భక్తి కథలు

హరివంశం 225

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీ దగ్గర ఉంటేనేమి నా దగ్గర ఉంటేనేమి? నీవు నా వాడివి కదా! నా దగ్గర ఉన్నట్లే అనుకున్నాను. ఎందుకంటే నీవు సజ్జనుడివి. సాధు సత్ప్రవర్తనం కలవాడివి. అయితే ఈమధ్య ఒక సమస్య వచ్చింది నాకు. బలరాముడికి నా మీద అనుమానం. నా పట్ల అవిశ్వాసం. రత్నం నా దగ్గర లేదంటే ఆయన ఒప్పుకోక నాతో మాట్లాడటం లేదు. కాబట్టి నా మనస్సులో కొంత అశాంతి. కలత కలుగుతున్నది. కాబట్టి ఆ శ్యమంతకమణిని ఆయన చూసేట్లు నీవు నలుగురి ముందు ఇపుడు చూపాలి అని కోరాడు కృష్ణుడు.ప్రతిరోజూ యజ్ఞం ఎట్లా చేస్తున్నాడు అక్రూరుడు. ఇతడెంత ధనవంతుడో మీకు నాకూ తెలియదా? మన మెరుగని సంపదా? ఇతడిది. అని సమస్త యదువృష్ణి ప్రముఖులందరినీ సమావేశపరిచి అక్రూరుడితో ఏదో పని ఉండి పిలిపించినట్లు పిలిపించాడు కృష్ణుడు. అతడితో సరస సల్లాపంగా ఇష్టాగోష్టిగా ఆయనకు చాలా సంతోషం కలిగేట్లు మాట్లాడాడు కృష్ణుడు. ‘దానపతీ’ అని సంబోధించి ఉబ్బిపోయేట్లు చేశాడు. ఆ తరువాత అసలు విషయం బయటపెట్టాడు. ‘ఏమ య్యా! అక్రూరుడా! శతధన్వుడు నీ దగ్గర శ్యమంతకమణి దాచిపెట్టమని ఇచ్చాడు కదూ! నీవు గోప్యంగా దానితో పని గడుపుకుంటూ గొప్ప గొప్ప దాన ధర్మాలు, యజన యాజనాదులు నిర్వహిస్తున్నావు. పోనీ లోకానికి మేలు చేస్తున్నావు కదా! అని నేను పట్టించుకోలేదు. నీ దగ్గర ఉంటేనేమి నా దగ్గర ఉంటేనేమి? నా దగ్గర ఉన్నట్లే అనుకున్నాను. ఎందుకంటే నీవు సజ్జనుడివి. సాధు సత్ప్రవర్తనం కలవాడివి. అయితే ఈమధ్య ఒక సమస్య వచ్చింది నాకు. బలరాముడికి నా మీద అనుమానం. నా పట్ల అవిశ్వాసం. రత్నం నా దగ్గర లేదంటే ఆయన ఒప్పుకోక నాతో మాట్లాడటం లేదు. కాబట్టి నా మనస్సులో కొంత అశాంతి. కలత కలుగుతున్నది. కాబట్టి ఆ శ్యమంతకమణిని ఆయన చూసేట్లు నీవు నలుగురి ముందు ఇపుడు చూపాలి అని కోరాడు కృష్ణుడు.
అపుడు కమల దళాయతాక్షుడితో ఇట్లా చెప్పాడు అక్రూరుడు. ఎంతో వినయంతో ఇట్లా విన్నవించాడు. శతధన్వుడు నా చేతికీ మణిని నిచ్చి దాచమని చెప్పటం నిజమే . కాని దానిని తీసుకొని వచ్చి ఉత్త పుణ్యంగా నీకు సమర్పించటం ఎందుకని నేను అనుకున్నాను. నీవు ఎప్పుడో నన్ను అడగక మానవు. అడిగినప్పుడు నీకు భక్తిపూర్వకంగా దానిని ఇవ్వాలనే అనుకుంటూ వచ్చాను ఇన్నాళ్ళూ.

-ఇంకా ఉంది

-అక్కిరాజు రమాపతిరావు