,సోదరీ సమేతుడిగా దర్శనమిస్తాడు. ఈ సోదరసోదరీ సమేత జగన్నాథునికి అత్యంత ఆసక్తిదాయకమైన రథోత్సవం ప్రతిఏటా ఆషాడమాస శుద్ధ విదియనాడుప్రారంభమవుతుంది. ఈ రథోత్సవాన్ని చూడడానికి కూడా చర్మచక్షువులు చాలవు. ఈ రథోత్సవాన్ని చూచి తరించాల్సిందే కాని, వర్ణించడానికి ఆ బ్రహ్మకైనా దుస్సాథ్యం అంటారు.
పూరీ ఆలయాన్ని గంగరాజుల కాలంలో నిర్మించారని చరిత్ర చెప్తుంది. ఈ ఆలయాన్ని 10వ శతాబ్ధంలో కళింగరాజు అనంతవర్మ చోడగంగ దేవ్ పునరుద్ధరించినట్లు శాసనాలు పేర్కొంటున్నాయి. నాలుగు లక్షల చదరపు అడుగుల సువిశాల ప్రాంగణంలో కొలువైన ఆలయం ఇది. 214 అడుగుల ప్రధానశిఖరంపైన సుదర్శన చక్రం దేదీప్యమానంగా వెలుగుతూ ప్రపంచాన్నంతా సుభిక్షంగా కాపాడే దైవం ఇక్కడే ఉన్నాడని చెప్తున్నట్టు కనిపిస్తుంది. ఎన్నో ప్రత్యేకతలున్న ఈజగన్నాథుని రథయాత్ర వైశిష్ట్యాన్ని గురించి స్కాందపురాణం చెప్తుంది. జగన్నాథ రథం పేరు నందిఘోష. ఈ నందిఘోష 45 అడుగుల ఎత్తును, 35 అడుగుల చతురస్రాకారంలోను, 16 చక్రాలు కలిగి ఉంటుంది. నందిఘోషఅలంకారానికి పసుపు, ఎరుపు వస్త్రాలనే వాడడమూ మరో ప్రత్యేకత. బలభద్రుడి రథం పేరు తాళధ్వజ. ఈ తాళధ్వజం 14 చక్రాలతోతయారవుతుంది. దారుకుడు అనే రథసారథి తాళధ్వజానికి నీలం, ఎరుపు వస్త్రాలతో అలంకరణ సుభద్ర రథం రథనామం దర్పదలన. 12 చక్రాలతో నిర్మితమయ్యే ఈ దర్పదలనం ఎరుపు,నలుపు వస్త్రాలతో అలంకరణ చేసి అర్జున అనేరథసారథి ఎర్రటి గుర్రాలను పూన్చి జగన్నాథుని రథయాత్రలో తమ రథాన్ని తీసుకువెళ్తారు. ఈ రథంలోనే సుదర్శన చక్రాన్నీ అమరుస్తారు. ఇంతటి విశేషఅలంకారాలతో సమాయత్త మైన ఈ రథాలను సామాన్యసేవకునిలాగా పూరీ క్షేత్రమహారాజు వెండి పల్లకీలలో వచ్చి స్వామికి వందనమాచరించి మూడు రథాలను అధిరోహిస్తూ అక్కడ బంగరు చీపురుతో తుడిచి, పువ్వులు, పన్నీరు చల్లుతూ స్వాములకు సుభద్రాదేవికి పూజలు చేస్తారు. ఆ తరువాత రథాన్ని లాగి తానుమోక్షపురికి వెళ్లే ఆశను వ్యక్తం చేయగా మిగిలిన జనసందోహం కూడా జగన్నాథుని రథాన్ని ముందుకు లాగుతూ అందరూ ఆనందపారవశ్యంతో జగన్నాథుని సాయుజ్యానికి వెళ్లడానికి ఉత్సాహాన్ని చూపుతారు.
ఈ రథయాత్ర లో మున్ముందుగా బలభద్ర రథం, దాని వెంట సుభద్ర రథం కదులుతాయి. చివరగా చిద్విలాసమూర్తి జగన్నాధ రథ చక్రాలు కదులుతాయి. గుడించాగుడికి నందిఘోష ప్రారంభమవుతుంది. మంగళఘోషతో నాట్యవిన్యాసాలతో ప్రారంభమైన ఈ రథయాత్ర పూరీకి దాదాపు 1.6 కిలోమీటర్ల దూరంలో ఉన్న జనకపురం లోని గుండీచా ఘర్‌కు చేరుకోవడానికి ప్రారంభిస్తారు.రథాలు ప్రధాన ఆలయానికి చేరుకోగానే బంగారు అలంకరణలు చేసి, పానకం, ఇతర పదార్ధాలు, సాంప్రదాయ మట్టి పాత్రల్లో తెచ్చి, విగ్రహాల నోటికి అందిస్తారు. ఆపై తిరిగి జగన్నాధుడు సోదర సోదరీ సమేతంగా ప్రధాన ఆలయంలోకి చేరుకుంటాడు.ఈ పూరి జగన్నాధుని దర్శనం, వేనవేల అశ్వమేధ క్రతువులు చేస్తే లభించే పుణ్యంతో సమానం

- నాగలక్ష్మి