భక్తి కథలు

కాశీఖండం 74

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివుడు త్రిపురాసురుల భార్యల చెక్కిళ్ల రచించబడిన గజాకార మకరాకార కస్తూరికా పత్రములు తుడిచిపెట్టినవాడు. జలంధరాక్షసుడి హృదయ గర్వాన్ని నాశనం చేసినవాడు. గజాసురుడి శిరోగ్రభాగాన్ని అణచివేసినవాడు. ధక్షుడి అధ్వరం అనే లేడిని చంపడంలో క్రూరమైనవాడు. హిమగిరి కన్య అయిన పార్వతీ దేవి భ్రూవల్లీ విలాస రేఖామాదిర లలిత శృంగం కలదీ అజగవం ఆ అజగవం లేక పినాకం అనే ధనుస్సులో శివుడు బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని సంధించాడు.
ఆ విధంగా శ్రీకంఠుడు మొక్కవోని పరాక్రమంతో ఆ దివ్యాస్త్రాన్ని కూర్చి వింటిని ఆకర్ణాతమూ తివిచి, చంద్రుని వంక చూడగానే ముజ్జగాలు ప్రకంపించాయి. దిక్కులు అల్లల్లాడిపోయాయి. సముద్రాలు ఉప్పొంగిపోయాయి. పంచమహాభూతాలున్నూ భీతిపొందాయి. కుల పర్వతాలు వ్రయ్యలు అయాయి.
ఆ ప్రమాదకర సమయంలో బ్రహ్మదేవుడు చంద్రుడికి అడ్డం వచ్చి ప్రమథనాథుడయిన శివుడి రోషాన్ని మాన్పాడు. చంద్రుడు ఉచితి విధిని బుద్ధి చెప్పి మచ్చరం పోగొట్టి దేవగురువు బృహస్పతికి భార్యని ఇప్పించాడు.
చంద్రుడు అమృతమయుడు, కనుక ఆ శీతాంశుడి సమాగమంవల్ల తారకి ఎట్టి అపవిత్రత కల్గలేదని హరిహర బ్రహ్మలు నిర్ణయించగా, బృహస్పతి తారను మరలా పరిగ్రహించాడు. చంద్రముఖి అయిన తారను శశాంకుడు ఎట్టకేలకు త్యజించాడు.
సతీ! ఈ గర్భం తాల్చడానికి కారణం నేనా? చంద్రుడా’’ అని అంగిరసుడైన బృహస్పతి రహస్యంగా అడిగాడు. ఎంత అడిగినా చంద్ర సంకాశ వదన తార సిగ్గుపడుతుందేకాని చెప్పదు.
చెప్పకున్న కినిసి బృహస్పతి దర్ఫమంత్రించి ఆమె గర్భాన్ని కరిగించి వెయ్యాలని యత్నించాడు. అంత దేవతలు ఆ తారను పిలిచి వెరవకు. నిర్భీతిగా నిక్కం వచించు. నీకు ఏ చింతా చీకూ కల్గదు అని వచించారు.
దేవతలు ఆ రీతిని వచించినా తార ఒక్క మాట అయినా పల్కకుండా మిన్నకుండిపోయింది. సిగ్గుతో తల వాల్చుకొని కూర్చుండిపోయింది. అప్పుడు పద్మసంభవుడు అల్లిన తారను చేరవచ్చి ‘‘ఓ దేవీ! నిజం పలుకు. చంద్రుడి సంసర్గంవల్ల గర్భం తాల్చావా? లేక అంతకు పూర్వమే బృహస్పతిని కూడి తాల్చిన గర్భమా? అని ప్రశ్నించాడు.
అంత జలజదళాయతాక్షి తార కేలుగవ మోడ్చి బ్రహ్మతో తేటతెల్లం అయేటట్లు సూక్ష్మమైన వాక్కుతో ‘‘పద్మభవా! చంద్రుడి సంగతివల్ల గర్భం తాల్చాను’’ అని పలికింది.
అనంతరం దేవగురుడు బృహస్పతి తారకు జనించిన పుత్రుణ్ణి చంద్రుడికి ఒప్పగించాడు. చంద్రుడున్ను తన నందనుడికి ‘బుధుడు’ అని నామకరణం చేశాడు. పిమ్మట ఆ బుధుడు తన తండ్రి చంద్రుడి అనుజ్ఞ పడసి, కాశీక్షేత్రానికి ఏగి ఆ క్షేత్రంలో బుధేశ్వర లింగాన్ని ప్రతిష్ఠ చేసి చిరకాలం తపం ఆచరించాడు. ఆ క్రియ తపం సల్పే తిరిని ఆ బుధేశ్వర లింగంలో సాక్షాత్కరించిన కపర్దిని సోత్రం కావించాడు. ఆ స్తుతికి గరళకంఠుడు మురిసి ఆ బుధుణ్ణి నక్షత్ర లోకానికి పైభాగంలో వున్న లోకానికి అధిపతిని చేశాడు.
కాశీ పుణ్యక్షేత్రంలో చంద్రకుండం చెంత వున్న చంద్రేశ్వర లింగానికి తూర్పు దిక్కున వున్న బుధేశ్వర లింగాన్ని సేవించిన మానవుడు ప్రాణాలు కోల్పోయే సమయంలో కూడా పరమ జ్ఞాన పదం నుంచి భ్రష్టుడు కాడు.
ఈ క్రియను అనఘమతులైన గోవింద కింకరులు బుధుడి గాధ తెల్పుతూ వుండగా నభోంతరంలో ఒక దివ్య విమానం పుణ్యకర్ముల నిలయం అయిన శుక్రలోకానికి సమీపంగా ఎగిరి వెళ్లింది.

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి