భక్తి కథలు

కాశీఖండం 72

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేణిచొళ్లెమున్ను, పట్టుదట్టీయున్ను, రక్షకై కట్టిన పసిడి తాయెతులున్ను, కంఠహారాలున్ను, కాలిమట్టెల పైడికాంతులున్ను, లీలా విలాసపు పెంపు అతిశయింపజేయగా ఆ చంద్రుడు తన విద్యాభ్యాసన కాలంలో పునః పునః తార నిడుదవాలిన కన్నులకు కన్నుల పండుగ చేస్తూ వుంటాడు.
విద్యాధ్యయనానికి ఏతెంచిన తొలినాళ్లలో ఆచార్యుడి కూరిమి సతి అని కొన్ని నాళ్లు కనెత్తి చూడనిచ్చగించలేదు. కొన్నాళ్లకు యెడ ఉవ్విళ్లూరుతూ వుంటే తార తన వంక చూడని వేళల్లో ఆమెని కనుగొనసాగాడు. మరికొన్నాళ్లకి గురుపరోక్షంలో ఏకాంతాన్ని కల్పించుకొని గర్భోక్తులతో మేలములాడసాగాడు. కొన్ని కొన్ని రోజులు ఏదో నెపం కల్పించుకొని వివిధాంగాల సంస్పర్శనం చేస్తాడు. మరికొన్ని వాసరాలలో వలచి, కోర్కి జనించి మీదపడతాడు. తన మనస్సున అనురాగ సంపద చివుళ్లు తొడుగ కవయ మొదలిడినది మొదలుకొని చంద్రుడు తారని అంతఃపురంలోనే వుంచసాగాడు. తొలుత తొలుత పాలకడలి కొడుకు అత్యంత భక్తితత్పరతో గురువు సన్నిధిని ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. పిదప చిగురాకు శయ్యమీద తార వద్ద అనురక్తితో ....... శాస్తప్రు మినుకులు అభ్యాసం చేశాడు.
పుట్టుకతోడనే శ్రీమంతుడు కావడం అనుచితం. మిక్కిలి చక్కని వాడవడం మేలున్నూ కాదు. నవ వన ప్రకాశం కలవాడ అవడం పాపం. అరసి చూడగా మంచి గుణములే అవగుణాలుగా పరిణమించుతాయి.
ప్రభువుల కడగంటి వీక్షణాంచలాలు అధిక అహంకారం అనే కాలకూట విషాగ్ని కణములను పోలి భీకరాలు, రాజుల పలుకుల తీరుతెన్నులు దుర్వార గర్వం వారి గొంతు పట్టుటవల్ల డగ్గుత్తిక పడి ఘర్ఘరధ్వని సల్పుతుంది. రాజుల వినయగుణం అస్మితక్లేశంవల్ల జనించిన గర్వం అనే అపస్మార వ్యాధి సోకి స్థిరత్వాన్ని కోల్పోయి వుంటుంది. వారి మనస్సు హద్దులేని దర్పభారం అనే వేడికలదాహజ్వరం కాయడంవల్ల పెక్కు వికరాలకి నిలయమై వుంటుంది. పాద విన్యాసం స్వాభిమానం అనే సన్నిపావక జ్వరంవల్ల పుట్టిన సకల అంగాలకు వణుకు కల్గిస్తుంది. అది ఆ పగిది వుండడం రాజుల దోషమా? ధరణీ రాజ్యభూతం దోషం.
భువనాలకన్నింటికి ఏకైక ధానుష్కుడు అయిన మన్మథుడి పూవమ్ము ఏటుపడని మానవుడు, అత్యధికమైన క్రోధాంధకారంవల్ల దర్పించి కన్నులు కానని నరుడున్ను, హద్దులేని లోభ నిద్రాభారంవల్ల ఒడలు తెలియక వర్తించు జనుడున్ను. శ్రీలక్ష్మీదేవి కటాక్ష విలాసం అనే మద్యం ఆకంఠం క్రోలి మత్తెక్కి మైకం కమ్మిన జీవుడున్ను కానినేడు లోకంలో కనరాడు. ఒకవేళ కానవస్తే అట్టి ప్రభువు సమస్త భూప్రజల పాలి దేవతయే కదా! బాహ్య శత్రువులను పరిపాలించుకొనవచ్చు. అంతశ్శత్రువుల్ని జయించడం ఎంతటి వాడికైనా అలవికాదు. కలువ రేకుల కన్నులు కల తార వలపు కొనలు ననలుసాగ- తూర్పు దిక్కొంత ప్రాతస్సమయంలో సూర్యుణ్ణి గర్భమందు ధరించు రీతిగా చూలు తాల్చెను. గర్భసంస్థితుడైన గ్రహశ్రేష్టుని నిర్మలయశస్సు స్ఫూర్తి వెలుపలకి ప్రసరించిన రీతిగ తార శరీర వల్లరి విరిసిన లొద్దుగ పువ్వుల కాంతిలాగున కాలక్రమాన తెల్లపడసాగెను. గర్భస్థితుడైన బుధుడి యొక్క సద్గుణ భారం వల్లనా అనే విధంగా ఆమె తేలికగా సంచరించలేకున్నది. అమృత ధారల రసాస్వాదనవల్ల తనివి పొందినదాని మాదిరి ఓగిరం పట్ల ఇచ్ఛని విడనాడింది.
పూర్ణచంద్రబింబ సంకాశ వదన అయిన ఆ తార స్థూల గర్భభారంవల్ల అలస అయివుందిన్నీ సంతత సుస్థిర భక్తి భరితాంతరంగంతో పెద్దవారికి ఆవృద్ధులు వలదు వలదు అని వారిస్తున్నా సమీపంలో వున్న చెలిమికత్తెల చేయూతకై కొని లేచి ఎదురుగా వచ్చి గౌరవిస్తూ వుంటుంది.

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి