భక్తి కథలు

కాశీఖండం 71

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారే రోహిణి మున్నగువారు. పచ్చ పసిమి ఛాయవారు.
ఆ రోహిణి ప్రముఖ కన్యలు కాశీ క్షేత్రంలో వరణాతీరంలో సంగమేశ్వర లింగం చేరువను శివుడి గురించి తపస్సు ఒనర్చారు. అక్కడ ఒక యెడ నక్షత్రేశ దివ్య లింగాన్ని ప్రతిష్ఠ సల్పి సహస్ర దివ్య సంవత్సరాలు తపం సల్పగా కపర్ది మెచ్చి, వచ్చి ‘‘వరములిస్తాను వేడుకొనండి’’ అని వాకొన్నాడు.
అంత ఆ దక్ష కన్యకలు పినాకితో ‘‘నినువంటివాడు మాకు వరుడుగా లభించాలి’’ అని వేడగా ‘‘అట్టివరుడే మీకు వరుడు అవుతాడు’’ అని శంకరుడు ఆ కనె్నలకి వరం ప్రసాదించాడు. అంతమాత్రమే కదా, సకల జ్యోతిర్మండలంలోను అగ్రగణ్యులు అవుతారు. మేషం, వృషభం ఇత్యాది ద్వాదశ రాసులకీ కారణం అవుతారు. ఓషధరాజు, ద్విజరాజు అయిన చుక్కల రాయడికి మీరు సతులు అవుతారు.
మీచే ప్రతిష్ఠితం అయిన నక్షత్రేశ్వర లింగాన్ని అర్చించేవారికి భోగం, మోక్షం లభిస్తాయి. చంద్రలోకానికి మీ నక్షత్ర లోకం పైలోకం కాగలదు. అన్ని చుక్కల నడుమ మీరు చక్కని చుక్కలై మాననీయలవుతారు’’ అని ఆన యిచ్చి పరమ శివుడు అంతర్థానం చెందాడు. ఇదీ తారకాలోక వృత్తాంతము అన శివశర్మ విని తర్వాత ముందట బుధలోకాన్ని కనుగొన్నాడు. ‘‘రజనీకాంతుడికి ప్రతిబింబమో, అమృతకిరణుడికి ఆధ్యాహారమో, విధుడికి వినిమయమో, అత్రి నేత్ర సంభవుడికి అన్వాదేశమో, అనంగుడి సఖ్యుడికి వీప్సయె జలధి సంభవుడికి ఆమ్రోడితమో, పద్మవైరికి మారుపేరో, చంద్రుడికి సారూప్యమో.. పారిజాత వల్లరి రాల్చిన పువ్వో శివ శిరోమకుట భూషణం అయిన చంద్రుణ్ణి అతిశయిస్తాడు అంటారు. విష్ణు భటులారా! నడిమింటి గ్రహాల్లో ఇతను ఎవరు? ఈ వనె్నలరేడు ఈ లోకాన్ని సంభ్రమ పరిపూర్ణమూ, విలాసవంతమూ, అనురాగమయమూ, శృంగార రమణీయమూ కావిస్తున్నాడు. కన్నులను ఆకర్షించే సిద్ధాంజనమూ, మనోవశీకరణానికి మంత్రమూ, ఇంద్రియావేశాలకి బొక్కుతుందా, కుతూహలానికి సంతోషం, సౌభాగ్యానికి మూలికాది సిద్ధయోగం, అనంగుడికి పునర్జన్మ, వనానికి సావ్రాజ్య వైభవాన్ని కల్పిస్తున్నాడు. పదునారేండ్ల రుూడు గల ఈ గ్రహగ్రామణి ఎవరు?’’ అని తెలియగోరాడు. అప్పుడు హరిసేవకులు శివశర్మతో ఈ ప్రకారం వచించారు.
‘‘మధురానగరీ విప్రవంశోత్తమా! బ్రహ్మవంశోద్ధారక! శివశర్మా! ఈ పవిత్ర కథ ఆలించు. ధర్మకథలు క్రమక్రమంగా చెప్పుతూ వుండగా ఆలకిస్తే వీనులారా వింటూ వుంటే- చెప్పేవారికి, వినేవారికి- ఉభయులకి మిక్కిలి దవ్వుగా వున్న విష్ణులోకం ఏగుతూ వున్న తరిని మనకి మార్గాయాసం కలుగదు. విఘ్నములున్ను తొలగిపోతాయి.
ఇదుగో- ఇది బుధలోకం. ఎవడు రాజసూయయాగం ముల్లోకాలను దక్షిణగా చేసి పరిపూర్తి కావించాడో, దక్ష ప్రజాపతి ఇర్వదేడుగు కుమార్తెలు ఎవడికి ముద్దు భార్యలో, వలరాచదొరవారిని పదటు చేసిన ఫాలక్షుడి జటామకుటాగ్రానికి ఎవడు అవతంస కుసుమమా ఎవడు చతుర్ముఖ బ్రహ్మ తేరెక్కి అష్టాదశ ద్వీపాలు అసివారు (వాహ్యాళి) తిరిగాడో, చంద్రికాధవళపైన వెలిపట్టు శాటి అయిన మన్మథుడి జగజంపు గొడుగు (ముత్యాల జాలరులు వ్రేలాడు) ఎవడో ఆ చందమామ వౌక్తిక సింహాసనం అధిరోహించి పెద్దకాలం వసుధని పాలించాడు.శైశవంలో చిననాట శాస్త్రం అధ్యయనం చెయ్యడం కోసం ఏతెంచి, గురుపత్ని అని ఏ సతి ఎడ భక్తి చెడక వుండేవాడో ఆ గురువు ప్రియపత్ని పూర్ణ చంద్రబింబాభిరామ వదన తార ఆనాటి నుండే తామరల దాయ అయన చంద్రుడన్న మనసుపడ దొరకొంది.

-ఇంకాఉంది