నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. వసు నిభుఁడు పైతృకం బగు
వసుధా రాజ్యంబు భీష్మువచనమున గత
వ్యసనుఁడయి తాల్చె ఁ దేజం
బెనగంగ విచిత్ర వీర్యుఁ డిద్ధయశుండై
భావం: వసురాజు వంటి వాడైన విచిత్ర వీర్యుఁడు భీష్ముడి ఆజ్ఞ చొప్పున భయరహితుడై నిజ పరాక్రమం నిండారగా నిర్మల కీర్తితో భూపాలనాన్ని చేపట్టాడు.
క. నాయనుజుకు వివాహము
సేయఁగఁ గన్యాత్రయంబుఁ జేకొని బలిమిం
బోయెద నడ్డంబగు వా
రాయత భుజశక్తి నడ్డమగుఁ డాజిమొనన్
భావం: ఈ కన్యలు ముగ్గురినీ నా తమ్ముడికిచ్చి పెండ్లి చేయడానికై బలంతో బలవంతంగా తీసికొని పోతాను. అడ్డుతగిలేవారు అపార భుజ బలంతో యుద్ధ వ్యూహంతో అడ్డగించండి.. అని భీష్ముడు అన్నాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము