భక్తి కథలు

హరివంశం - 25

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ పనిలో తన అనుచర గణంతో సహా ఆల మందల పల్లెలో పూతన అనే్వషిస్తూనే వున్నది. చీకటి పడగానే ఇల్లిల్లు తిరుగుతూ పురిటి శిశువులు ఎక్కడ ఉన్నారా అని గవేషిస్తూ ఉంటుంది పూతన. ఇట్లా వ్రేపల్లె రాగానే నందుడి ఇంటి ఆవరణలో యశోద పక్కనే వెల్లకిలా తల్లిని ఒత్తుకుని పడుకుని ఉన్న నందుడి ముద్దుల పట్టిని చూసింది. చడీ చప్పుడు లేకుండా కాసేపు ఆ శిశువును పరిశీలనలగా చూసింది. ఆ బుడతడి సౌందర్యం చూసి వారికి సమ్మోహం కలిగించేట్లు ఉంది.
కాసేపు చూపు ఆపుకోలేకపోయింది పూతన. ‘ఇకనేం నాకు అంతా తెలిసిపోయింది’ అనుకుంది. వీడే కంసుణ్ణి పరిమార్చేవాడు, ఇందులో ఏమీ సందేహ లేదు అని గట్టిగా నిశ్చయించుకుంది. వీణ్ణి గోటితో తునిమిపారేస్తాను చిటికెలో అనుకుంది. ఇట్లా అనుకోగానే ఆ రాక్షసి ఆపాదమస్తకం ఆగ్రహ జ్వాలలు ఎగసాయి. పండ్లు పటపట కొరికింది. ‘హుం వీడే నా!’ అని గొణుక్కుంది. మిడిగుడ్లు కణకణలాడే నిప్పులుగా చేసుకుంది. ఆ రాక్షసి కణతలు అదిరిపోతున్నాయి. బొమలు ముడివడ్డాయి. శరీరం చెమట పట్టింది. పండ్లు పటపట లాడించడంవల్ల నిప్పుల రాజుకొని సెగలు వెలువడినట్లుగా దానికి నిట్టూర్పులు వెలువడ్డాయి.
ఆపుకోలేని కోపం కలిగింది. చేతులు వణికాయి. భయం మూర్త్భీవించినట్లైంది ఆ రాక్షసి ఆకృతి. నిగ్రహించుకొని ఆ శిశువును ఎత్తుకొని కొంచెం ఆవలకు తీసుకొని పోయి వెంటనే రొమ్ము కుదుముకున్నది. ఆకలితో నకనకలాడిపోతున్నట్లు పాలు తాగటానికి తక్షణం ఉద్యుక్తుడైనాడా శిశువు. కావు కావుమని ఏడుస్తూ పాలకోసమే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నట్లు పూతన దగ్గర పాలు తాగాడు. ఆ పాలతో పాటు ఆ రాక్షసి సప్త్ధాతువులతో కూడిన ప్రాణాలను కూడా మింగివేశాడు. భరించలేని తిక్క పుట్టినట్లే ఆ రాక్షసి అక్కడకక్కడే అప్పటికప్పుడే నేల కూలింది. ప్రాణం వదులుతూ అది చేసిన ఆర్తనాదంవల్ల మందలోని జనమంతా ఉలిక్కిపడి లేచారు. పిల్లవాడి ఏడ్పు విని గుండెలదిరిపోయే భయసంభ్రమంతో యశోద ఒక్క ఉదుటున లేచి తన పక్కనే పడుకుని ఉన్న శిశువు లేకపోవటం గమనించింది. నందగోపుణ్ణి ఎలుగెత్తి కేకలు వేసి పిలిచింది.
ఆయన కూడా అంతకుముందే అదురుపాటుతో లేచి వడివడిగా ఆ చోటుకు చేరుకున్నాడు. నందగోపుడు ఆర్తుడై పరుగులు తీయటం చూసిన వ్రేపల్లెలో ఉన్న వారంతా అక్కడకు చేరారు. అక్కడ చచ్చిపడి వున్న ఆ రాక్షసిని చూసేప్పటికి వాళ్ళకు భయమూ, ఆశ్చర్యమూ, తొట్రుపాటు కలిగాయి. పూతన కళ్ళు వికృతంగా కనుగుడ్లు తిరిగిపోయి కనపడ్డాయి. కాళ్ళు చేతులు విరిచేసినట్లు భూమి మీద పడి ఉన్నాయి. దాని శరీరమంతా పగుళ్ళు పారిపోయి కన్పించింది. ఎముకలు పిండి పిండి అయిన చందాన అది పడి వుంది. ఒక పెద్ద చర్మపు గుట్టలా పడి వున్న దాని పొట్టమీద బాలసూర్య సమాన తేజస్కుడైన కృష్ణుణ్ణి అందరూ చూశారు.
‘అమ్మో అమ్మో! అయ్యో అయ్యో! నా బంగారుకొండ, నా గారాలపట్టి, నేను చచ్చిపోయినానురా! నా బతుకు బండలు కాను అని యశోద పెద్ద పెట్టున రోదించింది. నందుడు కూడా సర్వాంగాలు భీతిల్లి గజ గజ వణికిపోతూ కృష్ణుణ్ణి సమీపించాడు. యశోద ముందుకురికి బుడతణ్ణి ఎత్తుకొని గుండెలకు గట్టిగా హత్తుకుంది. నందుడప్పుడు భయ విస్మయాకులుడై ‘ఏమిటిది! ఈ రాక్షసి ఎక్కడనుంచి వచ్చింది? అది వచ్చి పిల్లవాణ్ణి తీసుకొనిపోతున్నపుడైనా నీకు మెలుకువ రాలేదా! అయ్యయ్యో! ఎంత గండం గడిచింది.

- ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు