భక్తి కథలు

కాశీఖండం 24

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఆ మచ్చిక, ఆ చనవు, ఆ అనురాగతిశయమున్ను వివరించి చెప్పవశము కాదు. భూవలయ తిలకుడు అయిన ఓ కాశీక్షేత్రమా! నిన్ను విడిచి పరభూమికి ఏ విధంగా పోగల్గుతాను? ఊర్థ్వ బాహుడిని అయి ముమ్మాటికీ నిక్కమే వక్కాణిస్తాను. నా సత్యవాక్కుకి వేదవాణి, జాహ్నవీనది, పరమశివుడు, డుంఠి విఘ్నేశ్వరుడు, పరమ సాక్షులు. ఓ పరమ శివుడి కూర్మి పట్టణమూ, ఓ వారణాసీ! ఓ కల్యాణీ! నీ వంటి నగరాలు కానీ తీర్థ రాజాలు కానీ ఈ బ్రహ్మాండంలో ఎందునా కానరావు. వినరావు.
భూలోక భువర్లోక స్వర్లోకాల మూడింటిలోనూ అవిముక్తలింగానికి- అంటే శ్రీ విశే్వశ్వర లింగానికి- సాటివచ్చే లింగాలు లేవు. ఈ భువనత్రయంలోను నీకు సాటి చేసి చెప్పడానికి అన్య పుణ్యతీర్థాలు లేవు అని పలికి ఎట్టకేలకి అడుగు ముందుకి వేసి విరహంపొందిన విధంగా మరులు కుడిచిన రీతిగా (పిచ్చి ఎత్తించే పదార్థాలు తిన్నట్లుగా) అపస్మారకం సోకిన గతి, మత్తెక్కిన చందంగా, దప్పికకొన్న కరణి వెలవెలపోయిన భంగి, మ్రాగన్ను పెట్టిన క్రియ, లాహిరి పట్టిన లీల (కలంజం లేక గంజాయి నమిలినట్లు), మత్తెక్కిన లాగు, ఉంగిడి వ్యాధి వచ్చిన తీరున ఊసరిల్లుతూ, ఉస్సురంటూ దుఃఖిస్తూ పరితపిస్తూ, ఉపతాపం పొందుతూ ఊటాడుతూ లేక చలించిపోతూ ఊర్వశీనందనుడైన ఆ అగస్త్య మహర్షి చేతులు రెండూ పైకెత్తి ఉచ్చైస్స్వరంతో ‘‘ఓ పరమ కల్యాణీ! ఓ గంగాతరంగిణీ! కడలిపత్నీ! నేను వెళ్లివస్తాను. ఓ దేవతాధిపతులారా! ఓ లోలార్క ఆదికేశవులారా! ఓ బ్రహ్మదేవా! పోయివస్తానయ్యా! దయాపూర్ణ కటాక్షాలు కల ఓ విశాలాక్షీదేవి! ఇంద్రపూజితా! వెడలి వస్తాను- శ్రీపూర్ణ భద్రాది ప్రమథనాయకులారా! వటుకభైరవుడా! నేను పోయి వస్తాను. కాశీతీర్థవాసులారా! ధన్యులారా! పాశుపత శైవ వ్రతస్థులారా! భాగ్య సంపదలు కల భక్తులారా! మందిరోద్యానములారా! మఠములారా! మీ కాశీక్షేత్రాన్ని వదలిపెట్టి పోయి వస్తాను సుమా!
‘ఓ కలహంసీ! నాతో కలిసి కాశీ నుంచి రారాదా? నువ్వు నెమ్మదితో ఇక్కడ వున్నావు. నాతో ఎందుకు వస్తావు?
ఓ కదళీవనమా! నన్ను కూడి రావలసింది. నువు భాగ్యవంతురాలివి, ఏల నాతో వస్తావు? ఓ కాశీవిశాలాక్షీ! నాతో కలిసి విచ్చేయవలసింది. నువ్వు ప్రీతితో కాశీలో వుండి ఏ విధంగా నాతో వస్తావు? ఓ అంతర్గేహమా! నాతో కూడా ఏతెంచవలసింది. నువ్వు ఎందుకు వస్తావు? ఓ పరివ్రాజకులారా! నా వెంట ఏతెంచవలసింది. కాశీపై వాత్సల్యం కలిగి, పరమ నిర్భాగ్యుడిని అయిన నా వెంట- సౌఖ్యారాశి కాశిని వీడి కటకటా ఎందుకు వస్తారు? అని విచారించి, చివరికి ఏదో విధంగా కాశీ నగరం నుంచి వెలువడి కొంతదూరం నడచి వచ్చి, కాశీ నగరం విరహ వేదనతో బాధపడుతూ నోరు వట్టిపోయి అంటే తడి ఆరిపోయి పాదాలు కదలక మెదలక కట్టుపడి పోగా ఉద్వా అంటూ ఒక వటవృక్షం నీడలో ఆ అగస్తి మహాముని చిదికిలబడిపోయి తన భార్య లోపామద్రతో ఈ గతి పలికాడు. ఉశీనర రాజకుమారీ! నువ్వు బుద్ధిమంతురాలివి. ఏ కారణంవల్ల కాశీ వెలువడి రావలసి వచ్చిందో చెప్పకూడదా? నరులకి నిష్కారణంగా సులభంగా సుఖమూ దుఃఖమూ ఎలా కల్గుతాయి? కాశ్మీర దేశంలోనే కుంకుమ పుట్టుతుందన్నది దేశాపేక్ష దేశాధీనం అయినదన్నమాట- పగటివేళలోనే పద్మాలు విచ్చుకోవడం, రాత్రి సమయాల్లోనే కలువలు వికసించడం అనేది కాలాపేక్ష- అంటే కాలాధీనం అయినది అని అర్థం. పుణ్యాత్ముడికి సుఖమూ, పాపాత్ముడికి దుఃఖమూ కలుగుతాయి అనేది అదృష్టాపేక్ష లేక అదృష్ట్ధానం అయినదన్నమాట. సమస్తమూ దైవాయత్తం అనేది ఈశ్వరీ పేక్ష.

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి