భక్తి కథలు

కాశీఖండం 76

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాలిన తత్‌క్షణం ధరణీస్థలంలో పద్మరాగముల కాంతిని పోలిన కాంతితో ఎట్టఎదుట ఒక దివ్య కుమారుడై నిలబడి వున్నాడు. శంభుడు ఆ కుమారుణ్ణి తన తనయుడుగా ఆదరించాడు. భూదేవి కూడా అతణ్ణి పుత్రుడిగా భావించింది. ఆ కుమారుడు అచంచల చిత్తంతో తపం సల్పగోరాడు.
ఆ రీతిగా తపస్సు చేయతలపెట్టి ఏ నగర సమీపంలో ఉత్తర వాహిని అయి గంగా నది ప్రవహిస్తోంది. ఏ నగరం తల పొలంలో వరణానదీ జల ప్రవాహంలో అసి నదీ జలం సంగమిస్తోందో, ఏ వీటికి అయిదు క్రోసుల మేరలో చేసిన తపము, మేలిమి, ముక్తి ఫలాన్ని ఒసగుతోందో, ఏ పురాన్ని పార్వతీ దేవినికంటే అవ్యాజానురాగంతో ప్రేమిస్తాడో అట్టి ఘనత వహించిన కాశీకి మహాదేవుడి ఆన చేత ఏతెంచి, దురిత కాననాలకి అంగారకుడు (అగ్గి) సకల ప్రాణులకి తల్లి అయిన ధరణికి కుమారుడు అయిన అంగారకుడు (కుజుడు) మహానిష్ఠ కలవాడయి తపస్సు ఒనర్చాడు.
‘పాంచముద్ర’ అనే పేరుకల పవిత్ర స్థలంలో కంబళాత్వతరేశ్వర లింగానికి దగ్గరగా నియతితో అంగారకేశ్వర లింగాన్ని ప్రతిష్ఠ చేసి, కుజుడు ఈ లోకాన్ని పాలించగలిగాడు. ఇది అంతా అంగారక లోక వృత్తాంతం అని తెలుసుకొనేది.
బృహస్పతి లోక వృత్తాంతము
భూసురవతంసా! అదే బృహస్పతి లోకం. కను. బహవిధ శుభాలకి, నానావిధ సంపదలకి స్థానం. ఈ దేవగురుడు సకల ధర్మశాస్త్రాలని, అర్థశాస్త్రాలని మూలముట్టుగా చదివినవాడు. సర్వశాస్త్ర పారంగతుడు.
ఆంగిరసుడయిన ఈ బృహస్పతి కాశీ పవిత్ర క్షేత్రానికి చని ఆ క్షేత్రంలో తన పేర శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ లింగ సమీపంలో బహుదివ్య వర్షాలు తపస్సు చేసి శంకరుణ్ణి మెప్పించాడు. శంభుడు ఆ బృహస్పతి తపస్సుకి మెచ్చి ఎదుట ప్రత్యక్షం అయాడు. సాక్షాత్కరించిన ఆ విరూపాక్షుణ్ణి దేవగురుడు ఈ గతి సంస్తుతించాడు.
‘‘శంకరా! జయం. నాశరహితా! జయం. చంద్రధరా! గిరీశా! భక్తవత్సలా! సూర్యచంద్రాగ్నినేత్రా! గజాసుర సంహారకా! శుభకర విధుల్ని వృద్ధి చేయువాడా! శాంతస్వభావా! కరుణామధురా! చతుర్దశ భువన రక్షకా! పరమ పవిత్రా! భూతనాధా! భవ! పన్నగాభరణా! శుభకరా! శివ! దేవ! మహేశా! విశిష్టమతీ! సంసార దుఃఖ నాశకా! మోక్షఫలదాతా! పాపహరా! ఆశ్రీతుల పాపాలను హరించు దేవా! సిద్ధవంద్యా! పార్వతీధరా! చిత్ (జ్ఞానం) చేత తెలియబడువాడా! జననమరణ నాశకా! హరిసుతా! సంతతమూ ప్రణవ నాదం అనే సౌధంలో రమించే వేల్పా!
ఈ భంగి మధుర కవితా కళాక్రమాన్ని పాటించి ఆరభటి కావ్య వృత్తితో భక్తి పారవశ్యుడై వేగంగా తోటకములు అనే వృత్త్భేదాలతో శశిధరుని సంస్తుతించాడు.
ఆ రణభీతీ వృత్తితో, ఆటోపంతో తోటక వృత్త పద్యాలు పలుకుతూ దేవగురువు బృహస్పతి పునఃపునః తన్ను ఈ పగిది స్తోత్రం సల్పుతూ వుండగా, శివుడు ఆ స్తోత్రంలోని చాటుప్రౌఢికి ప్రశంసాపూర్వకంగా శరఃకంపం కావించాడు. ఆ వేళ శివజటాజూటాగ్రంలో పొంగి పొరలుతున్న మందాకినీ తరంగ పంక్తులు ఉరవడించి బ్రహ్మకపాల రంధ్రాలలో నిండి ప్రతిధ్వనించాయి. ఈ విధంగా సదాశివుడు సంప్రీతుడు అయాడు.
రాశీభూతనిష్ఠతో ఉగ్రమైన బృహత్తపస్సు ఒనర్చావు. కనుక ‘బృహస్పతివి’ అవు. నా జీవనానికి జీవం అయిన భక్తి నా యెడ కనపరచావు కనక ‘జీవుడు’ అనే నామం వర్తిస్తుంది. వాగ్వైభవంతో కైవారం చేశావు కావున వాచస్పతిత్వానికి అర్హుడివి అవుతావు. ఈ మధురాలైన తోటక వృత్తాలు పఠించే వారికి ప్రాభవస్ఫురణం లభిస్తుంది.

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి