నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మ తమ తేజంబు తృణీకరించుచు సముద్యత్తేజులై మీది లో
కములందున్ జరియించు నీ యచల భక్తశ్రేణులం జూచి, నె
య్యమునం దాటను దద్విధంబునను, నిన్నర్చింప నూహించి మ
ర్త్యమునం బుట్టగ వాంఛ సేయుదు రమర్త్యశ్రేణి సర్వేశ్వరా!

భావము: సర్వేశ్వరా! తమ తేజాన్ని తక్కువ జేస్తూ పైలోకాలలో సంచరిస్తున్న ఈ నిశ్చల భక్తుల గొప్ప తేజస్సును చూసి స్నేహంతో తామున్నూ వారిలాగే నీకు పూజలు చేయాలని అందుకుగాను భూలోకంలో పుట్టాలని తీవ్రంగా కోరుకుంటారు. దేవతలు నిజభక్తులను చూచి వారిపై ఉన్న భగవంతుని వాత్సల్యాన్ని చూచి వారికి ఉన్న గొప్ప తేజస్సు ముందు తమ దివ్యతేజస్సు వృథా అని తలుస్తారు. దానివల్లనే ఆ సర్వేశ్వరుని పూజించడానికి తాముకూడా మానవులుగా పుట్టాలని యోచిస్తారని కవి భావన.

యధావాక్కుల అన్నమయ్య రచించిన సర్వేశ్వర శతకము పద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ

యధావాక్కుల అన్నమయ్య రచించిన సర్వేశ్వర శతకము పద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ