మంచి మాట

సహనమే విజయానికి రాచబాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహనంతో విజయానికి రాచబాటాలు వేసుకోవచ్చు. ఈ గుణం లేని వ్యక్తికి జీవితంలో ఒడిదొడుకులు తప్పవు. సహనం ఉన్న వ్యక్తికి తాత్కాలికంగా నిరాశ కలిగినా శాశ్వతంగా విజయం సిద్ధిస్తుంది అనడంలో అతిశయం లేదు. అననూల పరిస్థితుల్లో సహనం వహిస్తే కాలం మారుతుంది. ప్రతికూల పరిస్థితులు సానుకూలం అవుతాయ. పట్టుదలతో, సహనంతో ప్రయత్నిస్తే ఏ కార్యాన్నయినా సాధించవచ్చుననేది పెద్దల మాట.
తామసగుణులైన దానవులతో స్నేహం చేసి అననుకూల పరిస్థితులను సానుకూలం చేసుకోవడానికి దేవతలతో ఎంతో కృషిచేశారు. వారితో కలసి దేవతలు అమృతం కోసం క్షీర సాగరాన్ని మథించారు. మరింత భీతికొల్పేట్టు హలాహలం పుట్టింది. అయినాపరిస్థితులను చూచి చలించకుండా దైవం మీద భారం వేసి మళ్లీ ప్రయత్నాన్ని సాగించారు. చాలాకాలం తరువాత క్షీరసాగరం నుంచి అమృతాన్ని, కామధేనువును, కల్పవృక్షం వారికి లభ్యమైంది. అట్లానే మానవులు కూడా సంసారంలో ఏర్పడ్డే చిక్కులను ఎదుర్కొని భగవంతుని పైన గట్టినమ్మకంతో మానవ ప్రయత్నం చేస్తూ ఉంటే భగవంతుడు కరుణిస్తాడు. పరిస్థితులు సహకరిస్తాయ. అనుకొన్నది సాధిస్తారు. చిక్కులు వాటికవే విడవడిపోతాయ. ఓర్పు, సహనాలకు ప్రతీక సాలెపురుగు. ఇంట్లో ఏదో ఓ మూల తననుంచి వెలువడే ద్రవంతోనే అది గూడుకట్టుకుంటుంది. పోగు తరువాత పోగు గొప్ప ఏకాగ్రతతో ఓ శిల్పి చెక్కినట్టు మహా నైపుణ్యంతో నిర్మించుకుంటుంది. కాని ఇల్లు శుభ్రపరిచేటపుడు సాలీడు గూడును మనుష్యులు తీసివేస్తారు. లేకుంటే విపరీతమైన గాలి వస్తే అది పోతుంది. కాని సాలీడు దీన్ని లెక్కచేయకుండా మళ్లీ గూడు అల్లుకుంటూ ఉంటుంది. కనుక మనం కూడా అనుకొన్నది సాధించ లేకపోయామనే నిస్పృహతో ఉండిపోకుండా తిరిగి అనుకొన్నది సాధించడానికి ప్రయత్నించాలి. ప్రయత్నం మానవ లక్షణంగా కావాలి.
ఎవరి జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ఎవరి బతుకుల్లో వారికి ఏదో ఒక ఆపద వాటిల్లుతూనే ఉంటుంది. సహనానికి రామాయణంలోమారుతిని ఆదర్శంగా తీసుకోవచ్చు. మారుతి ఎన్ని సార్లు ఎంత వెదికినా సీతమ్మ కనిపించకపోయనా ఆత్మహత్య చేసుకోవాల్సిందే అన్న నిర్ణయం వచ్చినా తిరిగి సహనంతో భగవంతునిపైన నమ్మకంతో ఉన్నాడు కనుకనే సీతమ్మ జాడ తెలుసుకున్నాడు. రామయ్య చెప్పాడు. వారిద్దరికీ సంతోషాన్ని కలిగించాడు..వానరుల సాహసాన్ని అందరికీ తెలియచెప్పాడు. అట్లా ఆ మారుతిని స్మరించి సాధించలేని ఏకార్యమైనా సాధించవచ్చు. విభీషణుడు కూడా అన్నకు ఎన్నో సార్లు మంచి మాటలు చెప్పి చివరకు వినలేదని రాముని దగ్గరకు వచ్చాడు. రాముని మీద భారంవేసి తన్ను మీలో ఒకడిని చేసుకోమని విన్నవించుకున్నాడు. అపుడు వానరుల్లో చాలామంది విభీషణుణ్ణి నమ్మకపోయనా అందరినీ ఓపికతో నమ్మించి రాముని నిర్ణయాన్ని మంచిమార్గంలో ఉంది అని నిరూపించాడు. ఆపదలు వచ్చాయని ఆటంకాలు కలుగుతున్నాయని వెనుకంజ వేయకుండా అనుకున్నదాన్ని సహనంతో సాధించాలి.
పాండవులు ఎన్నో సార్లు దుష్ట దుర్యోధనుని వల్ల కష్టాలను ఎదుర్కొన్నారు. కాని కృష్ణుని మీద భారం వేశారు కనుకనే వారిని చివరకు విజయం లభించింది. లోకమంతా పాండవులను మెచ్చుకున్నారు. కాని దుర్యోధనుని మెచ్చుకోలేదు. పాడు పనులు చేసేవారిని వారంటే ఉన్న భయం వల్ల వారికి ఎదురు చెప్పరేమో కాని విజయం మాత్రం దుష్టులకు సిద్ధించదు. దురన్యాయం చేసేవారికి దుర్మార్గులకు తాత్కాలిక విజయాలు చూచి వారి పొంగిపోతారు కాని అంతిమ విజయం సహనం ఉన్నవారికి సజ్జనులకు మాత్రమే సిద్ధిస్తుంది. కనుక అందరూసహనవంతులు కావాలి. వివేకానంద స్వామి శిరిడీసాయబాబ లాంటివారెందరో సహనం ఉండాలని ఎన్నోమార్లు చెప్పారు. వారు చెప్పినట్లు నడుచుకుంటే జీవితంలో విజయాన్ని పొందవచ్చు.

- హనుమాయమ్మ