మంచి మాట

విచక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్ని జ్ఞానాల లాగానే విచక్షణను కలిగి ఉండటం కూడా గొప్ప జ్ఞానంగానే చెప్పవచ్చు. మంచి చెడుల విశే్లషణలో ఏది మంచి, ఏది చెడు అనే జ్ఞానాన్ని సక్రమమైన విధానంలో కలిగి వుండటమే విచక్షణ.
కొన్ని పరిస్థితులలో మనం ఒకటి మంచి పని అని తెలిసి, ఆ పనిని ప్రయత్న పూర్వకంగా చేస్తాం. కొన్నిసార్లు అప్రయత్నంగా ఏది మంచో, ఏది చెడో తెలియకుండానే చేస్తాం. ఏది ఏమైనా ప్రతి పనీ దాని ప్రతిఫలాన్ని మనకు తప్పక ఇస్తుంది.
అది మధురంగా తియ్యగా ఉండవచ్చు. మనసుకు బాధ కలిగించే విధంగా చేదుగా ఉండవచ్చు. చెడ్డ పనులవల్ల కలిగే ఫలితాలలో మానసిక క్షోభ అన్నిటికన్నా ఎక్కువగా ఉంటుంది. మంచేదో, చెడేదో తెలియవన్నంత మాత్రాన ఆ కార్య కారణాల ఫలితాలు రాక తప్పవు.
వీటన్నిటికన్నా ముందు ఏ విషయంలోనైనా కొంత ఆలోచన ముఖ్యం. మంచి-చెడు, సన్మార్గం-దుర్మార్గం, సత్యం-అసత్యం.. వీటిమధ్య విచక్షణ చేస్తూ మెలగడం ఎలాగో తెలుసుకోవాలి. మనస్సు ప్రశాంతత పొందడానికి, సంతోషం పొందడానికి, ఆధ్యాత్మిక భావాలవైపు నిరంతరం పయనించడానికి ‘విచక్షణాజ్ఞానం’ తప్పనిసరి. ఈ జ్ఞానం బాగా అలవాటయినపుడు అప్రయత్నంగా ‘ఇది మంచి పనేనా?’ అని మనల్ని మనం ప్రశ్నించుకుంటాం. తొందరపడి, తెలివి తక్కువగా చేసే తప్పుడు పనుల నుంచి, వాటివల్ల కలిగే మానసిక క్షోభ నుంచి ఈ విచక్షణాజ్ఞానం మనల్ని రక్షిస్తుంది. అయితే మన విచక్షణ ఏ పనిని మంచిదని చెబుతుందో దాన్ని కచ్చితం చెయ్యడాన్ని అలవాటు చేసుకున్నపుడు మాత్రమే అది మనల్ని రక్షించడం సాధ్యపడుతుంది. ఈ విచక్షణకు ఆత్మపరిశీలన చేదోడు వాదోడుగా పనిచేస్తుంది.
శ్రీమద్భాగవతంలో చెప్పినట్లుగా ‘‘ఓ దేవా! మనస్సు ప్రాపంచిక విషయాలను, వస్తువులను పట్టుకుని వ్రేలాడుతోంది. అవి మనస్సును శక్తివంతంగా ఆకర్షిస్తున్నాయి. వాటిని అధిగమించి, జ్ఞానోదయాన్ని పొందాలనుకునే మనిషి వాటి చర్య, ప్రతిచర్యలను ఎలా అధిగమించగలడు?’’- ఈ ప్రార్థనలో వున్న ప్రశ్నకు ఉత్తమమైన సమాధానం ఈనాటికి కూడా పరిష్కరింపబడనే లేదు. ఈ విశ్వం యొక్క ప్రణాళిక మారనంతకాలం ఆ ప్రశ్న కూడా అలాగే ఉంటుందేమో!
కొంతలో కొంత విజ్ఞులు ఈ ప్రశ్నకు సమాధానాన్ని వెదకకుండా ఉండలేదు. మేధావులు, లోకకళ్యాణం కోరేవారు వారి పని వారు చేసుకుపోతూనే ఉంటారు.
మనస్సు విషయ వస్తువులను గ్రహించే ప్రతినిధిగానూ, అనుభవించే భోగిగానూ వాటిని అంటి పెట్టుకునే ఉంటుంది. దానినే మనం బుద్ధి, అహంకారం లాంటి వేర్వేరు పేర్లతో వ్యవహరిస్తుంటాము. మనస్సే గనుక జీవుడి యొక్క నిజ స్వభావమైతే జీవుడికీ, విషయ వస్తువులకు మధ్యనున్న సంబంధాన్ని విడగొట్టడం సాధ్యపడదు.
కానీ జీవాత్మ ఆది అంతాలు లేకుండా ఎల్లప్పుడూ బ్రహ్మంతో ఏకమై ఉన్నాడు. మనస్సును కప్పుతూ తొడగబడి వున్న ముసుగువల్ల జీవాత్మ విషయ వస్తువులతో ఆకర్షణను, అనుబంధాన్ని కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది.
కాబట్టి మనిషి తానే పరబ్రహ్మమని భావిస్తూ ప్రాపంచిక వస్తువులపట్ల, ఆకర్షణలపట్ల వ్యామోహాన్ని విడిచిపెట్టి, ప్రాపంచిక ఆకర్షణలు నిజం కాదని నిరంతరం భావించడం ద్వారా వాటినుంచి తమ దృష్టిని మరల్చుకొని భగవంతుడిని ఆరాధించాలి. ఈ విధమైన విచక్షణాజ్ఞానాన్ని కలిగి ఉండగలగడమే మనిషి జన్మ సార్థకం చేసుకునేందుకు మార్గం సుగమమం అవుతుంది.
........................................

మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి.
మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి.
ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

-పి.వి.రమణకుమార్