భక్తి కథలు

కాశీఖండం 70

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారింపనలవికాని ఔదార్యంతో సర్వలోక హర్షకారకుడు, దాన గుణపరుడున్ను, పరాక్రమంతుడున్ను అయిన చుక్కలరేడు కాశీ మహానగరంలో అధ్వర సమాపన సమయంలో ఫాలాక్షుడి సమక్షంలో సదస్సులకి అలవోకగా ముల్లోకాలు దక్షిణగా ఒసగాడు.
తాను త్రవ్వించిన చంద్ర కుండం ప్రక్కనే తాను ప్రతిష్టచేసిన చంద్రేశ్వర లింగం దగ్గర కాశీ అంతర్భాగం అయిన అవిముక్త కంఠసీమలో చంద్రుడు రాజసూయాధ్వరం చేశాడు. ఈ క్రియ రాజసూయయాగం ఒనర్చిన అమృతకిరణుడు యజ్ఞదీక్షాంత సమయాన చేసిన స్నానం తర్వాత-
ఈ విరిసిన చంద్రికా విలాపాలు సమస్త లోక ఆహ్లాదకారణలై ప్రసిద్ధి చెందుతాయి. పూర్ణిమాతిథినాడు నువ్వు నా అష్టమూర్తులలో ఒకడివై ప్రవర్తిస్తావు. కాశీక్షేత్రంలో చంద్రేశ్వరుడు అనే నన్ను నువ్వు లింగరూపంగా ప్రతిష్ఠ చేశావు. బ్రహ్మ ఒసగిన రథం ఆరోహించి అష్టాదశ ద్వీపాలలోను సంచరించావు. ఏకాగ్ర పరత్వం అతిశయించ ముజ్జగ దక్షిణంగా రాజసూయ యాగం పూర్తిచేశావు. ఓ అమృతకిరణా! నిను బోలు ధన్యుడు జగతిలో వున్నాడా? అని ఖట్వాంగాయుధధరుడు శివుడు చంద్రుడిని సన్నుతించాడు.
ప్రతి మాస పూర్ణిమా దివసాన జపం, హోమం, అర్చనం, ధ్యానం, దానం, బ్రాహ్మణ సంతర్పణలు చంద్రేశ్వర స్థానంలో కావిస్తే, అనంత పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. ఏ పుణ్యుడైనా మా వంశంలో అమావాస్య తిథి సోమవారంనాడు కలిసి వస్తే, ఆ సమయంలో (కుహూ యోగంలో అమావాస్య సోమవారంతో కలిసి వస్తే దానినే కుహూయోగం అని వ్యవహరిస్తారు) చద్ర కుండ తీర్థంలో క్రుంకులాడి చంద్రేశ్వర దేవుని సందర్శించి, వసు గణాలకు, రుద్రాతిద్య గణాలకు తర్పణలు విడిస్తే అట్టి పుణ్యాత్ముడికి పితృదేవతల ప్రసాదం లభిస్తుంది. అట్టి పుణ్యపురుషుడి పితృ పితామహ ప్రపితామహులు ఆనందంతో నర్తించి నర్తిస్తారు’’ అని వాక్రుచ్చాడు.
ప్రతి అష్టమి తిథినాడు, ప్రతి చతుర్దశి తిథి రోజున సిద్ధయోగేశ్వరీదేవి, భవురాణి, చూడాలంకృత చంద్రకళావౌళి, స్వర్ణకర్ణ తాటంకాలు, వౌక్తికహారాలు, కేయూరాలు, మే ఖలా కింకిణులు, గాజులు- మొదలుగా గల దివ్య భూషణాలచే శోభిల్లు పింగళాహ్వయను, భవానిని వందారు బృందారక బృంద అయిన జగజ్జననిని, ఆదిభైరవ శక్తిని, కాళికాదేవిని చంద్రేశ్వర లింగ సమీప వర్తిని అయిన పార్వతిని చంద్ర కుండికా పవిత్ర సలిలాలలో స్నానమాడించి, గంధ పుష్ప మాల్యాదులు సమర్పించి సేవ చేసినవారిని ఏ విధమైన విఘ్నవులు చేరవు.
ఇది చంద్రలోక మహాత్మ్యం. ఈ ఉపాఖ్యానాన్ని ఆలకించినా పఠించినా ఆయా జనులకు ఆయుర్దాయం, ఆరో గ్యం, అనంతైశ్వర్యాలు సమగ్రంగా సంభవిస్తాయి’’ అని విశదం చేయగా, ఆ వాక్యాలు ఆలించి శివశర్మ హరికింకరులైన పుణ్యశీల సుశీలురతో ఈ గతి పలికాడు.
‘‘్భగ్య సంపదకలవారా! పరమ భాగవతులారా! మన కనుల ఎట్టఎదుట ఆకాశలక్ష్మి అనే లతాతన్వికి కేశబంధం మీద అలకరించుకొన్న ముత్యాలవల లాగు నక్షత్ర మండలం యింత అందాలు ఒలుకబోస్తూ వుంటుందా? ఇది ఎవరిలోకం? ఏ లోకం? విన కుతూహలం పొడముతున్నది. చెప్పవలసింది అని కోరగా ఆ హరి భటులీ విధంగా తెలిపారు.
నక్షత్రలోక వృత్తాంతము
సృష్టిని ప్రారంభించే సమయంలో బ్రహ్మపాదాంగుష్టం నుంచి దక్ష ప్రజాపతి జనించాడు. ఆ దక్షుడికి అరవై మంది కన్యలు కలిగారు. ఆ కన్యారత్నాలు రూపవతులు. లావణ్యవతులు. విలాసవతులు.

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి