భక్తి కథలు

కాశీఖండం 73

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశస్తావయవాలు కల ఆ తార ఒక్కొక్క పరి సౌధాంతరంలో సమున్నత మణిమయ స్తంభానికి చేరగిలబడి బంగారు సాలభంజిక కరణి నిలుచుండిపోతుంది.
దొండపండును పోలిన అధరోష్ఠం కల ఆ తార క్రీడా సౌధంపయిన లీలా విహార సమయాల్లో నితంబ భర, పీనస్తనభర, గర్భభారములచేత సుకుమారం అయిన శరీరం అలసటకి గురికాగా మణిఖచిత కుడ్యాలలో కనవచ్చే తన ప్రతిబింబం హస్తావలింబాం ఇస్తే ఎంత మేలుగా వుండేది అని తలుస్తూ వుంటుంది. తార ఆ భవనాంతర కేళీవనంలో నితరువుల్ని, లతన్ని అవలంబంగా చేకొనడం అద్భుతం కాదు. గర్భభరాలస అయి విహార భవన మణిస్తంభాల నుంచి ప్రసరిస్తున్న కిరణాంకురాల్ని సైతం చేయూతగా పట్టుకొనబోతుంది.
కూర్మి చెలిమికత్తెలను ఆమె తన గృహకృత్యాల నిమిత్తం వినియోగింపజాలకున్నది. గర్భభార గరిమివల్ల తానున్ను పనులు చేయలేదు. ఇంక వేరే చెప్పేది ఏమి వుంది?
అంతకుముందు నెచ్చెలికత్తెలు పరిహాసార్థం పలుమార్లు అవలీలగా అధిరోహించే క్రీడాశైలం ఎక్కుమని సూచించగా నిండు గర్భభరంవల్ల తార భయపడింది. ఆగర్భ శ్రీమంతురాండ్రు గుండెధైర్యం కలవాళ్లు కాదు.
అంత అక్కడ దేవతల గురువు బృహస్పతి తన శిష్యుడు చంద్రుడు ఒనర్చిన ద్రోహాన్ని అపరాధాన్ని పత్నీ విరహవేదనవల్ల బాధపడుతున్న మనస్సు కలవాడై హరిహర బ్రహ్మలకున్ను, ఇంద్రాది దేవతలకున్ను తన బాధను వెళ్లబోసుకున్నాడు. నిర్జరనాథుడు ఇంద్రుడు ముఖ్యులతో మంతనమాడి అది ఉచితం కాదన్నాడు. యమధర్మరాజు మహాపాతకం అని చంద్రుణ్ణి దెప్పిపొడిచాడు. అగ్నిదేవుడు అనుచితం అని నుడివాడు. నిరృతి ఇంతటి దుర్మార్గుడి లక్షణం అని వాకొన్నాడు. వరుణదేవుడు దుష్కర్మ అని పలికాడు. వాయుదేవుడు అపకీర్తి అని నిందించాడు. యక్షరాజు కుబేరుడు ఇంతకన్నా అన్యాయం వినము కనము అని వాక్రుచ్చాడు. ఈశానుడు గురువు విషయంలో ఎంత మాత్రం చేయకూడని పని అని తూలనాడాడు. దేవతలందరు హేతువుల్ని దృష్టాంతాల్ని చూపి, అన్వయ వ్యతిరేక మార్గాలలో చంద్రుడికి పలు విధాల బుద్ధి కరపారు. ఎవరు ఎన్ని విధమలుగా నచ్చచెప్పినా చంద్రుడు ఆ నీతులు చెవినిపెట్టలేదు. తారని విడిచిపెట్టలేదు. అంతట భైరవుడిని మించిన భీకరమైన అట్టహాసంతో శివుడు ప్రమథగణంతో కూడా తాకాడు. అప్పుడు చంద్రుడున్ను వేల్పుల్ని ఎదుర్కొని, ఆకాశ ప్రాంగణ భూమిలో చుక్కల గుంపుకి భీతిహేతువై తారకామయం అనే సమరం పురారికి పద్మవిరోధికి ప్రవర్తించింది. అన్యులు ఎంతటివరైనా ఆగ్రహంతో శివుడితో ఆజి సల్పడం ఏ రీతిగా సాధ్యం అవుతుంది. శీతకిరణుడు శివుడి అష్టమూర్తులలో ఒక మూర్తి కావున ఎదుర్కొని నిలిచి శివుడితో రణము సల్పగలిగాడు. అప్పుడు చంద్రుడు గర్వాతిశయంతో బ్రహ్మాండకర్పరం జ్యానిర్ఘోషల చేత కలగుండుపడు విధంగా, అత్యంతమూ తీవ్రమైన ఆటోపటం కల బాహుదర్ప సరంభంవల్ల చక్రాకారంగా ఏర్పడే గాండీవం నుంచి మహానిశితాలైన బాణాలు ప్రయోగిస్తూ పార్వతీ పతిని పొదివికొన్నాడు.
ఈ విధంగా ప్రతిఘటించి అవార్య విక్రమంతో పెచ్చు రేగి నిశాకరుడు చిచ్చులు ఉమిసే శిలీముఖాల్ని శరీరాన నాటి ఆర్చి పేర్చి శంఖమెత్తి సింహనాదం కావించి గాండీవజ్యాఘోష భూనభోంతరాల నిండగా, నందీశ్వర, మహాకాళ, నికుంభ, కుంభోదర ప్రముఖ ప్రమథులతో సహా, తన్ను నొవ్వచేయ, ఫాలలోచనుడు ఎర్రవారిన కంటికొనలతో తన పినాక ధనువు బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని సంధించాడు.

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి