నేర్చుకుందాం

శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో పూర్వం మత అలజడులు వస్తే భారతీయ ఆధ్యాత్మిక సంపదను పరిరక్షించి పునఃప్రతిష్ఠం చేసిన మహిమాన్వితులు, భగవదాంశ సంభూతుడు, భారతీయ సమైక్యతా మూర్తి ఆదిశంకరులు. హిందూ మతంలో సమైక్యతను సాధించటానికి ముమ్మారులు భారతదేశం నలుదిశలా పాదయాత్ర చేసి, తన అమోఘ పాండీత ప్రకర్షతో శైవ, విష్ణు అభేద తత్వాన్ని ప్రబోధించి అద్వైత తత్వాన్ని పండితులకు పూర్ణావహగాహన చేసిన కారణజన్ముడు శ్రీ శంకరాచార్యులు.
అందుకే కాశ్మీరములో అన్ని మార్గముల పండితోత్తములను తమ వాదనాపటిమతో మెప్పించి ‘స్వర్వజ్ఞపీఠాధిరోహణము’ చేశారని శంకర విజయప్రతుల ద్వారా తెలియుచున్నది. అద్వైత సిద్ధాంత ప్రతిపాదనగా ‘ఏకశ్లోకి, దశశ్లోకి, శతశ్లోకి, ఉపదేశ సాహస్రి, సర్వసిద్ధాంత సార సంగ్రహము మొదలైన ఎన్నో ప్రకరణ గ్రంథాలను రచించారు. ఒక విధంగా శంకరుల సాహిత్యం చదివిన వారికి అనుభూతి, ఆత్మానందముతో పరవశులౌతారు. శంకరులు తమ విజయ యాత్రలో ముఖ్యంగా నాలుగు పీఠాలు స్థాపించారు. ద్వారక, కాశ్మీరము, పూరీ, శృంగేరి. కాని శంకరాచార్యులు తమ చివరి రోజులలో కంచిలో నివసించటంవలన అప్పటి శంకరమఠం తదాది శంకరాచార్య కంచిపీఠంగా జగద్విఖ్యాతమైంది. ‘్భజగోవింద శ్లోకాలు’ మానవ జీవిత విశే్లషణే. మానవ అవస్థలనంతటిని భజగోవిందం శ్లోకాలలో నిక్షిప్తం చేయటం ఒక అద్భుతమైన రచనతో వారిని భగవదంశగా భావించాలి. శంకరస్తోత్రాలు, అష్టకాలు, ఏది చదివినా, పాడినా, మండల దీక్ష చేసినా, నిత్య నైమిత్తికంగా చదివినా మనిషికి ఒక అనుభూతి, ఒక విధంగా అనిర్వచనీయమైన ఆనందం లభిస్తుంది. పూర్వపీఠాధిపతి, నడిచే దేవుడు, శ్రీచంద్రశేఖర సరస్వతి స్వామి వారి ద్వారా గత శతాబ్దం, ఈ శతాబ్దంలో కంచి కామకోటి పీఠఆనికి ఇతర శంకర పీఠాలతో సమానమైన శక్తిపీఠమయినది. మారుమూల ‘ఇరులోనికి’ గ్రామంలోని బాల శ్రీ జయేంద్రను చేరదీసి చంద్రశేఖరస్వామి, వారికి సకల శాస్త్రాలను నేర్పించి, బోధించి కంచి పీఠాధిపతిగా నియమించారు. జయేంద్ర సరస్వతి సమైక్యతా వాది. చంద్రశేఖర స్వామిజీతోపాటు జయేంద్ర సరస్వతీ స్వామివారు 3సార్లు దేశమంతటా పాదయాత్రలు చేశారు. అంతేగాక శ్రీ జయేంద్ర సరస్వతి మరొక మెట్టుగా మన భారతదేశం నలుమూలలా కాలి నడక, తన పరివారంతో చేసి, తన మృదువాక్కులతో భక్తులందరికి ఆత్మీయుడైనాడు. మానస సరోవరం లో పూజా నిర్వహణ చేసి ఆదిశంకరుల శిలను ప్రతిష్ఠించటం స్వామివారు ఒనర్చిన మరొక శ్లాఘనీయమైన విషయం. శంకర పీఠాధిపతులలో ఇతర దేశాలైన ఢాకా, బంగ్లాదేశ్ పర్యటించి, ఆధ్యాత్మిక భక్తి బోధన చేసిన మహా మనిషి శ్రీ జయేంద్ర సరస్వతి ఒక్కరే. దక్షిణేశ్వర కాళీమాత దేవాలయంలో ‘శంకరాచార్య గేటు’ నిర్మింపజేసింది శ్రీ జయేంద్ర సరస్వతియే. వివిధ ప్రదేశాలలో చతుర్మాస్య దీక్షలు నిర్వహించి, నిత్య పూజాదికాలు నిర్వహించి పీఠప్రశస్థిని నలు దిశలా చాటారు.
చంద్రశేఖరస్వామి వేద పాఠశాలల ద్వారా ప్రాచీన శాస్త్ధ్య్రాయనానికి నాందీ వాచకము పల్కితే, శ్రీ జయేంద్రసరస్వతిస్వామి మరొక మెట్టుగా ప్రజోపయోగ్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మానవ సేవ చేయాలని చెప్పటమే కాకుండా అందుకు ప్రణాళికలు రచించి వాటిని అమలు పరిచారు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు. యతీంద్రులు, ముముక్షువులు, పీఠాధిపతుల సందర్శన మానవ జీవితాన్ని వికాసవంతం చేస్తాయి. వారి అమృతవాక్కులు, మనం అమృతధారగా ఆస్వాదిస్తే మానవ జన్మ తరించినట్టే.
పీఠాధిపతులు తరచు పాదయాత్రలు చేయటం, బిక్ష స్వీకరించటం, చాతుర్మాస్య వ్రత నిర్వహణం మానవ కళ్యాణంకోసమే. తద్వారా తరించటం తమ వంతు ప్రజాసేవ చేయటమే ఇందలి పరమార్ధం. ఇదే భారతీయ సమైక్యతామూర్తి జయేంద్ర సరస్వతి స్వామిజీ ఆకాంక్ష.

-చివుకుల రామమోహన్