నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కం: లేమా! దనుజుల గెలువగ
లేమా! నీవేల కడగి లేచితివిటురా
లేమాను మానవేనిన్
లే మావిల్లందికొనులు లీలం గేలన్
భావము: భామా! రాక్షసులను గెలువలేమా? నీవెందుకు యుద్ధానికి సిద్ధపడ్డావు? ఇలారా! యుద్ధ ప్రయత్నము మాను, మానదలచుకోకపోతే విలాసంగా ఇదుగో ఈ విల్లు అందుకో.

కం: హరిణాక్షికి హరి యిచ్చెను
సురనిక లోల్లాసనమును శూర కఠోరా
సుర సైన్య త్రాసమును
బలగర్వ నిరాసనమును బాణాసనమున్
భావము:ఈ విధంగా శ్రీకృష్ణుడు దేవతలకు సంతోషాన్నీ, రాక్షసులకు సంతాపాన్నీ కలిగించుతూ శత్రువుల గర్వాన్ని అణచివేసే ధనుస్సును సత్యభామ చేతికి ఇచ్చాడు.

బమ్మెరపోతన రచించిన శ్రీమదాంధ్ర మహాభాగవతంలోని పద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ

బమ్మెరపోతన రచించిన శ్రీమదాంధ్ర మహాభాగవతంలోని పద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ