నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. సాంగంబు లగు చుండ సకల వేథంబులు సదివె వసిష్ఠుతో సకల ధర్మ
శాస్త్రాది బహువిధ శాఅస్తముల్ శుక్రబృహస్పతుల్ నేర్చిన యట్ల నేర్చెఁ
బరమాస్తవ్రిద్య నప్పురశురాముండెంత దక్షుఁడంతియ కడు దక్షుఁడయ్యె
నాత్మ విజ్ఞానంబునంద సనత్కుమారాదుల యట్టిడఁడ యనఘమూర్తి
ఆ. నొప్పుగొనుము వీని: నుర్వీశ’యని సుతు
నిచ్చి గంగ సనిన నెఱిఁగి తనయు
నెమ్మిఁ దోడుకొనుచు నిధి గన్నపేదయ
పోలెసంతసిల్లి భూవిభుండు
భావం: ‘ఓరాజా! ఇతడు వసిష్ఠుడి వేదాలను సాంగంగా చదివాడు. శుక్రుడు, బృహస్పతి నేర్చినట్లుగా సకల ధర్మశాస్త్రాలను, వివిధశాస్త్రాలను నేర్చాడు. అస్త్రాలన్నింటిని ప్రయోగించే నేర్పులో ఆ పరశురాముడు ఎంత సమర్థుడో అంతటి సమర్థుడైనాడు. ఆత్మజ్ఞానంలో సనత్కుమారాదుల వలె పుణ్యాత్ముడైనవాడు. నీకుమారుడిగా ఇతడిని స్వీకరించుము’ అని శంతనుడికి ఒప్పజెప్పి వెడిలిపోగా; శంతనుడు విషయమంతాతెలుసుకొని పెన్నిధిని పొందిన పేదవాని వలె కొడుకును చూచి ఉప్పొంగి తన వెంట తీసుకొని వెళ్లాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము