నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కం నరకా! ఖండించెద మ
త్కర కాండాసన విముక్త ఘన శరముల భీ
కర కాయు నిన్ను సుర కి
న్నర కాంతలు సూచి నేడు నందం బొందన్

భావము:నరకాసురా! తొందరపడకు. నా చేతిలోని ధనుస్సు నుండి వెలువడే బాణ పరంపరతో భయంకర స్వరూపుడవైన నిన్ను చీల్చి చెండాడుతాను. ఇది చూచి ఈనాడు దేవకాంతలు ఎంతో సంతోషిస్తారు.
మ సమదే భేంద్రము నెక్కి భూమిసుతుడా చక్రాయుధున్ వైవ శూ
లను చేబట్టిన నంతలోన రుచిమాలాభిన్న ఘోరాసురో
త్తమ చక్రంబగు చేతి చక్రమున దైత్య ధ్వంసి ఖండించె ర
త్న మయోగ్రదగ్ర వినూత్న కుండల సమేతంబైన తమ్మార్థమున్
భావము:నరకాసురుడు మదగజానెక్కి చక్రాయుధునిపై ప్రయోగించడానికి శూలాన్ని పట్టిపైకెత్తేలోపుగానే శ్రీకృష్ణుడు ఎందరో రాక్షస వీరులను ఖండించిన తన చక్రాయుధాన్ని వానిమీద ప్రయోగించాడు. ఆ చక్రం రత్నాలు పొదిగిన కుండలాలతో కూడిన నరకుని శిరస్సును తెగవేసింది.
బమ్మెరపోతన రచించిన శ్రీమదాంధ్ర మహాభాగవతంలోని పద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ

బమ్మెరపోతన రచించిన శ్రీమదాంధ్ర మహాభాగవతంలోని పద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ