నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మ. ఇనతేజుం డతిభక్తిఁ గాంచన రథం బెక్కించి యక్కన్యఁదో
డ్కొని తెచ్చెం దన తల్లి సత్యవతినిన్ క్షోణిజుల్ దన్ను బఓ
రనఁ గీర్తింపఁగ శంతనుం డతి మనోరాగంబునం బొంద శాం
తన వుండాతతకీర్తి హస్తి పురికిం దత్కౌతుకారంభుఁడై
భావం: గంగ సుతుడైన దేవవ్రతుడు బ్రహ్మచర్యవ్రతాచరణుడవగా దేవతలు ఋషులు మెచ్చుకున్నారు. గంగాసుతుణ్ణి భీష్ముడని ప్రశంశించారు. సూర్యుడి వలె ప్రకాశించే భీష్ముడు ఆ కన్యకను, తనకు తల్లి అయిన దానిని, సత్యవతిని భూప్రజలందరూ తనను తేపతేపకు జయజయ ధ్వానాలతో కీర్తిస్తూ ఉండగా, శంతనుడు మనసులోని మమకారాన్ని భావించి తన్మయత్వాన్ని పొందుతూ ఉండగా విశాలకీర్తిని గడించిన శంతనుడి పుత్రుడు హస్తినాపురికి ఆమెకు వేడుకను కలిగించే వాడై తన వెంట తీసికుని వచ్చాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము