భక్తి కథలు

హరివంశం - 23

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలం తీరినవాడు ఏం చేయగలడు! అమ్మా! నిన్ను చాలా దుఃఖపెట్టిన మాట కాదనను. నీవు పరమ పవిత్ర చరితవు. నీ చేతులు కాళ్ళూ పట్టుకొని బతిమాలుకుంటున్నాను అని దేవకి క్షమను అర్థించాడు కంసుడు. అపుడు దేవకి కూడా శోక గద్గద స్వరంతో ‘తండ్రీ! నాకిటువంటి దుఃఖం అనుభవించాలని రాసి పెట్టి ఉంది. నా బిడ్డలకు ఇటువంటి దుర్మరణం నిర్ణీతమై ఉంది. నీవేం చేయగలవు!’ అని పెద్ద మనసుతో కంసుడికి చెప్పింది. కంసుడు అప్పుడిక విచార మనస్కుడై తన భవనానికి వెళ్లాడు.
ఇక ఆ రాత్రి తెల్లవారుతుండగానే పట్టలేని సంతోషంతో వసుదేవుడు నందగోపుడి నివాసానికి వెళ్ళాడు. కొడుకు పుట్టినందుకు మురిసిపోతున్నాడు నందుడు. వసుదేవుడికి అత్యంత ఆప్తమిత్రుడు నందుడు. ‘అదృష్టమంటే నీదేనయ్యా! ఎంత అంతమైన వాడో చూడు నీ కొడుకు. ముద్దులు మూటగడుతున్నాడు.
ఆ తేజస్సు ఎక్కడైనా చూడగలమా? నీవు ధన్యుడివి సుమా! ఇక ఇక్కడ మీరు ఉండవద్దు. పిల్లాడిని తల్లిని వెంట బెట్టికొని వెంటనే మీ గోకులానికి మీరు వెళ్ళండి. అక్కడ వ్రేపల్లెలో నా కొడుకున్నాడు. వాణ్ణి కూడా నీ కొడుకే అనుకో. వాడు పెద్దవాడు, వీడు చిన్నవాడు. అంతే నాకు. వ్రేపల్లెలో మీకు చాలా అరిష్టాలు పొంచి ఉన్నాయి. అపాయాలు ఎదురుకావచ్చు. పిల్లలను ఎంతో జాగ్రత్తగా చూసుకో! నా కొడుకులను పుట్టిన వాళ్ళను పుట్టినట్లుగానే క్రూర కర్ముడు కంసుడు చంపివేశాడు. రోహిణి గర్భవాసాన పుట్టినవాడు మాత్రమే నాకు దక్కాడు. వాణ్ణి నీవెట్లానైనా కంటికి రెప్పలాగా కాపాడు. వాణ్ణి పెంచి పెద్ద జేసే భారం నీదే. దైవం నిన్ను చల్లగా చూస్తాడుగాక! వేనవేలుగా నీకు దీవెనలు. ఇంకొక సంగతి నీకు ముఖ్యంగా చెప్పాలి. కంసుడు పూతనను శిశువులెక్కడ ఉంటారో వాళ్ళను వెతకి వెతకి చంపవలసిందనిఆజ్ఞాపించాడు. ఆ పనిలో ఉన్నది ఆ రాక్షసి. నీవు ప్రాతఃకాలాననే ఈ విడిది విడిచిపెట్టి గోకులానికి పోవాలి. ఎండ రాకముందే ప్రయాణం కావాలి. ఉదయం కాబోతున్నది. చెట్లమీద పక్షులు కలకలం చేస్తున్నాయి. ప్రాగ్దిశ ఎర్రపడుతున్నది. కంసుడికి చెల్లించాల్సిన పన్ను చెల్లించే పని కూడా అయిపోయింది కదా! ఇక ఇక్కడ మసలవలసిన పని లేదు అని బోధించాడు వసుదేవుడు.
నందగోపుడికి కూడా అంగీకారమైంది. పురిటి పాపణ్ణి మెత్తని తొట్టెలో ఉంచుకొని తమ వెంట సేవకులు తీసుకొని వస్తుండగా తనూ, యశోదా చక్కటి బండి యెక్కి వ్రేపల్లెకు ప్రయాణమైపోయినారు. అట్లా ప్రయాణం చేసి వాళ్ళు కాళిందీ నదీ తీరం చేరారు. అపుడు కాళిందీ తీరమంతా కన్నుల పండువుగా వుంది.
చెట్లు తీగెలు తీరం నిండా సమృద్ధిగా పూలతో, పండ్లతో కలకలలాడుతున్నాయి. అక్కడ గోశాలలెన్నో ఉన్నాయి. చుట్టూ ముళ్ళకంచెలతో లోపల గోష్ఠాలున్నాయి. తడికలు, దడులు, పూరినేసిక పాకలు ఎన్నో నిర్మించి వరుసలుగా ఆ గోశాలలు ఉన్నాయి. తెలతెలవారుతుండగానే పచ్చి గడ్డి మేసి వచ్చి తెల్లని నురగలతో నెమరు వేసుకుంటూ విశ్రాంతిగా హాయిగా ఆవులు ఆ దొడ్లలో పడుకొని ఉన్నాయి. దూడలకు పాలు విడిచేవేళ అది. ఆ దూడలను పశుపాలురు పేరు పేరునా పిలుస్తూ ఉండగా అవి చెంగనాలతో దుముకుతూ అంబారవాలు చేస్తూ ఒక దూడను ఒకటి అల్లిబిల్లిగా తప్పించుకుంటూ సంతోష వదనలైన తల్లుల పొదుగులను చేరుతున్నాయి. తల్లల అరపులకు దూడలు ప్రతి నినాదాలు చేస్తూ పరుగులు తీస్తున్నాయి. ఆ బుజ్జి దూడల ఉల్లాసం నయనోత్సవంగా ఉంది.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు