నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శా ఱాలన్ ఱువ్వగ జేతులాడవు కుమారా రమ్ము రమ్మంచు నే
జలన్ జంపగ నేత్రముల్ దివియగ శక్తుండ నేగాను నా
శీలంబేయని చెప్పనున్నదిక నీ చిత్తంబు నా భాగ్యమో
శ్రీ లక్ష్మీపతి సేవితాంఘ్రి యుగళా శ్రీకాళహస్తీశ్వరా!
భావము:శ్రీమహావిష్ణువు చేత సమర్పించబడిన పాదములు కలవాడా! శ్రీకాళహస్తీశ్వరా! నీమెప్పు పడయుటకై నిన్ను రాళ్ళతో కొట్టలేను. నీ కొఱకు ప్రేమ పాత్రుడైన కుమారుని చంపలేను, నా కన్నులు పీకి నీ పరీక్షకు నిలువలేను, నేనెంతటి అశక్తుడనో నీకేమని చెప్పను? నా అదృష్టము నీ అనుగ్రహము మీద ఆధారపడి వున్నది. సాంఖ్య తొండడు పొలం పని చేస్తూ ఉంటే అతనికి సాయపడాలని పరమాత్మనే వచ్చాడు. కాని తొండడు ఆయనపై రాళ్ళను రువ్వడం, సిరియాలుడు శివుని కోరిక తీర్చడం కోసం కుమారుణ్ణి చంపడం, కన్నప్ప శివుని కనుల నీరు చూచి చలంచిపోయ అతని కళ్లకు మారుగా తన కళ్లను అర్పించడం మొదలైన విషయాలను చెబుతూ శివభక్తులు ఎంతటి గొప్పవారో అని అనే కవి భగవంతుని కీర్తన కన్నా భాగవతత్తోముల కీర్తన గొప్పదన్న విషయాన్ని తేటతెల్లము చేస్తున్నారు.

యధావాక్కుల అన్నమయ్య రచించిన సర్వేశ్వర శతకము పద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ