నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శా వేణిం జొల్లెము వెట్టి సంఘటిత నీవీ బంధయై భూషణ
శ్రేణిం దాల్చి మఖేందు మండల మరీచీజాలముల్ పర్వగా
బాణిం బయ్యెద జక్కగా దుఱిమి శుంభద్వీర సంరంభయై
యేణీలోచన లేచి నిల్చె దన ప్రాణేశాగ్ర భాగంబునన్

భావము: సాత్రాజితి (సత్యభామ) వడివడిగా వాలుజడ ముడివేసుకున్నది. చీరముడి బిగించింది. భూషణాలను సరిచేసుకున్నది. పైట సవరించుకున్నది. ముఖచంద్రుడు కాంతులీను చుక్కగా తన కాంతుడైన మురాంతకుని చెంత నిబ్బరంగా లేడి కన్నుల వంటి కన్నులు కల సత్యభామ నిలిచింది.

బమ్మెరపోతన రచించిన శ్రీమదాంధ్ర మహాభాగవతంలోని పద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ

బమ్మెరపోతన రచించిన శ్రీమదాంధ్ర మహాభాగవతంలోని పద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ